By | November 5, 2021

ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా అర్ధికంగా వృద్ది చెందుతాయి?  ఒక రంగానికి అనుషంగికంగా ఉండే మరికొన్ని రంగాలు వృద్ది చెందుతాయి.


ప్రపంచంలో ఒక రంగం వృద్ది చెందితే


క్రికెట్ పోటీలు జరిగే వేళ టివీ రంగం ఆర్ధిక ప్రయోజనం కలుగుతాయి. అదే సమయంలో టివి ప్రకటనలు ఇచ్చే సంస్థలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. టివి ప్రకటనలలో వచ్చే వాణిజ్య ప్రకటనదారు కంపెనీల అమ్మకాలు పెరగవచ్చును. ఇలా అనుబంధంగా ఉండే సంస్థలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది.


ఇంటర్నెట్ అందించే సంస్థలు 4జి స్థాయికి వృద్దిని సాధించారు. తత్ఫలితంగా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలకు అమ్మకాలు పెరిగాయి. విపరీతంగా 4జి స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు పెరిగాయి. 4జి అమ్మకాలు పెరగడంతో వివిధ యూట్యూబ్ ఛానల్స్ ఆదాయం పెరిగింది. వ్యాపార ప్రకటనలు మనిషి మరింత చేరువయ్యాయి. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో, స్మార్ట్ ఫోన్ రిపేరింగ్ షాపులు, స్మార్ట్ ఫోన్స్ స్పేర్స్ అందించే షాపులకు ఆదాయం బాగుంటుంది. ఇంకా ఆన్ లైన్లో వివిధ విక్రయాలు జరిపే సంస్థలకు 4జి వినియోగం వలన ప్రయోజనాలు కలిగాయి. ఇలా ఏదైనా ఒక రంగం బాగా వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఆర్ధిక వృద్దిని సాధిస్తాయి.


అంటే ఒక సేవ ప్రారంభిస్తే, ఆ సేవను ఉపయోగించుకోవడానికి పరికరాలు అవసరం అవుతాయి. అలా ఒక సేవకు ఆదరణ పెరిగితే, ఆ సేవను ఉపయోగించుకోవడానికి అనువుగా ఉండే పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది.


ఒక కొత్త వస్తువు ఆవిష్కరింపబడితే, ఆ వస్తువుకు ఆదరణ పెరిగనప్పుడు ఆ వస్తువు యొక్క విడి భాగాల అవసరం ఏర్పడుతుంది. ఆ వస్తువు యొక్క విడి భాగాలను తయారు చేసేవారికి డిమాండ్ పెరుగుతుంది. వాటిని విక్రయించేవారికి ఆదాయం ఉంటుంది. ఇలా ఒక వస్తువు బాగా ప్రసిద్ది చెందినప్పుడు ఆ వస్తువు పని విధానం తెలియజేస్తూ కూడా ప్రయోజనం పొందే అవకాశం నేడు మీడియా వ్యవస్థలో ఉంటుంది.


కావునా ఏదైనా ఒక రంగం కొత్తగా వృద్ది సాధిస్తుంటే, దానికి అనుబంధంగా ఉండేవాటి వలన కూడా ప్రయోజనాలు ఉన్నప్పుడు ఆయా అనుబంధ రంగాలలోనూ వృద్ది ఉంటుంది.