పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి విషయాలు మనిషి చుట్టూ ఉంటే, అలాంటి ప్రభావం మనిషిపై ఉంటే, మనిషి చుట్టూ వెలుగు నీడల మాదిరి మంచి చెడులు ఉంటాయి.
గుడిలో దైవం గురించి ఆలోచనలు పెరిగిన మనిషికి, ఆ గుడిలో గోవిందుడి గురించే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మనసు గోవిందుడి లీలలపై ఆసక్తి పెంచుకుంటుంది. గుడిలో విగ్రహంపై ఉన్న పరిశీలన దృష్టి, ఆ కదలని గోవిందుడి గురించి ఆలోచనలు కలిగే విధంగా ప్రభావం చూపుతుంది. భక్తి పురోగతికి గుడిలో విగ్రహాన్ని పరిశీలనగా చూడడం నాంది అయితే…
బడిలో టీచర్ చెప్పే పాఠాలు విధార్ధి చెవికెక్కితే, ఆ విద్యార్ధి ఆ పాఠలలో ఉన్న సారమేమిటో తెలుసుకోవాలనే తపన ఉంటుంది. బోధనా విషయంపై ఉండే పరిశీలన దృష్టి, ఆ బోధనా విషయంలో లీనమయ్యే స్వభావం ఏర్పడే విధంగా ప్రభావం చూపుతుంది. అంటే విద్యార్ధికి సబ్జెక్ట్ పరిశీలన అతని పురోగతికి నాంది అవుతుంది.
అమ్మ ఒడిలో పెరిగిన బాలుడు నాన్నను పరిశీలిస్తూ, నాన్నవలె అనుకరణ మొదలు పెడతాడు. నాన్నను పరిశీలనగా చూడడం వలన లోకరీతికి అనుగుణంగా మారగలిగే పురోగతి ఆ బాలుడికి కలిగే అవకాశం ఉంటుంది.
బాల్యం నుండే ప్రారంభం అయ్యే పరిశీలన పురోగతికి నాంది అవుతుంది. ఎటువంటి అంశాలలో ఆసక్తి పెరుగుతూ ఉంటే, అటువంటి విషయాలలో నిష్ణాతుడు కాగలిగే అవకాశాలు పరిశీలన దృష్టి బలం బట్టి ఉంటుంది.
బడిలో చెప్పే పాఠలలోని సారం గ్రహించిన విద్యార్ధికి, మరొక పుస్తకం వ్రాయగలిగే శక్తి ఏర్పడవచ్చు. లేదా ఆ పుస్తకంలో విశీదీకరించిన విషయ విధానం ఆధారంగా మరొక కొత్త విషయం కనుగొనగలిగె శక్తి ఏర్పడవచ్చు… ఇదంతా ఆ విద్యార్ధి శ్రద్దాశక్తులను బట్టి ఉంటుంది… పరిశీలిస్తే ప్రభావంతమైన విద్యార్ధిదశలోనే జీవితనికి పునాది ఏర్పడుతుంది.
వ్యక్తి దృష్టిలో మంచి చెడులు పరిశీలన వలన అవగాహన ఉంటుంది.
ఒక వ్యక్తి బాల్యం నుండి అతని చుట్టూ అనేక విషయాలు ఉంటాయి. వాటిలో మేలు చేసే విషయాలు, దారి మళ్లించే విషయాలు ఉంటాయి. అతని దృష్టికి వచ్చే విధంగా మంచి చెడు విషయాలు ఉంటాయి.
చదువుకునే వయసులోనే చదువుపై శ్రద్దను దారి మళ్లించే విషయాలు వస్తాయి. వాటిని వదిలి చదువుపై దృష్టి పెట్టడం విధ్యార్ధి కర్తవ్యం.
బాలురకు తమ చుట్టూ ఉండే విషయాలను పరిశీలించే శక్తి పెరుగుతున్న కొలది, ఎటువంటి విషయాలు బాలుర చుట్టూ ఏర్పడుతూ ఉంటే, అటువంటి విషయాలపై దృష్టి సహజంగా ఏర్పడుతుంది. అది కుటుంబ జీవన పద్దతుల బట్టి ఉంటుంది.
స్వతంత్ర్యంగా వ్యవహరించే వయస్సు వచ్చేటప్పటికీ, తమకు ఏర్పడిన స్వభావాన్ని బట్టి సమాజంలో విషయ శోధన చేస్తూ ఉంటారు. అటువంటి వయసుకు వచ్చేవరకు ఎటువంటి విషయాలపై ఆసక్తి పెరిగి ఉంటే, అటువంటి విషయాలలో మనసు బలం చూపుతుంది.
పరిశీలన దృష్టి పెరుగుతున్న కొలది, తమ చుట్టూ ఉండే పరిశీలనాత్మ విషయాలు తమపై ప్రభావం చూపుతున్నట్టు, ఎదిగే వయస్సులో తెలియబడదు. పరిణితి పెరిగాక మాత్రం అప్పటికి ఏర్పడిన పరిశీలన దృష్టిని బట్టి తమపై తమ చుట్టూ ఉన్న విషయాలు ఎలాంటి ప్రభావం చూపించాయో కనుగొనగలుగుతారు.
మోటారు వాహనాల రిపేరింగ్ షెడ్డులో ఎదుగుతున్నవారు, మోటారు వాహనం పార్టులుగా విడదీసి, మరలా వాటిని యధాస్తితిలో అమర్చగలిగె శక్తిని పొందగలిగే అవకాశం ఎక్కువ… ఈ శక్తి ఆ ఎదిగేవారి పరిశీలనను బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ ఆ ఎదుగుతున్న బాలుడి చుట్టూ మోటారు వాహనం రిపేరు విధానం, అతని డ్రుష్టికి వచ్చే విధంగా ఉంటుంది. అతడు ఆ విధానంపై దృష్టి పెడితే, పరిశీలన పెంచుకుంటే, మోటారు మెకానిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
ఇలా ప్రతివారు చుట్టూ నేర్చుకునే విషయ విధానాలు ఉంటాయి. వాటిని పరిశీలన చేయడంలో పెట్టె దృష్టిని బట్టి, ఆయా విషయాలు పరిశీలనకు వస్తాయి.
తమ చుట్టూ ఉండే విషయాలలో ఎంతటి పరిశీలన ఉంటే, వాటిపై అంతటి ఆసక్తి. అలాగే ఎలాంటి విషయాలలో పరిశీలన ప్రారంభం అయితే, అలాంటి ఆలోచనలకు పునాది ఏర్పడుతుంది.
సమాజంలో మంచి చెడులు వెలుగు నీడలు వలె కలిసే ఉంటాయి. వాటిని వేరు చూసి వెలుగులో జీవిస్తే, మరొకరికి వెలుగు పంచే విధంగా జీవితం ఉంటుంది. లేక పోతే చెడు అనే విషయ లాలస చీకటిలో ప్రయాణించే విధంగా ఉంటుంది. పరిశీలన పురోగతికి పునాది అయితే అది ఎలాంటిదో మనమే పరిశీలించుకోవాలి.