By | November 7, 2021

పుస్తక పఠనం వలన ఉపయోగాలు చాలానే ఉంటాయని అంటారు. పుస్తకాలు చదవడం వలన జ్ఙానం పెరుగుతుంది. పుస్తకాలు చదవడం వలన విషయాలలో సారం అర్ధమవుతుంది. ఎందుకంటే పుస్తకాలలో వివిధ విషయాల సారం వివరించబడి ఉంటుంది. పుస్తకాలలో వివిధ విధానాల గురించి లేక పద్దతుల గురించి వివరించబడి ఉంటుంది.

పుస్తకాలు చదవడం వలన ఒక విధానం గురించి అర్ధం అవుతుంది. అది వస్తు తయారీ విధానం కావచ్చును. సంస్కృతి సంప్రదాయం కావచ్చును. ఏదైనా ఒక పద్దతి గురించి అక్షర రూపంలో వివరించబడి ఉంటే అది పుస్తకంలోనే నిక్షిప్తం అయి ఉంటుంది కాబట్టి మరలా అటువంటి పద్దతి భవిష్యత్తులో తెలుసుకోవాలంటే పుస్తక పఠనం వలన సాధ్యపడుతుందని అంటారు.

వ్యక్తి పుట్టిన నాటి నుండి తల్లి కొన్ని విషయాలు తెలియజేస్తూ వస్తుంది. తండ్రి కొన్ని విషయాలు తెలియజేస్తూ వస్తాడు. గురువు ఎన్నో విషయాలు తెలియజేయడానికి చూస్తాడు. స్నేహితుడు కొన్ని విషయాలు తెలియబడడానికి కారణం కాగలడు. జీవితపు భాగస్వామి మరికొన్ని విషయాలు తెలియబడడానికి కారణం కాగలడు. ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఒక వ్యక్తికి విషయ పరిజ్ఙానం అందించే క్రమంలో సాయపడుతూ ఉంటారు. అయినను జిజ్ఙాసులకు విషయ పరిజ్ఙానం అవసరం అయితే పుస్తక పఠనమే సాయపడగలదని అంటారు.

ఎన్ని పుస్తకాలు చదవడం వలన అర్ధం కానీ విషయసారం గురువు మాటలలో అర్ధం అవుతుంది. అయితే తెలుసుకోవాలనే ప్రేరణ గురువు వద్ద పొందవచ్చును. లేక పుస్తకం చదువుతున్నప్పుడు పొందవచ్చును. లేక స్నేహితుడి ద్వారా కలగవచ్చును లేక కుటుంబ సభ్యుల వలన కలగవచ్చును.

ఆసక్తి బట్టి పుస్తక పఠనం, గ్రహించే శక్తికొలది నైపుణ్యత

మనకుండే ఆసక్తి మనకు పుస్తక పఠనం వైపు మనసు వెళుతుంది. పుస్తక పఠనంలో గ్రహించేశక్తిని బట్టి విషయాలలో నైపుణ్యత పెరుగుతుంది.

వ్యక్తికి ఉండే ఆసక్తిని బట్టి పుస్తకాలు చదవాలనే ఆకాంక్ష ఉంటుంది. కొందరికీ శాస్త్ర పరిశోధనా పుస్తకాలు చదవాలనిపిస్తే, పరిశోధనాత్మక ఊహాశక్తి పుస్తక పఠనం వలన ఏర్పడే అవకాశం ఉంటుంది.

కొందరికి సాహిత్యం అంటే ఆసక్తి ఉంటే, తెలుగు సాహిత్యపు పుస్తక పఠనం చేయడం వలన సాహిత్యంలో నైపుణ్యతను పెంపొందించుకోవచ్చును. ఇలా ఎవరి ఆసక్తిని బట్టి అటువంటి పుస్తకాలు చదివితే, ఆ ఆసక్తిని అనుసరించే జీవితములో ఏదైనా సాధించాలనే లక్ష్యం ఏర్పడవచ్చును.

టివికి కళ్ళగప్పగిస్తే ఎవరో రచించిన రచనకు దృశ్యరూపం మన కళ్ళముందు కనబడుతుంది. అదే పుస్తకాలు చదవడం వలన పుస్తకంలోని అంశము మన మనసులో ఒక ఊహాత్మక ఆలోచనను సృష్టించగలదు. సాధన చేస్తే మనమే దృశ్యరూపం ఇచ్చే శక్తిని పొందవచ్చునని అంటారు.

అంటే పుస్తకాలు చదవడం వలన ఊహాశక్తిని పెంపొందించుకోవడంలో అవి సాయపడతాయని అర్ధం అవుతుంది.

లోకంలో గడిచిన కాలంలో జరిగిన చారిత్రకత అంతా అక్షరరూపంలోకి మార్చితే అది పుస్తక రూపంలో నిక్షిప్తం అయి ఉంటుంది. అలాగే గతంలో గతించిన గొప్పవారి జీవితాలు కూడా అక్షరరూపంలోకి మారితే, అవి కూడా పుస్తకాలుగా మనకు లభిస్తాయి. అంటే పుస్తకాలు చదవడం వలన గతకాలపు సామాజిక పరిస్థితుల గురించి అవగాహన తెచ్చుకోవచ్చును.

పుస్తక పఠనం చేయడం వలన ఉపయోగాలు

చరిత్ర గురించి తెలుసుకోవచ్చును.

గొప్ప గొప్పవారి జీవిత చరిత్రలు తెలుసుకోవచ్చును.

జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు గతంలో ఎవరు ఎలా ఆ కష్టాలను గట్టెక్కారో? ఒక అవగాహన పుస్తక పఠనం వలన ఏర్పడుతుందని అంటారు.

వస్తు తయారీ విధానం తెలుసుకోవచ్చును

ప్రకృతి వైద్యం గురించి, నేటి ఆదునిక వైద్యం గురించి తెలుసుకోవచ్చును.

ఆచార వ్యవహారాల గురించి సవివరంగా పుస్తక పఠనం ద్వారా తెలియబడుతుందని అంటారు.

విజ్ఙానం పెంపొందించుకోవడం పుస్తకం కన్నా మంచి సహవాసం ఉండదని అంటారు.