By | December 9, 2021

సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు. సమయం అంటే కాలం. కదిలే కాలం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే మనకొక నానుడి కూడా ఉంది. అదేటంటే కాలం కాంచన తుల్యం అని అంటారు. అంటే క్షణ కాలం అయినా బంగారంతో సమానమని అంటారు.

సంపాదించేవారు ఎప్పుడూ సమయానికి ప్రాధన్యతనిస్తారు. వారు చేసే దినచర్య ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన సమయపాలనను పాటిస్తారు. అందుకే వారు కాలాన్ని ధనముగా మార్చగలరు.

ఏది చేయాలన్నా మనకున్న కాలంలోనే సాధ్యం. మనం లేని కాలంలో ఏంజరుగుతుందో మనకు తెలియదు. మనము ఉన్న కాలంలో మనము కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటామో…. ఆ తర్వాత కాలంలో కూడా మన జ్ఙాపకాలు మిగిలి ఉంటాయని అంటారు.

ప్రధమశ్రేణికి కోసం ప్రయత్నించే విద్యార్ధి ప్రతీ క్షణమును విద్యలోని విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు.

ఏదైనా ఆటలో ఉన్నత స్థితిని కోరుకునేవారు, ప్రతిక్షణం సాధనకోసం వినియోగిస్తూ ఉంటారు.

ఒక శాస్త్ర పరిశోధనలో నిమగ్నమైనవారు, ప్రతిక్షణం కూడా పరిశోధనాత్మ దృష్టితోనే ఉంటారు.

వ్యవసాయదారుడు నిత్య పంటపొలాల పర్యవేక్షణకు ప్రధాన్యతనిస్తారు….

ఇలా సమయాన్ని తగువిధంగా ఉపయోగించుకున్నవారు, తమ జీవితంలో తాము అనుకున్న ప్రతిఫలం పొందుతారు. అందువలననే సమయాన్ని వృధా చేసుకోకూడదని అంటారు.

రైతు తనకున్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేయడం వలన పంటను బాగా పండిస్తాడు. అలా ఎక్కువమంది రైతులు ఈ విధంగా తమ సమయాన్ని సద్వినియోగం చేయడ వలన తగిన ఆహార పదార్దాలు సమాజంలో సమృద్దిగా లభిస్తాయి.

ఒక శాస్త్రజ్ఙుడు తనకున్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేయడం ద్వారా ఒక కొత్త విషయాన్ని సమాజానికి పరిచయం చేయగలడు.

అలాగే ఒక ఆటగాడు తనకున్న సమయాన్ని వృధా చేయకుండా వినియోగించుకోవడం వలన తన ఆటలో తాను ప్రపంచస్థాయి గుర్తింపు పొంది, తను కీర్తి గడించగలడు. అలాగే తన కుటుంబ సభ్యులకు కూడా గౌరవం అందించగలడు.

ఈ విధంగా కొందరు తమ తమ సమయాలను సరిగ్గా ఉపయోగించుకోవడం వలన వారు కీర్తిని గడించడమే కాకుండా తమతో కలిసి ఉండేవారికి కూడా గౌరవమును, గుర్తింపును తీసుకురాగలరు. కావునా కాలం కాంచన తుల్యం అంటారు. అందుకే సమయం వృధా చేసుకోకూడదు అంటారు.