By | October 9, 2021

సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా చూసుకోవాలి! దసరా సెలవులు అయితే దసరా సెలవులకు ముందు వ్రాసిన పరీక్షలు ఎలా వ్రాయసమో? ఒక్కసారి ప్రశ్నించుకుని ఆలోచిస్తే, చదువులో మనం ఎంత ముందున్నమో మనకు ఒక అవగాహన వస్తుంది.

అలా కాకుండా పరీక్షలు అయ్యాయి కదా మరలా స్కూల్ తెరిచాక చూద్దాం అంటే, సంవత్సం అంతా సాదరణమే. ప్రతి విద్యా సంవత్సరంలో మద్య మధ్య జరిగే పరీక్షలు మనం గ్రహించిన విషయ పరిజ్ఞానం ఏమిటో తెలియబడుతుంది. కాబట్టి అలా దసరా ముందు, సంక్రాంతి ముందు వ్రాసిన పరీక్షలలో వచ్చిన ఫలితాలే సంవత్సరాంతంలో జరిగే పరీక్షలలో ప్రతిబింబించే అవకాశం ఎక్కువ.

సంవత్సరాంతంలో వేసవి సెలవులు ఎక్కువ రోజులు ఉంటాయి. కారణం వేసవి తాపం పిల్లలను ఇబ్బంది గురి చేస్తుంది… ఇంకా విద్యా సంవత్సరం కూడా మారుతుంది… కాబట్టి కొంత గ్యాప్ ఇవ్వడం వలన విశ్రాంతి పొందిన విధ్యార్ధి మరలా విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే… నూతనోత్సాహంతో విద్యాభ్యాసం చేయడానికి పూనుకుంటాడు.

నేర్చుకునే వయసులో నేర్చుకోవడంపై ఆసక్తి పెంచుకున్న విధ్యార్ధి తర్వాతి తన విద్యాభ్యాసం గురించిన తలంపులే కలిగి ఉండడం వలన తదుపరి విద్యా సంవత్సరం కార్యాచరణపై దృష్టి పెడతాడు… ఇలాంటి విధానం అందరిలో అలవాటు కావడానికి కొద్ది రోజుల సెలవులలో సాధన చేయడం అలవరచుకోవాలి.

కాబట్టి దసరా లేదా సంక్రాంతి సెలవులలో పరీక్షలలో అసలు ఏఏ సబ్జెక్టులలో ఏఏ ప్రశ్నలకు సమాధానాలు ఎంతవరకు ఖచ్చితంగా వ్రాయగలిగాము… అనే ఆలోచన ఉత్తమమైన ఆలోచన… అది ఆచరిస్తే సదాచారం అంటారు.

మనసు సాధన సెలవులలో చదువుపై మరింత శ్రద్దగా

మన మనసు, దానికి బాగా నచ్చిన విషయంలోనూ లేదా బాగా సాధన చేసిన విషయంలోనూ గుర్తు ఎక్కువగా పెట్టుకుంటుంది.

మనసుకు నచ్చిన విషయం ఒక్కోసారి బలం అవ్వవచ్చు. ఒక్కోసారి అదే బలహీనత అవ్వవచ్చు. ఎలా అంటే తీపి బాగా ఇష్టమైతే… తీపి ఎక్కువగా తింటే అనారోగ్యం బలహీనతగా మారిపోతుంది. కానీ అదే తీపి పదార్ధం ఒక పని చేసిన తరువాత పరిమితంగా తినాలనే నియమం పెట్టుకుంటే, అదే బలం అవుతుంది.

అలా అలవాటు బలం కావచ్చు బలహీనత కావచ్చు… అయితే మనం చేసే సాధన మనసును మరొకవైపు మరలుతుంది. నేర్చుకునే వయసులో చదువుపై మరింతగా శ్రద్దపెట్టడమే… మనసుకు మంచి సాధన అంటారు.

ఇటువంటి సాధన మనసుకు అలవాటు చేస్తే, అలవాటుపడిన మనసు చదువుపై ఉత్తమ ఫలితాలు సాధించే వరకు సాగుతూనే ఉంటుంది.

ఒక్కొక్కొరికి ఒక్కో సమస్య చదువులో ఉండవచ్చు.

సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా
సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా

ఒకరికి రైటింగ్ బాగా ఉండదు.

మరొకరికి బాగా వ్రాయగలరు… కానీ చదివింది గుర్తు ఉండదు.

ఇంకొకరికి బాగా వ్రాయగలరు, బాగా చదవగలరు, బాగా అప్పజెప్పగలరు… కానీ ఒత్తిడిలో వ్రాయలేకపోవచ్చు.

ఒక్కొక్కరి పరీక్ష పేపరు చూడగానే అన్నీ గుర్తుకు వచ్చినట్టు వచ్చి… వ్రాస్తున్నప్పుడు మరిచిపోవచ్చు…

మరొకరు నిదానంగా వ్రాస్తూ ఉండడం వలన సమయం గడిచిపోవచ్చు..

ఒకరు ఏదో ఒక సబ్జెక్ట్ అంటే భయపడుతూ ఉండవచ్చు…

ఇలా ఒక్కో సమస్యను కలిగి ఉండవచ్చు… అలాంటి సమస్య ఉంటే, ఖచ్చితంగా భయపడకుండా క్లాస్ టీచర్ ను అడిగి ఆ సమస్యలను ఎలా అధిగమించాలో తెలుసుకుని వారి సూచనలను పాటించాలి… అలా చదువులో మనకుండే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవడానికి దసరా, సంక్రాంతి సెలవులు ఉపయోగపడతాయి.

సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా
సెలవులలో చదువుపై ధ్యాస తగ్గకుండా

ప్రతి సంవత్సరం ప్రారంభం గత సంవత్సరం ముగింపులో మనం సాధించిన ఫలితాలను బట్టి టీచర్ల దృష్టి మనపై ఉంటుంది. బాగా చదవడం లేదనే దృష్టి మనపై ఉండడానికి కారణం మనకు వచ్చే మార్కులే… కాబట్టి మార్క్స్ ఎక్కువగా తెచ్చుకోవడానికి మార్గం… టెక్స్ట్ బుక్ తరువుగా చదవడమే… క్లాస్ లెసన్స్ సరిగ్గా వినడమే…

సెలవులలో మనకు మన చదువులో ఉన్న అసలైన నాలెడ్జ్ ఏమిటో తెలుసుకోవాలి.

దసరా సెలవులకు ముందు రాసిన పరీక్షాపత్రం మన దగ్గర ఉంటుంది. ఆ పరీక్షా పత్రం తీసుకుని… దానిని మరలా మనకు మనమే పరీక్ష పెట్టుకుని సమాధానాలు వ్రాస్తే, అప్పుడు మనకున్న నాలెడ్జ్ ఏపాటిదో మనకు సరిగ్గా అర్ధం అవుతుంది.

సాదరణంగా స్కూల్లో జరిగే పరీక్షలప్పుడు మనం అప్పటికప్పుడు చదివేయడం లేదా ముఖ్యమైన ప్రశ్నలను బట్టీబట్టడం వంటి పనులతో పరీక్షలలో మంచి మార్కులు రాబట్టవచ్చు… బట్టీ బట్టడం సోషల్ వంటి సబ్జెక్టులలో బాగుంటే, మరి ఇతర సబ్జెక్టులలో అలా కాదు కదా… వాటికి సాధన అవసరం… సొంతంగా ఆలోచన అవసరం.

సంవత్సరంలో రోజులతరబడి చదువులోనే దృష్టి పెడుతున్న మనకు టెక్స్ట్ బుక్స్ లోని సారాంశం కానీ క్లాస్ టీచర్లు చెప్పే పాఠాలు కానీ ఎంతవరకు అర్ధం అవుతున్నాయో… అవి ఎప్పటికీ మనసులో గుర్తుకు ఉంటాయి… మరలా మనం వ్రాసిన పరీక్షాపత్రం పట్టుకుని వాటికి సమాధానాలు వ్రాయడం మొదలుపెడితే అప్పుడు అర్ధం అవుతుంది. ఎందుకంటే పరీక్షలు వ్రాశాక మైండ్ విశ్రాంతి తీసుకుని ఉంటుంది. అప్పటికప్పుడు ఒకసారి చదివినవి మరుగునపడితే, క్లాస్ రూంలో శ్రద్దగా విన్న పాఠాలు, శ్రద్దగా టెక్స్ట్ బుక్ చదివిన పాఠాలు, చేసిన సాధన మాత్రం మైండులోనే ఉంటాయి.

అంటే సెలవులలో మరలా మనకి మనమే మరో టెస్ట్ పెట్టుకుంటే, చదువులో మన నాలెడ్జ్ ఎలా ఉందో తెలుస్తుంది… అప్పుడు ఇంకా ఎంత బాగా శ్రద్ద పెట్టాలో ఒక అవగాహన ఉంటుంది… ఇంకెంత బాగా పాఠాలు వినాలో అర్ధం అవుతుంది…

వచ్చిన సెలవులలో ప్రతిరోజు సరదాగా ఉంటూ తగినంత విశ్రాంతి తీసుకోగా ఇంకా సమయం మిగిలుతుంది. అటువంటి సమయంలో సరిగ్గా దృష్టి పెడితే విద్యా విషయాలపై సాధన చేయడానికి తగినంత అవకాశం ఉంటుంది… ఆ సమయంలో సరైన సాధన చేస్తే, సెలవులలో కూడా విద్యా విషయాలు మనసులో బలపడతాయి.

రోజంతా చదువులతో సమయం గడిపి ఒక్కసారిగా సెలవులు దొరకగానే మనసు మరలుతూ ఉంటుంది… అటువంటి మనసు సరదాల వైపు పోనిచ్చి మరలా చదువువైపు దృష్టిని మరల్చడమే అసలైన ప్రయత్నం అంటారు. రోజంతా చదివి ఒక గంట ఆడుకుంటే ఆ సరదా వేరు అలాగే సెలవులలో రోజంతా ఆడుకుని కాసేపు చదువుపై శ్రద్ద పెడితే మాత్రం అది మరింత ప్రయోజనం చేకూరుస్తుందని అంటారు.

విధ్యార్ధి దశలో చదువు ప్రధాన అంశం అయితే అనుషంగిక ప్రయోజనలు ఆట పాటలు కాబట్టి ప్రధానమైన అంశములో మనసులో సరైన అవగాహనతో ఉంటూ దానిపై ధ్యాసను తగ్గకుండా చూసుకోవాలి… కాలంలో వచ్చే తీరిక మనసును మరొక అంశంపై దృష్టి మరలేటట్టు చేస్తే, అది అసలు ప్రయోజనమును మోసం రాకూడదు.

ఇష్టపడి మనసు చేసే పని లేదా ఇష్టం కోసం కష్టమైన పనిని కూడా సునాయసంగా చేసే మనసును గమనిస్తే, మనకున్న ఇష్టమే మనకు ఆయుధం అవుతుంది… మనసును మంచి విషయం వైపు మరాల్చడానికి….