తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు ఉంటే, వారిని సమర్ధులుగా లోకం కీర్తిస్తుంది. కానీ వీరు ఎవరో గుర్తిస్తారని తల్లిదండ్రుల కష్టాలను తొలగించే ప్రయత్నం చేయరు. తమ తల్లిదండ్రులపై వారికి గల ప్రేమకొలది, తమ తల్లిదండ్రులకు సహాయకులుగా మారతారు.

మనదేశంలో వ్యవసాయ ఆధారిత ఉపాధి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆర్ధికంగా మద్యతరగతి కుటుంబీకులు సాదారణ ఉద్యోగస్తులుగా జీవన సాగిస్తూ ఉంటారు. ఇంకా ఆర్ధికంగా దిగువ మద్యతరగతి కుటుంబాలలో భార్యభర్తలిరువురు కుటుంబ పోషణకు జీవనోపాధి కోసం పాటు పడుతూ ఉంటారు. అలాంటి కుటుంబాలలో చేతికి అందివచ్చన పిల్లలు ఆసరాగా నిలబడగలరు.

కుటుంబంలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడే వయస్సు యుక్తవయస్సువారే… అయితే ఈ యుక్త వయస్సు ఎటువంటిది అంటే…. శక్తివంతమైనది… బలహీనపడడానికి మార్గములు ఎక్కువగా కలిగే వయస్సు…. కాబట్టి ఇలాంటి వయస్సులో వ్యామోహాలను, వ్యసనాలను దరిచేరనీయకుండా నిలబడ్డవారు సమర్ధులుగా పిలవబడతారు. ఇక సమర్ధులు ఎప్పుడూ తమ కుటుంబ పరిస్థితులకు తగ్గట్టుగా మెసులుకోగలరని అంటారు.

తమను తాము నియంత్రించుకుంటూ, అమ్మానాన్నలకు ఆసరాగా మారే పిల్లలు తమ మనసును తామ నియంత్రించుకోవడంలో తిరుగులేని సమర్ధతను చూపించగలరు. ఇటువంటి వారిని లోకం కీర్తిస్తూ ఉంటుంది. చిత్రమైన విషయం యుక్త వయస్సులో చెడు ఆలోచనలు కలగడానికి విషయ పరిచయం లోకం ద్వారానే కలుగుతుంది. అది ఫ్రెండ్స్ లేదా తమ కళ్ళముందు ప్రవర్తించేవారు లేదా సాంకేతిక పరికరాల ద్వారా గానీ చెడు విషయాలు తెలిసేది లోకం ద్వారానే…. కానీ వాటిలో చెడు విషయాల వైపు ఆకర్షితులు కాకుండా నిలబడితే అదే లోకం కీర్తిస్తుంది….

తల్లిదండ్రుల కష్టాలను తొలగించడంలో

తల్లిదండ్రులు కూడా పిల్లలను పెంచడానికి పడే కష్టాలకు పెద్దగా కృంగిపోరు… కానీ చెడు వ్యసనాలకు బానిసైన పిల్లలు ఉంటే మాత్రం కృంగిపోతారు. ఇంకా అది వారి ఆరోగ్యమును కూడా శాసించే స్థాయికి వెళ్ళవచ్చును. తల్లిదండ్రుల కష్టాలను తొలగించడంలో యుక్తవయస్సువారి ప్రధాన కర్తవ్యం చెడు వ్యసనాలకు దూరంగా ఉండడమే… చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే, సహజంగా కుటుంబ బాధ్యతలవైపు దృష్టి వెళుతుంది.

తమను తాము నియంత్రించుకుంటూ, తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితులకు తగ్గట్టుగా తాము చేయవలసిన పనిని పూర్తిచేసే పిల్లలకు తమ తల్లిదండ్రులకు ఆసరగా నిలబడగలరు. ఆ విధంగా తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలుగా మారగలరు.

కన్నవారి కష్టాలు గుర్తించడం పిల్లలుగా చేయదగిన మంచి పని అయితే ఎదుగుతున్న కొలది తమ కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా మనసును నియంత్రించుకోవడం మరింత శ్రేయష్కరం అంటారు.