Categories
latest reads telugureads

వినోదమయ సినిమా మహల్స్ లోకి వెళ్ళేముందు …..

గత కొన్నాళ్ళుగా తగు జాగ్రత్తలో ఉండడం. తగు జాగ్రత్తలతో ప్రయాణం చేయడం. కరోనా వైరస్ ఎక్కువమందికి అలవాటు చేసింది. కానీ అంతకుమందు సినిమా హాల్స్ అంటే గుంపులుగా నిలబడడం, ప్రక్క ప్రక్కనే కూర్చోవడం అందరికీ అలవాటు. కానీ ఇప్పుడు వినోదమయ సినిమా మహల్స్ లోకి వెళ్ళేముందు మాత్రం, గతంలో అలవాటును మానసికంగా మార్చుకుని సినిమా హాలుకు వెళ్ళాలి. అన్ లాక్5 సందర్భంగా అక్టోబర్ 15 నుండి సినిమా ధియేటర్లు ఓపెన్ కానున్నాయి.

అన్ లాక్5లో భాగంగా అక్టోబర్ 15 తొలిసినిమాగా కరోనా వైరస్ విడుదల కాబోతుంది. సంచలనం సృష్టించే సినిమాలు తీయడంలోనే కాదు, మాటలతోనూ సంచలనం సృష్టించే సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈయన మాటలు భిన్నంగానే ఉంటాయి. ఈయన సినిమాలు విభిన్నంగానే ఉంటాయి. ప్రత్యేకత ఏమిటంటే కరెంట్ సోషల్ స్టేటస్ ను సినిమాలుగా మార్చేయడంలో రామ్ గోపాల్ వర్మ ప్రసిద్దుడు.

ఇప్పుడు ఆ కోవాలోకి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కూడా చేరింది. రామ్ గోపాల్ వర్మ తాజాగా కరోనా వైరస్ అనే కొత్త సినిమా నిర్మిస్తున్నారు. ఈ కరోనా వైరస్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేద్దామనుకున్నారట. అయితే అన్‌లాక్ 5లో బాగంగా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమాలను ధియేటర్లలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ప్రారంభం అయ్యే నేపధ్యంలో ఈ సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది.

ఎక్కువమందిని కలవడం తగ్గిపోయింది. దాంతో షేక్ హ్యాండ్ ఇవ్వడం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఎక్కువమంది ఉండే చోట్లకు అందరూ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అయ్యాయి. ఎక్కువమందిలో తమకు తెలిసినవారు కనబడగానే ముందు చేతులు చాపి పలకరిస్తాం. షేక్ హ్యాండ్ ఇస్తాం…. సినిమా ధియేటర్ల దగ్గర ఇది జరిగే అవకాశం ఉండవచ్చు. కాబట్టి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారంతో మనకు తెలిసినవారిని పలకరించాలని మానసికంగా ప్రిపేర్ కావాలి.

మనసుకు మూడుసార్లు మనం ఏదైనా చెబితే, అది అంతరాత్మకు చేరుతుందంటారు. మనసు మనల్ని మోసం చేయవచ్చును కానీ అంతరాత్మ మేలునే సూచిస్తుంది. అయితే సాదారణంగా ఆ సూచనలను మనసు లెక్కపెట్టదు. కానీ కరోనా కాలంలో అంతరాత్మ సూచనలు పాటించాలి. అలాగే అంతరాత్మకు చేరేలా మనసుకు ప్రతి జాగ్రత్తను మూడు సార్లు మనస్ఫూర్తిగా చెప్పాలి. మనసుకు చెప్పడమంటే, మనసులో అనుకోవడం. అది మనస్ఫూర్తిగా….

మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్లడం అందరికీ అలవాటు అయ్యింది. అయితే ఎక్కువమందిలోకి వెళ్ళినప్పుడు మాస్క్ ఎందుకని? ఎవరైనా మాస్క్ లేకుండా ప్రత్యేకంగా కనబడడానికి ప్రయత్నం చేయవచ్చును. వినోదమయ సినిమా మహల్స్ లోకి వచ్చేవారిలో అలాంటివారు ఎవరోఒకరు ఉండవచ్చును. అటువంటి వారిని చూసి, మాస్క్ ధరించినవారు మాస్క్ తొలగించకుండా ఉండాలి. మాస్క్ వలన మన నుండి, ఇతరుల నుండి సూక్ష్మక్రిముల రవాణా తగ్గుతుంది. కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుంది.

సాదారణంగా వినోదమయ సినిమా మహల్స్ లోకి ఒక్కరోజులో అనేకమంది వచ్చి కూర్చుని వెళ్తూ ఉంటారు. అన్ లాక్ మార్గదర్శకాలు ప్రకారం థియేటర్ మేనేజ్ మెంట్ ప్రయత్నించినా కూడా మానవతప్పిదం ఉండవచ్చును. ఇప్పుడు మనం ఎవరో కూర్చున్న చోటులో కూర్చుంటాం. ఇక్కడ కూడా మన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ లాక్5 మార్గదర్శకాలు ఫాలో కావాలి. అన్ లాక్5 మార్గదర్శకాలు ముమ్మారు మనసులో తలచి, తలచి, తలచి సినిమాకు వెళ్ళడానికి ప్రిపేర్ కావాలి. కానీ గతంలో మాదిరి సినిమా అనగానే, ఉన్నచోట నుండే హడావుడిగా సినిమాహాలుకు దారితీయడం ఎంతమాత్రం శ్రేయష్కరం కాదు.

వినోదం మనసుకు అవసరమే కానీ ఆరోగ్యం ప్రధానం… ప్రాణ రక్షణ మరింత ప్రధానం. కరోనా వ్యాప్తికి దూరంగా ఉండడానికి వీలైనంత సామాజిక దూరం పాటించాలి. ఎంత వీలైతే అంత సామాజిక దూరం పాటిస్తేనే, కరోనా కట్టడి సాధ్యం అంటారు.

ఇంకా వినోదమయ సినిమా మహల్స్ లోకి వెళ్ళేముందు… థియేటర్ సానిటైజేషన్ చేశారో లేదా అడగాలి. సినిమా టిక్కెట్ తీసుకునే ముందు ఇది అడగాలి. జాగ్రత్తపరుడిని చూసి మరొకరు జాగ్రత్తపడినట్టు…. ఎంత ఎక్కువమంది జాగ్రత్త గురించి ఎదుటివారిని అడిగితే, అంత శ్రద్ధ వారిలో పెరుగుతుంది. మీపాటికి మీరు సినిమా టిక్కెట్ తీసుకుని థియేటర్ లో కూర్చుంటే, జనం పట్టించుకోవడం లేదు కదా, అని ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండవచ్చును. అదే అందరూ సానిటైజేషన్ గురించి థియేటర్ టిక్కెట్ కౌంటరులో అడిగితే, థియేటర్ యాజమాన్యమునకు నిర్లక్ష్యధోరణిలోకి వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి థియేటర్ సానిటైజేషన్ గురించి ఆరాతీయాలి. అందరూ తీయాలి.

ఒక విషయంపై ఎంత ఎక్కువ మంది పోకస్ చేస్తే, అంత బాధ్యత సామాజిక సంస్థలపై పడుతుంది. కావునా కరోనా జాగ్రత్తల గురించి ఒక వ్యక్తిని ప్రశ్నించడమే కాదు, యాజమాన్యమును కూడా ప్రశ్నించాలి.

సినిమా ఇంటర్వెల్ నందు బయటకు రావడం ఎక్కువగా చాలామందికి అలవాటు. అయితే ఈ కరోనాకారణంగా మీరు ఎప్పటిలాగానే థియేటర్ నుండి బయటకు గుంపులో రావద్దు. ఒక్కరిగానే బయటకు రండి. డ్రింక్స్, తినుబండారాలు వంటివి తీసుకునేటప్పుడు కూడా గుంపులోకి చేరవద్దు. సాదారణంగా వినోదమయ సినిమా మహల్స్ లో గుంపులో నిలబడడం అలవాటు. ఇప్పుడు ఈ అలవాటును కొన్నాళ్లు వాయిదా వేయాలి. అలాగే సినిమా ముగిశాక థియేటర్ల నుండి బయటకు రావడం కూడా కంగారుగా గుంపులో రాకూడదు.

సినిమా థియేటర్లు, స్కూల్స్ ఓపెన్ చేయకుండా ఉన్నా, ఇప్పటికే దేశంలో 63 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే 53 లక్షలమంది రికవరీ అయ్యారు. కానీ కరోనా వైరస్ కారణంగా 99వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఇప్పుడు అన్ లాక్5 సందర్భంగా అవి ఓపెన్ అవ్వనున్నాయి. కావునా మరింత జాగ్రత్త మనకు మేలు చేస్తుంది. నిర్లక్ష్యం హాని చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త….

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

ఈ పోస్టు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయగలరు…