మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్ 2022

అమ్మ లేక నేను లేను, నువ్వు లేవు, ఎవ్వరం లేము. బిడ్డను కనడానికి మృత్యువుతో యుద్దమే చేస్తుంది…. అటువంటి అమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మను విష్ చేయడానికి ప్రతి సంవత్సరం ఒకరోజు వస్తుంది. అదే మదర్స్ డే… ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్.

అమ్మతో అనుబంధం అనిర్వచనీయం. అమ్మ ప్రేమకు పరమాత్మ కూడా కట్టుబడి నిలబడ్డాడు. అమ్మ అంటే పరమాత్మకు సైతం ఎనలేని ఇష్టం… అమ్మ చూపే ప్రేమలో కల్మషం లేకపోవడం. ఎంతటి శక్తివంతుడైనా అమ్మ దగ్గర తిండి తినడం చేతకాక అమ్మ గోరు ముద్దలు తిన్నవారే.

ఆది శంకరాచార్యుడుకి అయినా మొదటి గురువు అమ్మే. అమ్మ వద్దే తినడం నేర్చుకుంటాడు. అమ్మ దగ్గరే ఏడుస్తాడు. అమ్మ దగ్గరే ఉపశమనం పొందుతాడు. అమ్మ దగ్గరే నడవడం నేర్చుకుంటాడు. అమ్మ దగ్గరే కధలు వింటాడు. పాటలు వింటాడు… ఇలా అమ్మ అప్యాయత ముందు అమృతం కూడా తక్కువే.

మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్

అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే… ఆలోచన ఆగదు… పదాల ప్రవాహానికి ఆనకట్ట ఉండదు… మదర్స్ డే సందర్భంగా అమ్మ గురించి కొన్ని Quotes Telugulo 2022

ఆలయం అక్కరలేని దైవం అమ్మ, అటువంటి అమ్మ దగ్గర అమృతం వంటి మాటలు మనసుకు శాంతిని అందిస్తాయి. అమ్మకు కూడా అమ్మే ఉపశాంతి.

హ్యాపీ మదర్స్ డే 2022

మనం పుట్టినప్పుడు ఏడవకపోతే తల్లడిల్లిపోతుంది… తర్వాత ఏడ్చిన ప్రతిసారి తల్లడిల్లిపోతుంది… అమ్మ ఆప్యాయతకు కొలతలు లేవు.

హ్యాపీ మదర్స్ డే 2022

బిడ్డ భవిష్యత్తు కోసం నిత్యము తపించే అమ్మ నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది.

హ్యాపీ మదర్స్ డే

తల్లుల రోజున మాత్రమే కాదు… ప్రతి రోజు మొదటి నమస్కారం అమ్మకే!

హ్యాపీ మదర్స్ డే 2022

బడి పాఠాలు మరుస్తామేమో కానీ అమ్మ ఒడిలో పాఠాలు మాత్రం మరువము.

హ్యాపీ మదర్స్ డే

భగవంతుడు మనకు ఇచ్చే తొలి బడి అమ్మ ఒడి, తొలి గురువు అమ్మ….

హ్యాపీ మదర్స్ డే

బిడ్డ గుణం ఎలాంటిదైనా అమ్మ చూపే ప్రేమలో తేడా ఉండని, అమ్మ గుణం అర్ధం అయితే దుర్గుణాలు దూరం అవుతాయి.

హ్యాపీ మదర్స్ డే

పరమాత్మ సైతం పరవశిస్తాడు, ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మకు మాత్రం పసివాడే…

హ్యాపీ మదర్స్ డే

అమ్మకు మరో ప్రపంచం ఉండదు. బిడ్డ భవిష్యత్తే అమ్మ ఆనందదాయకం.

హ్యాపీ మదర్స్ డే

అమ్మ ప్రేమ ముందు అరుదైనవి కూడా వెల వెల పోతాయి.

హ్యాపీ మదర్స్ డే

అవరోధం వచ్చినా, ఆటంకం కలిగినా, ప్రాణం పోతుందని భావించినా పోయే ప్రాణాల కోసం కాకుండా బిడ్డ భవిష్యత్తునే తలిచే తల్లుల కారణంగానే మనమంతా సౌభాగ్యవంతులం.

హ్యాపీ మదర్స్ డే

అమ్మ ప్రేమకు హద్దులు చెప్పడానికి పంచభూతాల ఉపమానం కూడా సరిపోదు.

హ్యాపీ మదర్స్ డే

ఎంతో తపించి సాధన చేస్తేనే కానీ ప్రకృతిలో ఫలితం లభించదు… కానీ మనం అమ్మ ఒడిలో చేరడానికి మనకోసం అమ్మే తపిస్తుంది. మన ఎదుగుదలకు నిరంతరం కృషి చేస్తుంది. అమ్మ ఒడి వరాల మూట.

హ్యాపీ మదర్స్ డే

అమ్మ అనగానే అక్షరాలు అల్లుకుపోతూ, పదాల ప్రవహిస్తుంటే, అసంఖ్యాక వ్యాక్యాలు వస్తూనే ఉంటాయి… అమ్మకు ప్రతి రోజూ పరమ భక్తితో ఒక నమస్కారం.