ఏమి జరుగుతుందో తెలియని వయస్సులో, అన్నింటికి అమ్మే ఆధారం

అమ్మ అమృతం కన్నా మిన్న

ప్రాణం మీదకు వచ్చేటంతటి సంఘటన పురుషునికి పరిస్థితుల ప్రభావం చేత కాలంలో కలగవచ్చు, కలగకపోవచ్చు. కానీ అమ్మ తన ప్రాణాలతో పోరాడితేనే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం కదా! అమృతం కన్నా అమ్మ అప్యాయత మిన్నగా ఉంటుంది. అమ్మ అనే భావన మన సంతోషంలో ఉంటుంది, భాదలోను ఉంటుంది. మొదటిసారి ఆకలి వేసినప్పుడు పుట్టే ఆకలి భాదకు అమ్మ అప్యాయత ఆదుకుంటుంది. ఏమి జరుగుతుందో తెలియని వయస్సులో, అన్నింటికి అమ్మే ఆధారం! అమ్మ అని అనడం రాకముందు నుండే, అమ్మ అప్యాయతను మనం పొంది ఉంటాం! అందుకే అమ్మ అమృతం కన్నా మిన్న అంటారు.

అమ్మా అనే పదంలో రెండు అక్షరాలు ఉన్నాయని తెలియకముందు, ఎన్నో విషయాలలో అమ్మ మనకు గురువు. అమ్మా అనగానే పలకగానే అమ్మతనమే కనబడుతుంటే, అమ్మ అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో, ఆ అక్షరాలు నేర్చుకునేటప్పుడు కూడా లెక్కకట్టం. అమ్మా అనగానే ఏంట్రా నాన్న అంటూ అమ్మచూపే ఆప్యాయతకు, భగవానుడు కూడా తననుతాను మరిచిపోతాడేమో! అందరూ స్త్రీలు అటువంటి అమ్మలుగా కాలంలో మారతారు. అమ్మగా మారకముందు అమ్మాయిగా ఉండే స్త్రీ అంటే సమాజానికి లోకువగా ఉంది.

చిత్రం ఇంట్లో అమ్మ గుళ్లో దేవుడు, ఇద్దరిని అక్కడికే పరిమితం చేస్తూ ఉండడం వలన ధర్మంపై అధర్మం పైచేయిగా కనిపిస్తూ వ్యక్తి చేత తప్పులు చేయిస్తూ ఉంటుంది. వ్యక్తిగా మారకముందు బాల్యదశలోనే, సమాజంలో అమ్మలు గురించి తెలుసుకుని ఉంటే, అతను యుక్తవయస్సులో తనదికానీ వస్తువు, తనకు దొరికినప్పుడు, ఆవస్తువు యొక్క యజమానిని కనుక్కొని అప్పజెప్పినట్టుగా, సమాజంలో స్త్రీ స్వస్థలానికి చేర్చే ఆలోచన సమాజంలో పెరుగుతుంది. అమ్మ అమృతం కన్నా మిన్న.

బహుశా గాంధీగారు మనదేశంలోఎప్పుడైతే ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలుగుతుందో? అప్పుడే మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు అని చెప్పి ఉంటారు. గాంధీగారి ఉద్దేశ్యంలో ఆడది ఒంటరిగా అర్ధరాత్రి తిరగడం అంటే, నిర్మానుష్య ప్రదేశంలో ఆడది ఒంటరిగా నడవడం కాదు. మనదేశంలో అర్ధరాత్రి పదిమంది యువకులున్న చోటులో ఆడది ఒంటరిగా కనబడితే, ఆస్త్రీని ఒకతల్లిగా లేక చెల్లిగా భావించి, ఆ స్త్రీ గమ్యస్థానానికి చేర్చాలనే ఆలోచన పదిమంది యువకులలో కలగాలి. బహుశా ఇదే భావనతో గాంధీగారు చెప్పి ఉండి ఉంటారు. అంటే పరాయిపాలనకు ముందు మన భారతీయుల రక్తం ఈ భావనతోనే ఉండి ఉంటుంది. అంటే మన సహజ స్వభావం ఏమిటి?

భార్య కోరికకోసం భర్త బ్రతికితే, భర్తసేవకోసం భార్య బ్రతికితే, సమాజంలో ఉన్న స్త్రీగౌరవాన్ని కాపడడం కూడా తమ ధ్యేయాలలో ఒక్కటిగా చేర్చుకుని బ్రతికే యువత, ఇటువంటి సమాజం అప్పట్లో అంటే పరాయిపాలనకు ముందు అయ్యి ఉండవచ్చును. వెనుకకు వెళ్లవద్దు కానీ మనధర్మం మనకు తెలియాలంటే, చరిత్ర అవసరమే కదా! వారసత్వంగా ఆస్తిని పొందుతున్నాం ! మరి మనధర్మమేమిటో మనం తెలుసుకుంటే, మనసామాజిక ధర్మం మనకు మనతోటివారికి రక్షణ అవుతుంది.

అటువంటి గతకాలపు మనసమాజం గురించి పుస్తకాలే మనకు తెలుపుతాయి. అటువంటి పుస్తకాలు చదవడం వలన గాంధీ కలగన్న సమాజం రావాడానికి ఒక ప్రయత్నం మనతో మొదలవుతుంది. పుస్తకం చదవడం ఒక కళ అయితే, అందులో సారంశం గ్రహించడం మరో కళ అయితే, వర్తమాన, భూత, భవిష్యత్తుకాల పరిస్థితులను అంచనా వేయగలగడం ఇంకొక కళ అయితే ఈమూడు కళలు సహృదయ పుస్తక పఠనం, సహేతుకమైన ఆలోచనా విధానంతో అలవరవచ్చును. ఈ వేరు రంగులో కనిపిస్తున్న అక్షరాలపై టచ్ చేయడం లేక క్లిక్ చేయడం ద్వారా మన సాంస్కృతిక పుస్తకాలలో స్త్రీ వైశిష్ఠ్యం గురించి ఆన్ లైన్ పి.డి.ఎఫ్ తెలుగు బుక్స్ ఉచితంగా చదవవచ్చును. మీరు పి.డి.ఎఫ్ పార్మట్లో కేవం చదువుకోవడానికి మాత్రమే డౌన్ లోడ్ చేయవచ్చును.

అమ్మ అమృతం కన్నా మిన్న ప్రాణాంతకమైన పురుడుకు పూనుకుంటుంది. ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అమ్మ కన్నా మిన్న అనే పదం, అంతకన్నా మించిన ఆప్యాయత ఎక్కడా ఉండదేమో.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్