బ్లాగు పోస్టు ఎలా వ్రాయాలి?

బ్లాగు పోస్టు ఎలా వ్రాయాలి? ఒక వర్డ్ ప్రెస్ బ్లాగులో టెక్ట్స్ మరియు ఫోటోతో పోస్టుని ఎలా వ్రాయాలి? ఈ తెలుగురీడ్స్ బ్లాగు పోస్టులో పూర్తిగా చదవగలరు. ఏదైనా ఒక విషయం గురించి వివరించే ప్రయత్నం చేయడమే పోస్టు వ్రాయడం అంటారు. అది మీరు ఎంచుకున్న కంటెంటు ఆధారంగా ఉంటుంది. పోస్టుని వ్రాసేటప్పుడు ఖచ్చితంగా పోస్టుకి ఎంపిక చేసుకునే టైటిల్ పాపులర్ వర్డ్స్ తో మిక్ అయి ఉండాలి. ఇంకా పోస్టులో టెక్ట్స్ తో బాటు ఇమేజుల కూడా జోడించాలి. పోస్టుకి చివరలో మీ బ్లాగులోని ఇతర పోస్టుల లింకులు జోడించాలి. ఇంకా ఇతర వెబ్ సైట్ల లింకులను కూడా జోడించాలి.

మరొక విషయం ఏమిటంటే, మీ బ్లాగు పోస్ట్ టైటిల్ ఎస్ఇఓ కీవర్డ్ అయి ఉండాలి. ఇంకా ఎస్ఇఓ డిస్క్రిప్షన్లో మొదటి లైనులోనే టైటిల్ ఉండాలి.

వర్డ్ ప్రెస్ సైటులో ఒక బ్లాగు క్రియేట్ చేయడం అంటే, ఒక విషయమును సవివరంగా వచన రూపంలో మద్యమద్యలో ఫోటోలను ఉపయోగిస్తూ విషయమును విశదీకరించడం అంటారు. అడ్మిన్ ప్యానెల్, అందులో సైడ్ బార్, అందులో Posts లో Add New క్లిక్ చేయడం ద్వారా ఒక కొత్త పోస్టును సృష్టించవచ్చును. అందులో అర్ధవంతమైన విషయమును పేరాలుగా ఎక్కువ పదాలతో వ్రాయాలి.

వర్డ్ ప్రెస్ బ్లాగులో బ్లాగు పోస్టు ఎలా వ్రాయాలి?

ఈ ఎడమవైపుగా ఉన్న చిత్రం… వర్డ్ ప్రెస్ బ్లాగు అడ్మిన్ పేజిలో సైడ్ బార్. దీనిలో అన్ని అడ్మిన్ ఫీచర్ల మెను ఉంటుంది. ఇందులో పోస్ట్ సృష్టించడం, పోస్ట్ ఎడిట్ చేయడం, పోస్ట్ డిలిట్ చేయడం, కేటగిరీ సృష్టించడం, కేటగిరీ ఎడిట్ చేయడం, కేటగిరీ డిలిట్ చేయడం, పేజి సృష్టించడం, పేజిని ఎడిట్ చేయడం, పేజిని డిలిట్ చేయడం వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంకా వెబ్ సైటులో అనేక మార్పులు చేర్పులు ఈ వర్డ్ ప్రెస్ అడ్మిన్ సైడు బార్ లోని ఫీచర్ల సాయంతో చేయవచ్చును. ఇందులో Posts అను ఆంగ్ల అక్షరాలలో క్లిక్ చేస్తే, మీరు ఒక కొత్త పోస్టుని మీ వర్డ్ ప్రెస్ బ్లాగులో వ్రాయవచ్చును. ఆ పోస్టుని డ్రాప్ట్ లో సేవ్ చేయవచ్చును. లేదా వెంటనే పబ్లిష్ చేయవచ్చును. ఈ విధంగా ఒక వర్డ్ ప్రెస్ పోస్టుని క్రియేట్ చేయడానికి అడ్మిన్ ప్యానెల్ సైడు బార్ లో Posts ఫీచరు ఉపయోగపడుతుంది. Posts పీచరు క్లిక్ చేయగానే ఈ క్రింది చిత్రం మాదిరి మీ వర్డ్ ప్రెస్ అడ్మిన్ పేజి మారుతుంది.

బ్లాగింగ్ చేయడంలో బ్లాగు ఒక పోస్టు ఎలా వ్రాయాలి?

మీరు మీ వర్డ్ ప్రెస్ పోస్టు టైటిల్ టైపు చేశాకా… దానికి క్రింద… పేరాగ్రాఫ్ లో మీ పోస్టు కంటెంట్ టైపు చేయాలి. ఇప్పుడు ఈ కంటెంటు ప్రధానంగా ప్రధమ పేరా ఎలా ఉండాలి? చూద్దాం.

ఈ క్రింది చిత్రంలో చూడండి. Add title ఆంగ్ల అక్షరాలు గల చోట మీరు వ్రాయబోయే మీ వర్డ్ ప్రెస్ బ్లాగు పోస్టు యొక్క టైటిల్ అంటే తెలుగులో శీర్షికను టైపు చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ పోస్ట్ టైటిల్ మీ పోస్టుని సెర్చ్ ఇంజన్లో ప్రభావితం అయ్యేవిధంగా చూడగలదు. కావునా వర్డ్ ప్రెస్ టైటిల్ ఎంపిక మాత్రం ఎస్ఇఓ ప్రమాణాలకనుగుణంగా ఉండేవిధంగా చూసుకోవాలి. అప్పుడే మీ వర్డ్ ప్రెస్ బ్లాగు పోస్టు గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో మొదటి పేజిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

వర్డ్ ప్రెస్ పోస్టులో ప్రధమమైన పేరాగ్రాఫ్ ఎలా ఉంటే, ఎస్ ఇ ఓకు అనుగుణంగా ఉన్నట్టుగా చెబుతారు. సాదారణంగా పోస్టు యొక్క టైటిల్ నాలుగు పదాలు కానీ అయిదు పదాలు కానీ ఉండవచ్చును. అయితే పోస్టు టైటిల్ మొదటి నాలుగు పదాలు మాత్రమే ఎస్ఇఓ ఫోకస్ కీవర్డ్ గా చూపించాలని చెబుతారు. అలాగే అవే నాలుగు పదాలు ట్యాగ్ గా కూడా ఉపయోగించాలి. ముఖ్యంగా పోస్టులో ప్రతి ఫోటోకు ఇదే టైటిల్ ట్యాగ్ చేయబడాలి.

పోస్టు యొక్క టైటిల్ పోస్టులోని ప్రధమ పేరాలో తప్పనిసరిగా ఉండాలని చెబుతారు. టైటిలో పోస్టు ఫస్ట్ పేరాలో మొదట్లోనే ఉన్నా ఫరవాలేదు లేకపోతే ఫస్ట్ పేరాలో ఎక్కడైనా ఒక్కసారి టైటిల్ పూర్తిగా రిపీట్ అయి ఉండాలి. ఈక్రింది చిత్రంలో పోస్ట్ టైటిల్ మరియు ఫస్ట్ పేరా గమనించండి.

సైన తెలిపినట్లుగా వర్డ్ ప్రెస్ పోస్ట్ టైటిల్, పోస్ట్ ఫస్ట్ పేరాలో ఉండే విధంగా చూసుకుని తర్వాతి పేరాలలో పోస్టు కంటెంటు గురించి వివరించాలి. ఆ వివరణ తక్కువలో తక్కువ మూడు వందల పదాలకు మించి ఉండాలి.

బ్లాగుపోస్టు ఎలా వ్రాయాలి? కొన్ని సూచనలు

 • బ్లాగు పోస్టులోని కంటెంటు ఒరిజినల్ అయి ఉండాలి.
 • ఇతరుల వెబ్ సైటు నుండి మక్కికి మక్కి కాపీ చేయరాదు.
 • మీ సొంతమాటలలో విషయాన్ని వివరించాలి.
 • బ్లాగులోని పోస్టులో ఇంటర్నెల్ లింకులు ఉండాలి. (అంటే మీ బ్లాగులోనే మిగిలిన పోస్టుల లింకులు)
 • పోస్టులో ఆర్టికల్ వర్డ్స్ 300కు పైబడి ఉండాలి. 800 పదాల పై బడి ఉంటే మేలు అంటారు.
 • పోకస్ కీవర్డ్ లో మీ బ్లాగ్ పోస్టు టైటిల్ ఉండాలి.
 • పెర్మాలింకులో కూడా బ్లాగ్ పోస్టు టైటిల్ ఉండాలి.
 • పోస్టు టైటిల్ ఫస్ట్ పేరాలో ఉండాలి.
 • బ్లాగు పోస్ట్ కంటెంట్ రీడబుల్ గా ఉండాలి.
 • పాపులర్ పదాలతో పోస్ట్ టైటిల్ ఉండాలి.
 • పోస్ట్ టైటిల్ మొత్తం బ్లాగు పోస్టులో, కంటెంటు పదాలను బట్టి రిపీట్ అవుతూ ఉండాలి.
 • ప్రతి బ్లాగు పోస్టలోనూ ఇమేజెస్ ఉండాలి.
 • బ్లాగు పోస్టుకు ఫీచర్ ఇమేజ్ ఉండాలి.

ఎస్ఇఓ బ్లాగు పోస్టు ఎలా వ్రాయాలి?

 • పోస్టు యొక్క టైటిల్ కీవర్డ్, పెర్మాలింక్, ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్ లలో ఉండాలి.
 • అర్ధరహితమైన ఫోటోలు కంటెంట్ యొక్క ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తాయి.
 • బ్లాగ్ పోస్టు కంటెంటు యూజర్లకు ఉపయోగపడే సమాచారంతో ఉండాలి.
 • పోస్టు టైటిల్ ఎస్ఇఓ డిస్క్రిప్షన్లో తప్పని సరిగా ఉండాలి.
 • వర్డ్ ప్రెస్ బ్లాగు పోస్టు యొక్క టైటిల్ నాలుగు పదాలకు తక్కువ కాకుండా ఉండాలి.
 • బ్లాగు పోస్టులో పాపులర్ పదాలు గూగుల్ సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేస్తున్న పదాలకు మ్యాచ్ అవ్వడం వలన ఎస్ఇఓ బాగుంటుంది.
 • పోస్టులో పాపులర్ పదాలు ట్యాగ్స్ చేయాలి.
 • కేటగిరీ కూడా పోస్టు కంటెంటుకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి.
 • అసంబద్ధమై వర్గంలో పోస్టులు వ్రాయడం వలన ఉపయోగం ఉండకపోవచ్చును.
 • మీ బ్లాగు టైటిల్ ప్రతి పోస్ట్ కంటెంటులోనూ ఉండేవిధంగా చూసుకోవాలి.
 • పోస్ట్ ముగింపులో టైటిల్ మరలా రిపీట్ కావాలి.
 • ట్యాగ్ చేసిన పదాలు బోల్డ్ లేదా ఇటాలిక్ ద్వారా హైలెట్ చేయాలి.
 • యోస్ట్ ప్లగిన్ ఉపయోగించడం ద్వారా మీ వర్డ్ ప్రెస్ పోస్టను ఎస్ఇఓ ఉచితంగానే చేయవచ్చును.
 • వర్డ్ ప్రెస్ లో యోస్ట్ ప్లగిన్ ప్రాధమికంగా ఉచితంగానే లభిస్తుంది. ఒక కీవర్డ్ సాయంతో మీ పోస్టుని సెర్చ్ ఇంజన్లో ప్రభావితం అయ్యేవిధంగా మార్చకోవచ్చును.
 • అనవసర కామెంట్లను అప్రూవ్ చేయకూడదు.
 • అవసరం మేరకు ఇతర వెబ్ సైట్లను మీ బ్లాగు పోస్టులో లింక్ చేయాలి.
 • కనీసం రెండు ఇతర వెబ్ సైట్ల లింకులు మీ బ్లాగు పోస్టలో జోడించడం మేలు.
 • ఇతర వెబ్ సైట్ల నుండి మీరు మీ బ్లాగులో లింకు చేయబోయే పోస్టులు మీ బ్లాగు కంటెంటుకు రిలేటివ్ గా ఉండాలని అంటారు.
 • కనీసం ఐదారు ఇంటర్నల్ బ్లాగు లింకులు ఉండాలి.
 • పోస్టుని పబ్లిష్ చేసేముందు, ఆ పోస్ట్ ఏ కేటగిరిలోకి టిక్ చేయబడింది? చెక్ చేసుకోవాలి.
 • పబ్లిష్ చేసిన బ్లాగు పోస్టుని సోషల్ మీడియా నెట్ వర్క్ లో షేర్ చేయడం మేలు.
 • బ్లాగు పోస్టు కంటెంటుకు సంబంధించిన వీడియో కూడా మీ బ్లాగు పోస్టులో జోడించడం మరింత మేలు అంటారు.

ఇతర బ్లాగు పోస్టులలో మీరు వ్రాస్తున్న కంటెంటు పోలి ఉండేటట్టుగా ఉందో లేదో చెక్ చేసుకుని, బ్లాగ్ పోస్టుని మీ సొంతమాటలలో వ్రాయాలి. వచన రూపంలో విషయాన్ని తెలియజేస్తూ, ఇమేజుల సాయంతో దానికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి.

ధన్యవాదాలు.

మరి కొన్ని తెలుగురీడ్స్ పోస్టులు

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

తెలుగురీడ్స్

10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

kadhalu

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

Leave a Comment