దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా

దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా

మన దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా స్మార్ట్ ఫోన్లో అనేక విషయాలను తెలుసుకోవచ్చును. అలా తెలియబడే విషయాలన్నీ ఎక్కువగా బ్లాగుల ద్వారా వెబ్ సైట్ల ద్వారా మన ఫోనులో కనబడతాయి. సాదారణంగా స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియా మొబైల్ యాప్స్ వలన చాలా విషయాలు మన దృష్టికి వస్తూ ఉంటాయి. అలా కాకుండా గూగుల్ సెర్చ్ ద్వారా వెతకబడే విషయాలు బ్లాగులు లేదా న్యూస్ వెబ్ సైట్ల ద్వారా మనకు మన స్మార్ట్ ఫోనులో కనబడుతూ ఉంటాయి.

వర్డ్ ప్రెస్ ద్వారా సృష్టించబడిన బ్లాగులు లేక గూగుల్ బ్లాగర్ ద్వారా సృష్టించబడిన బ్లాగులు నుండి లేక న్యూస్ వెబ్ సైట్ల రూపంలో కానీ మనల్ని విషయాలు స్మార్ట్ ఫోను ద్వారా పలకరిస్తూ ఉంటాయి. ఇంకా వీడియో వ్లాగులు వలన ఎన్నో విషయాలను వీక్షించవచ్చును. వీడియో రూపంలో లేక బ్లాగు పోస్టుల రూపంలో మనకు విషయాలు స్మార్ట్ ఫోను ద్వారా తెలియబడుతుంటాయి.

ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగులలోని సమాచారం అనేక వీడియోలుగా కూడా మనకు కనబడుతుంటాయి.

అలాగే ఆన్ లైన్ ద్వారా సృష్టిస్తున్న బ్లాగుల ద్వారా వివిధ రంగాలలో సమాచారం అందించబడుతుంటుంది.

ఒక విషయం గురించిన వివరణ కానీ ఒక సమాచారం వివరణాత్మకంగా తెలియపరచడం కానీ బ్లాగులు చేస్తూ ఉంటాయి. కావునా బ్లాగింగ్ అనేది ఒక ఆన్ లైన్ వృత్తిగా రూపొందుతుంది. ఒకప్పుడు ప్రొఫైల్ ఆధారంగా తమ సమాచారం ఆన్ లైన్లో ఉంచడానికి అలవాటు అయిన బ్లాగింగ్ తర్వాత కాలంలో సమాచారం చేరవేయడానికి, విషయాలను వివరంగా తెలియజేయడానికి బ్లాగులు బాగా ఉపయోగపడుతున్నాయి.

ఏ రంగం అయినా బ్లాగు ద్వారా ఆ రంగం గురించి వివరణ చేయడం

క్రికెట్ గురించి సమాచారం, క్రికెట్ ఆటల వివరాలు, క్రికెట్ క్రీడాకారుల గురించి, క్రికెట్ మైదానల గురించి… క్రికెట్ గురించి సమస్త సమాచారం అందించే బ్లాగులు క్రికెట్ ప్రియులకు అవసరమైన సమాచారం అందిస్తూ ఉంటాయి. క్రికెట్ మాదిరిగానే వివిధ రంగాలలో వివిధ రకాల విషయాలను బ్లాగులు వివరించే ప్రయత్నం చేస్తాయి.

ఇలా ఏ రంగం అయినా బ్లాగు ద్వారా ఆ రంగం గురించి వివరణ చేయడం జరుగుతుంది. టెక్నాలజీ విషయానికొస్తే అనేక టెక్ గాడ్జెట్ల గురించి తెలియజేసే బ్లాగులు…. ఇంకా గాడ్జెట్ల గురించి వివరించే బ్లాగులు… ఇంకా టెక్నాలజీ రూపాంతరం ఎలా ఉంటుందో తెలియజేసే బ్లాగులు… విలువైన సమాచారం అందిస్తూ ఉంటాయి. కాబట్టి బ్లాగింగ్ ఎప్పటికీ ఒక ఎర్నింగ్ ఆన్ లైన రిసోర్స్ గా ఉండగలదని అంటారు.

ముఖ్యంగా ఆన్ లైన్లో సృష్టించబడిన, సృష్టించబడుతున్న బ్లాగులు ఎక్కువగా సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఉండడం వలన బ్లాగింగ్ చాలా విజయవంతం అవుతున్నాయని అంటారు.

అంటే బ్లాగులు ఒక వస్తువు గురించి తెలియజేస్తాయి. ఒక వస్తువు వాడుక విధానం తెలియపరుస్తాయి. ఒక వస్తువు వాడుకలో సమస్యలకు అందుబాటులో ఉన్న ఆన్ లైన్ పరిష్కార మార్గములను చూపుతాయి. ఒక వస్తువు యొక్క పనితీరుని సమీక్షిస్తాయి…

దైనందిన జీవితంలో బ్లాగుల ద్వారా విలువైన సమాచారం

వ్యక్తి జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. అటువంటి ఆరోగ్యం గురించి వివరించే బ్లాగులు అనేకం ఉంటాయి. రోగము, రోగ లక్షణాలు, రోగ నివారణ, రోగ నివారణకు చర్యలు, రోగ నిర్ధారణ… రక రకాలుగా ఆరోగ్యం గురించి సమాచారం అందించే బ్లాగులు ఆన్ లైన్లో అనేకంగా కనబడతాయి.

ఇంకా చిట్కాలు తెలియజేయడంలో బ్లాగుల ప్రత్యేకత ఉంటుంది. దైనందిన జీవితంలో అనేక అవసరాలు ఉంటాయి. అలాంటి అవసరాలకు చిన్నపాటి చిట్కాలతో సరిపోతుంది. అలా చిన్న చిన్న చిట్కాలకు విపులంగా వివరించడంలో బ్లాగులు, వ్లాగులు ఉపయోగపడతాయి.

ముందు జాగ్రత్త గురించి ముందుగానే హెచ్చరించే బ్లాగులు

  • స్మార్ట్ ఫోనుకు అలవాటు పడే అవకాశం
  • వ్యక్తి జీవితంలో స్మార్ట్ ఫోన్ ప్రధాన్యత
  • మనిషికి స్మార్ట్ ఫోన్ వలన ఉపయోగాలు
  • సమాజంలో స్మార్ట్ ఫోన్ చూపుతున్న ప్రభావాలు
  • చిన్న పిల్లలపై స్మార్ట్ ఫోన్ ప్రభావం
  • చిన్న వయస్సులోనే స్మార్ట్ ఫోన్ అలవాటు అయితే, పెద్దయ్యాక ఎదురయ్యే కళ్ళ సమస్యలు

ఇలా ఒక స్మార్ట్ ఫోన్ వలన ఉపయోగాలు, నష్టాలను వివరిస్తూ, అవి సమాజంపై ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయో… వాటికి అలవాటు పడకుండా ఉండడానికి ఎలాంటి చర్యలకు పూనుకోవాలి… తదితర జాగ్రత్తలను గురించి తెలియజేస్తూ హెచ్చరించే బ్లాగులు ఎక్కువగానే ఉంటాయి.

విద్యా విషయాలలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల పాత్ర

ఇంకా విద్యా విషయాలలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల పాత్ర అమోఘం అంటారు. L.K.G. నుండి డిగ్రీ వరకు ఎలాంటి సమాచారం విద్యార్ధులకు అవసరమో వాటిని బ్లాగులు అందిస్తూ ఉంటాయి.

పదవ తరగతి తరువాత ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం అందించడంలో అనేక బ్లాగులు పోటీ పడతాయి.

పరీక్షలకు మనసును ఎలా సమాయత్తం చేసుకోవాలి? ఈ ప్రశ్నకు సూచనలనిచ్చే బ్లాగులు అనేకం.

తరగతుల వారీగా ఆన్ లైన్ క్లాసుల వీడియోలను అందించే వ్లాగులు.

సబ్జెక్టుపై సందేహాలను వివరించే బ్లాగులు… సబ్జెక్టుపై వివరణాత్మక విశ్లేషణలు అందించే బ్లాగులు… వివిధ రకాలుగా విద్యా విషయాలలో బ్లాగులు సమాచారం అందిస్తూ ఉంటాయి.

సినిమా విషయాలను అందించడంలో బ్లాగులు ఉత్సాహం

వినోదం అందించే విషయాలలో వ్యక్తికి సహజంగానే ఆసక్తి ఉంటుంది. వారి ఆసక్తికి తగ్గట్టుగానే వినోద విషయాలను, ఆ విషయాలకు సంబంధించిన వ్యక్తుల గురించి బ్లాగులు అనేక విషయాలను అందిస్తూ ఉంటాయి.

సినిమా నటులు, సినిమా నటుల వివరాలు, సినిమాలపై సమీక్షలు… రక రకాల సినిమా విషయాలను సినీ ప్రియులకు ఆన్ లైన్ ద్వారా బ్లాగులు అందిస్తూ ఉంటాయి. ప్రతి న్యూస్ వెబ్ సైటులోనూ ఒక సినిమా పేజీ ప్రత్యేకంగా ఉంటుంది.

సామాజిక అంశాలను ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగులు వివరిస్తూ ఉంటాయి.

మన సమాజంలో అనేక సమస్యలతో బాటు ప్రకృతి పరంగా రాబోయే మార్పులు, జరగబోయే నష్టాలు… సామాజిక సేవ చేసే నాయకులు, సమాజానికి మార్గదర్శకులుగా ఉండేవారి గురించి, గతంలోని సామాజిక పరిస్థితుల గురించి… సమాజం కోసం సమాజంలో నివసించేవారికి సామాజిక విషయాలపై పరాకు చెబుతూ ఉండే బ్లాగులు అనేకంగా ఉంటాయి.

ఇలా బ్లాగులు విలువైన సమాచారం అందిస్తూ, ఆన్ లైన్ వీక్షకులను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాయి. యూట్యూబ్ వీడియో చానల్స్ కూడా బ్లాగుల ద్వారా సమాచారం సేకరించి వీడియోలను తయారు చేసే అవకాశం కూడా ఉంటుందంటారు. కాబట్టి బ్లాగింగ్ చేయడం అలవాటుగా ఉంటే, ఆ అలవాటుతోనే ఆన్ లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చని అంటారు.

ఆన్ లైన్లో బ్లాగుని సృష్టించి, బ్లాగింగ్ మీరు చేయవచ్చునా?

అవుననే అంటారు. ఎందుకంటే బ్లాగింగ్ చేయడానికి పెద్దగా ఖర్చు ఉండదు. ఉచితంగా లభించే బ్లాగింగ్ ప్లాట్ ఫామ్స్ మనకు ఉన్నాయి. కావునా బ్లాగింగ్ అలవాటు చేసుకోవడానికి ఒక కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లేదా ఒక ట్యాబ్ వంటి పరికరం ఇంటర్నెట్ తో అనుసంధానం అయి ఉండాలి.

టైపింగ్ వచ్చి ఉండి, ఎంఎస్ వర్డ్ ఎలా ఉపయోగించాలో తెలిసి ఉంటే, చాలు ఆన్ లైన్ ద్వారా ఒక బ్లాగుని సృష్టించి, ఆ బ్లాగు ద్వారా మీకు తెలిసిన విషయాలను పోస్ట్ చేస్తూ ఉండవచ్చును.

బ్లాగు ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చును. కాకపోతే బ్లాగు ద్వారా పోస్ట్ చేయబడుతున్న పోస్టులు సొంతమైన కంటెంట్ అయి ఉండాలి. మరొకరిని అనుకరిస్తున్నట్టుగా ఉండకూడదు. సొంత టాలెంట్ ద్వారా బ్లాగింగ్ ప్రారంభిస్తే, ఆ బ్లాగు ఎక్కువమందికి పరిచయం అయ్యే కొలది, ఆన్ లైన్ మనీ ఎర్నింగ్ కు అవకాశాలు పెరుగుతాయి.

అయితే ఆన్ లైన్ ద్వారా ఒక బ్లాగుని ఉచితంగా లభించే వాటితో సృష్టించడం కన్నా ప్రీమియం హోస్టింగ్ ప్లానుతో బ్లాగును క్రియేట్ చేయడం మేలు. ఇంకా ఒక వర్డ్ ప్రెస్ ప్లాట్ పామ్ ఆధారంగా బ్లాగుని సృష్టించి ఉంటే, వర్డ్ ప్రెస్ ప్రీమియం థీమ్ మరియు ప్రీమియం ప్లగిన్స్ మనీ ఎర్న్ చేయడానికి, కంటెంట్ ఎక్కువమందికి చేరడానికి ఉపయోగపడవచ్చును.

దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా వివిధ విషయాలను వివరిస్తాయనే విశ్లేషణ పోస్టు గురించి మీ కామెంట్ ఇవ్వగలరు.

ధన్యవాదాలు

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

తెలుగువ్యాసాలు

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?