వర్డ్ ప్రెస్ కామ్ తో ఉచితంగా బ్లాగు సృష్టించడం

వర్డ్ ప్రెస్ కామ్ తో ఉచితంగా బ్లాగు సృష్టించడం

వర్డ్ ప్రెస్ కామ్ తో ఉచితంగా బ్లాగు సృష్టించడం. ఇది చాలా సామాన్య విషయమే. కానీ వర్డ్ ప్రెస్ ద్వారా సృష్టించబడిన బ్లాగు మంచి లుక్ ఉంటుంది. త్వరగా యాడ్ సెన్స్ అమోదం పొందడానికి సులభమే కానీ ఉచితంగా లభించే వర్డ్ ప్రెస్ పధకంలో పరిమితమైన ఫీచర్లు మాత్రమే ఉంటాయి. ఏమాత్రం కోడింగ్ నాలెడ్జ్ లేనివారు ఉచితంగానే బ్లాగుని క్రియేట్ చేసి, ఆ తర్వాత చెల్లింపు పధకం ప్రకారం వర్డ్ ప్రెస్ బ్లాగుని మెయింటైన్ చేయడం మేలు అంటారు.

ఉచితంగానే వర్డ్ ప్రెస్ కామ్ తో బ్లాగుని సృష్టిచడం

మొదటిగా వర్డ్ ప్రెస్ కామ్ అంటే ఆంగ్లంలో ఇలా www.wordpress.com ఇంగ్లీషులో మీ కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజరులో టైపు చేయండి. ముందుగా వర్డ్ ప్రెస్ కామ్ లో మీ వివరాలు ఇచ్చి కానీ మీ జిమెయిల్ ద్వారా కానీ ఖాతా ఓపెన్ చేయండి. వర్డ్ ప్రెస్ కామ్ లో లాగిన్ అవ్వండి. మీరు వర్డ్ ప్రెస్ కామ్ సైటులో లాగిన్ అయ్యాకా, మీరు వర్డ్ ప్రెస్ కామ్ లో వెబ్ సైట్ చూస్తే, ఈ క్రింది విధంగా స్క్రీను మాదిరిగా సైట్ క్రియేట్ చేయమనే విండో వస్తుంది.

వర్డ్ ప్రెస్ కామ్ తో ఉచితంగా బ్లాగు సృష్టించడం

పైన్ వర్డ్ ప్రెస్ స్క్రీను గమనిస్తే, Create Site అను బటన్ ఉంది. ఆ బటన్ క్లిక్ చేసి మీరు మీ వర్డ్ ప్రెస్ సైటుని సృష్టించవచ్చును. అయితే ఇక్కడ మీ సైటుకు ఒక అడ్రస్ కావాలి. అదే వెబ్ అడ్రస్… అది అంకెలలో ఉన్నా, దానికి ఆంగ్ల అక్షరాలలో పేరుని పెట్టుకోవాలి. దానినే డొమైన్ అంటారు.

గమనించవలసని విషయం: ముందుగా మీరు డొమైన్ నేముతో ఒక వర్డ్ ప్రెస్ సైటు సృష్టించాలంటే, ఖచ్చితంగా డొమైన్ నేమ్ కొనుగోలు చేయాలి. అలా కాకుండా కేవలం ఉచితంగానే మీకు నచ్చిన పేరుని ఇతర పేరుతో జోడించి వెబ్ సైటు పేరుని క్రియేట్ చేయాలంటే, అది ఉచితంగానే లభిస్తుంది. కాకపోతే మీరు ఏ ఫ్రీబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ తో వెబ్ సైటు సృష్టించదలచారో, అదే సైటు పేరు మీ వెబ్ సైటు పేరుకు తోకలాగా జోడించబడి ఉంటుంది. అలా ఒక వెబ్ సైటు పేరుకు మరొక వెబ్ సైట్ పేరు తోకలాగా జత చేయబడి ఉంటే, దానిని సబ్ డొమైన్ అంటారు. సాదారణ పేరు వెనుకాల ఇంటి పేరు ఉన్నట్టుగా... ఈ సబ్ డొమైన్ పూర్తిగా ఉచితంగానే లభిస్తుంది. అయితే అది అందుబాటులో ఉండే పేరు అయి ఉండాలి.

ఈ క్రింది వర్డ్ ప్రెస్ సైటు స్క్రీనుని గమనించండి. ఈ క్రింది చిత్రంలో కర్షర్ ఉండి అక్కడ Search… అను ఆంగ్ల అక్షరాలు గలవు. అక్కడ మీరు మీకు నచ్చిన పేరుని టైపు చేస్తే, అది అందుబాటులో ఉంటే, మీరు ఆ పేరుతోనే ఒక వర్డ్ ప్రెస్ వెబ్ సైటుని సృష్టించగలరు.

ఈక్రింది చిత్రం గమనించండి. అక్కడ సెర్చ్ లో bloggingtelugu అని టైప్ చేసి ఎంటర్ చేయగానే… వివిధ డొమైన్లను సూచిస్తుంది. అందులో .com, .in, .net, .co.in, .blog, .site వంటి ఎక్స్ టెన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎక్స్ టెన్స్ ఒక్కొక్క ధరలో లభిస్తుంది. అయితే మీరు సబ్ డొమైన్ ఎంచుకుంటే… అంటే మీపేరు వెనుకాల ఇంటిపేరు ఉన్నట్టుగా మీ వెబ్ సైట్ వెనుక వర్డ్ ప్రెస్.కామ్ ఉంటుంది. ఈ క్రింది చిత్రంలోనే గమనించండి. bloggingtelugu.wordpress.com కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు అది Select చేస్తే, ఆ తర్వాత మీ తదుపరి చర్య హోస్టింగ్ పధకం ఆప్సన్ వద్దకు వస్తుంది.

వర్డ్ ప్రెస్ వెబ్ సైటుకు పేరుతో బాటు, వెబ్ సైటులో కంటెంటుని ఆన్ లైన్లో సేవ్ చేయడానికి వెబ్ స్టోరేజ్ కావాలి దానినే హోస్టింగ్ అంటారు.

వెబ్ హోస్టింగ్ / షేర్డ్ హోస్టింగ్ వర్డ్ ప్రెస్ కామ్ తో

వెబ్ హోస్టింగ్ అంటే, సర్వరులో ఒక భాగమును పంచుకోవడం. అలా వెబ్ సర్వరులో కొంత బాగమును ఒక ధరకు నిర్ణయించి, దానిని అమ్మకానికి పెడతారు. సర్వరులో బాగము మరియు సర్వరు నుండి డేటా ట్రాన్సఫర్, ఇమెయిల్ సర్వీసు, డొమైన్ రక్షణ, వెబ్ సైట్ సృష్టించడానికి అవసరమయ్యే వివిధ వెబ్ సాఫ్ట్ వేర్లతో ఉండే సిప్యానెల్... తదితర అంశాలతో హోస్టింగ్ పధకాలు ఉంటాయి. అయితే కేవలం వర్డ్ ప్రెస్ తో మాత్రమే వెబ్ సైట్ సృష్టించడానికి వర్డ్ ప్రెస్ కామ్ నుండి కూడా హోస్టింగ్ ప్యాకేజి కొనుగోలు చేయవచ్చును. అయితే ఈ వర్డ్ ప్రెస్ కామ్ ప్యాకేజి ధర ఎక్కువగా అనిపిస్తే, ఇంకా చౌకగా అందించే హోస్టింగ్ సర్వీసు ప్రొవైడర్లు అన్ లైన్లో అందుబాటులో ఉంటాయి. హోస్ట్ గేటర్, బ్లూహోస్ట్, గోడాడి.... వంటి సంస్థలు. 
పై చిత్రంలో మీరు గమనిస్తే, నెలవారీ పధకాలు క్రింద రెండు హోస్టింగ్ పధకాలు వర్డ్ ప్రెస్ అందిస్తుంది. వాటిని ఎంపిక చేసుకుంటే, నెలవారి మొత్తమును ఒక సంవత్సరమునకు గాను ఎంత ఎమౌంట్ అవుతుందో? అంత మొత్తమును ముందుగానే చెల్లించాలి. లేదా పైన బాక్సులో అండర్ లైన్ చేసి ఉన్న Start with free site ద్వారా కొంతకాలం వర్డ్ ప్రెస్ సైటుని పబ్లిష్ చేయవచ్చును.

ట్రైల్ పీరియడ్లో మీరు బాగా వర్డ్ ప్రెస్ సైటుని పాపులర్ చేసి, దానికి గూగుల్ యాడ్ సెన్స్ అమోదం పొందితే, మీరు మీ వర్డ్ ప్రెస్ .కామ్ సైటులో ప్రీమియం పధకానికి అప్ గ్రేడ్ కావచ్చును.

వర్డ్ ప్రెస్ తో కాకుండా మీరు మీ సిప్యానెల్ ద్వారా వర్డ్ ప్రెస్.ఆర్గ్ నుండి లభించే థీమ్స్ ద్వారా వర్డ్ ప్రెస్ సైటుని సృష్టించవచ్చును. అయితే దీనికి అనుభవం తప్పనిసరి. లేదా వెబ్ నాలెడ్జ్ ఉన్నవారితో మీరు హోస్టింగ్ ప్లాన్ కొనుగోలు చేసి, వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేయించుకుని, వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఐడి. పాస్ వర్డ్ సాయంతో మీరు మీ బ్లాగుని మెయింటైన్ చేయవచ్చును. ఇది ఉత్తమ ఎంపికగా కూడా చెబుతారు.

మీకు వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసి, వర్డ్ ప్రెస్ అడ్మిన్ పేజి ద్వారా మీరు మీబ్లాగుని నియంత్రించే విధంగా వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేయడానికి… సంప్రదించండి… ఈ క్రింది మెయిల్

మీరు డొమైన్ మరియు హోస్టింగ్ పధకం కొనుగోలు చేసుకోవాలి. సబ్ డొమైన్ కన్నా మెయిన్ డొమైన్ ఇంపార్టెంట్. మరియు హోస్టింగ్ ప్యాకేజీ కూడా వర్డ్ ప్రెస్ కు మద్దతు పలికే విధంగా ఉండడం మేలు అంటారు. ఈ క్రింది మెయిల్ కు మెయిల్ చేస్తే, వర్డ్ ప్రెస్ బ్లాగు సృష్టించడానికి సమాచారం లభించగలదు. 

telugureads.com@admin

తెలుగురీడ్స్.కామ్

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్

మనసుకు నచ్చే మంచి మాటలు

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

వివిధ విద్యావిషయాలు తెలుగు వ్యాసాలు

నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో