యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి! ఎలా యూట్యూబ్ ఛానల్ మరింతమంది వీక్షకులను ఆకట్టుకోవాలి? ఎలా మరింతమంది సబ్ స్క్రైబర్లను పెంచుకోవాలి. ఇదో పెద్ద సవాల్ యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ ?. ఓ వెబ్ సైట్ అయితే సాంకేతికత అవసరం కానీ యూట్యూబ్ ఛానల్ కు సరైన కంటెంటు ఉంటే మాత్రం ఆ కంటెంటే వీక్షకులను తీసుకువస్తుంది. కాబట్టి కంటెంట్ ఆధారంగా అనేక ఛానల్స్ రావడంలో మరింత పోటీ పెరిగింది. ఆ పోటీలో నిలబడాలంటే, కంటెంటుతో బాటు మరికొంత ప్రత్యేక శ్రద్ధ అవసరం.

వీడియోలకు వాటర్ మార్క్ జోడించండి!

ఆకర్షణీయమైన మీ యూట్యూబ్ ఛానల్ ఐకానును ఛానల్ కు బ్రాండెడ్ వాటర్ మార్కు జోడించండి. ఇది ఒక చక్కని చిన్న టిప్. మీ ఛానెల్ చూసేవారికి మీ ఛానెల్‌ యొక్క సభ్యత్వం పొందేందుకు ఇది మరొక మార్గాన్ని జోడిస్తుంది.

యూట్యూబ్ ఖాతాకు డిఫాల్ట్ సెట్టింగ్

మీ ఛానల్ వీడియోలను సందర్శించే వీక్షకులకు డిఫాల్ట్ వీడియో ద్వారా అన్నింటికి సబ్ స్క్రైబ్ అవ్వమని, ఇంకా మీ ఛానల్ గురించి తెలియజేసే, డిఫాల్ట్ సెట్టింగ్స్ జోడించండి.

థంబనైల్స్

ప్రతి యూట్యూబ్ వీడియోకు మొదటిగా కనబడే చిత్రమే వీక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక చక్కటి చిత్రంలోనే మీ వీడియోలో ఎలాంటి కంటెంట్ ఉంటుందో ఒక ఆలోచన వీక్షకుడి మైండులోకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి వీడియోకు ఒక చక్కటి చిత్రమును అర్ధవంతంగా చూడచక్కని చిత్రంగా రెడీ చేసి వీడియోకు జోడంచడం వలన వీక్షకుల తాకిడి పెరిగే అవకాశం ఉంటుంది.

ట్రెండుకు అనుగుణంగా

యూట్యూబ్ ఛానల్ వీడియోలు ఒక అంశంలో ఓ విధానంలో కంటిస్యూ టాపిక్స్ తో లేటెస్ట్ ట్రెండుకు తగ్గట్టుగా ఉండేవిధంగా తగు ప్రణాళిక అవసరం. ప్రతి వీడియో మీరు పడే కష్టం, మీకు వీక్షకుల సంఖ్యను పెంచుతుంది. సరైన స్క్రిప్ట్ మంచి వీడియోను మేకింగ్ చేయడానికి సహాయపడగలదు.

ప్రతి యూట్యూబ్ వీడియో కూడా ట్రెండును ఫాలో అవుతూనే మీ స్టైల్లో వీడియో మరింత అర్ధవంతంగా మరింత అవగాహన ఏర్పరచేవిధంగా ఉండాలి. ఉదాహరణకు ఒక సినిమాకు రివ్యూ వీడియోలు అనేకమంది చేస్తూ ఉంటారు. అన్ని వీడియోలు వీక్షించినా మీ రివ్యూ వీడియో వీక్షించాలనే విధానంగా మీ వీడియో ప్రజెంటేషన్ వీక్షకుడి మైండులో ఉండాలి.

అప్ లోడ్ టైమింగ్

మీరు మీ యూట్యూబ్ ఛానల్లో అప్ డేట్ చేసే వీడియోలు ఓ క్రమపద్దతిలో నిర్ధిష్ట కాలపరిమితిలో క్రమం తప్పకుండా ఉండేవిధంగా చూసుకోవాలి. ఒక నెలలో ఏ వీడియోలు లేకుండా మరుసటి నెలలో పది వీడియోలు అప్ లోడ్ చేయడం కాకుండా, ప్రతి నెలలో ఓ మూడు వీడియోలు పది రోజుల కాల వ్యవధిలో వీడియోలు అప్ లోడ్ చేయడం వలన సబ్ స్కైబర్ మైండులో కూడా ఫలానా సమయంలో మీ వీడియో వస్తుందనే ఊహతో ఉండవచ్చును. ఇంకా అటువంటి వీడియోల కొరకు ఆసక్తితో ఎదురు చూడవచ్చును. వీక్షకుడి మైండులో సృష్టించబడే ఆసక్తితోనే మీ ఛానల్ వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి.

యూట్యూబ్ వీడియో టైటిల్స్

మీ వీడియోకు టైటిల్ ఎంపిక విషయంలో మీరు చూపే శ్రద్ద, మీ యూట్యూబ్ వీడియో పాపులర్ కావడంలో ఉపయోగపడుతుంది. మీ వీడియోలో ఉండే కంటెంటు యొక్క ఉద్దేశ్యం ప్రతిబింబించేలా ఇప్పటి యూట్యూబ్ ట్రెండింగ్ వర్డ్స్ ఉపయోగిస్తూ టైటిల్ లెంగ్త్ కూడా పెద్దదిగానే ఉండే విధంగా చూసుకోవాలి. ఇంకా ఆ వీడియో డిస్క్రిప్షన్లో మీ వీడియో టైటిల్ కూడా ప్రతిబింబించాలి. వీడియో డిస్క్రిప్షన్లో పాపులర్ వర్డ్స్ ఉపయోగించాలి. అవి వీడియో కంటెంటును ప్రతిబింబించే పదాలు అయి ఉండాలి.

బ్రాండెడ్ ఛానల్ లుకింగ్

మీ ఛానల్ సాదారణ యూట్యూబ్ ఛానల్ మాదిరిగా కాకుండా ఓ బ్రాండ్ టివి ఛానల్ మాదిరిగా మార్చేయండి. మీ ఛానల్ వీడియోలకు తగ్గట్టుగానే వచన రూపంలో కూడా బ్లాగు పోస్టులను ఆన్ లైన్లో విస్తరింపజేయండి. మీ బ్లాగు పోస్టులు గూగుల్ సెర్చ్ లో కనెక్ట్ అయ్యే విధంగా ఓ అందమైన బ్లాగుని సృష్టించండి. మొదట్లో మీ యూట్యూబ్ ఛానల్ పై శ్రద్ధ పెట్టినట్టే, మీ బ్లాగుని పాపులర్ చేయడంలో కూడా శ్రద్ద పెట్టండి. మీ ఛానల్ మరియు మీ బ్లాగు ఒకదానికొకటి సహాయకారిగా మారతాయి. మీ ఛానల్ మరింతగా వృద్ది చెందే అవకాశం ఉంటుంది.

వీడియో లెంగ్త్

ఇంకా ఎక్కువ నిడివి ఉండే యూట్యూబ్ వీడియోలు మీ ఛానల్లో ఎక్కువగా ఉండేవిధంగా చూసుకోండి. అలా ఎక్కువ నిడివి వీడియోల వలన మీ ఛానల్ వాచ్ టైం పెరుగుతుంది.

ఛానెల్ కూ ట్రైలర్ వీడియో తయారు చేయండి. ఇది ఛానల్ యొక్క ఉద్దేశ్యం ఏమిటో తెలియజేస్తుంది.

తప్పనిసరిగా ఓ వెబ్ సైటు కానీ బ్లాగు కానీ మీ ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉండేవిధంగాచూసుకోండి.

ప్రతి వీడియో నిడివి పదినిమిషాల పైబడి ఉండేవిధంగా ప్రణాలిక చేయండి.

షార్ట్ వీడియోస్

అందరూ ట్రెండిగా వినోదం చాలా సింపుల్ వీడియోలను అంటే షార్ట్ వీడియోలను ఇష్టపడుతున్నారు. కాబట్టి పొట్టి వీడియోలను రూపొందించండి. అవి ఛానల్ కంటెంట్ కు అనుసంధానంగా చిన్న చిన్న టిప్స్ అందించే విధంగా ఉంటే, దీర్ఘకాలిక వీడియో వీక్షణకు కూడా ఆసక్తి పెరగవచ్చును.

తెలుగురీడ్స్ హోమ్

తెలుగులో ఆర్టికల్స్ విద్యా విషయాలలో తెలుగువ్యాసాలు

Telugureads Blog

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

మనసుకు నచ్చే మంచి మాటలు

రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్

Leave a Comment