నేటి నీ కృషి రేపటికి నీకు

నేటి నీ కృషి రేపటికి నీకు అక్కరకు వస్తుంది. ఈ రోజు పని ఈరోజే చేసేస్తే, రేపు ఇంకొక పనిని పూర్తి చేయవచ్చును. అలా కాకుండా నేటి పనిని రేపటికి వాయిదా వేస్తే, నేటి పనిని రేపు పూర్తి చేయలేకపోతే, నేడు, రేపు కూడా కాలం వృధా అవుతుంది. కాబట్టి నేటి నీ కృషి రేపటికి భరోసా అవుతుంది.

అలాగే నేటి నీ పరిశీలన రేపటికి అవకాశంగా మారవచ్చును. నేడు వస్తున్న వార్తలపై నీ పరిశీలన ఉంటే, రేపు వచ్చే వార్తలలో వాస్తవికతను తెలుసుకోగలం.

నేడు నీవు ఒక పుస్తకమును శ్రద్దతో చదివితే, రేపటికి ఆ పుస్తకంలోని విషయంపై సమగ్ర వివరణ ఇవ్వవచ్చును.

ఏదైనా నేటి నీ కృషి రేపటికి నీకు అక్కరకు వస్తుంది.

నేడు నీవు ఒక స్మార్ట్ ఫోన్ గురించి విపులంగా తెలుసుకుంటే, దాని గురించి సమగ్రంగా వివరణ ఇవ్వగలవు.