By | July 18, 2024
ఏపీకి ఏం కావాలి? అంటే

ఏపీకి ఏం కావాలి? అంటే, అభివృద్ది కావాలి. పేదలకు సంక్షేమం అందాలి. పరిశ్రమలు పెరగాలి. వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ది చెందాలి. గ్రామాలలో సౌకర్యాలు కావాలి. రోడ్లు బాగుపడాలి. వ్యవసాయానికి సమృద్దిగా నీరు కావాలి. వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు కావాలి. అందరికీ శుభ్రమైన త్రాగు నీరు కావాలి…… ఏపీకి ఏం కావాలి? అంటే…. అవసరం అయిన అన్ని ఏపీకి కావాలి.

2014 విభజనలో రాష్ట్రం లోటు బడ్జెట్ తో స్తార్ట్ అయ్యింది. 2019 చివరకు ఏపీకి అప్పులు పెరిగాయి. 2024 ఏప్రిల్ వరకు ఏపీకి అప్పులు మరింతగా పెరిగాయి. అవి అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుందని ప్రస్తుత సమయంలో మీడియాలో చర్చ. ఏపీ అప్పులు గురించి మీడియాలోనే వార్తలు, చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాల విడుదల చేస్తుంది.

ఏపీకి బాబు కావాలి అంటూ 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికలలో ఏపి ప్రజలు తీర్పు చెప్పారు. ఆర్భాటంగా అమరావతి ఆరంభించారు. పోలవరం ప్రొజెక్టు కట్టడం వేగంగా జరుగుతూ వచ్చింది. ప్రజలు పోలవరం చూడడానికి బస్సులతో తీసుకువెళ్లారు. కియా మోటార్స్ వచ్చింది… 2014 – 2019 కొంతవరకు పరిస్థితి ఆశాజనకంగా అనిపించిందని అంటారు. అయితే 2018 వచ్చే సరికి ఏపీలో జరుగుతున్న అభివృద్ది సరిపోదు, ఇంకా కావాలి అంటూ…. ప్రచారం జరిగిందని అందుకే ప్రజలు జగన్ అయితే మరింత వేగంగా వృద్ది చెందుతుందని భావించరని, అందుకే 2019 ఎన్నికలలో ఏపీకి ఏం కావాలి? అంటే జగన్ కావాలి అంటూ, గతంలో ఎవ్వరికీ రాని మెజార్టి ప్రజలు వైసిపికి ఇచ్చారని విశ్లేషకులు వివరించారు.

2024లో ఏపీకి ఏం కావాలి? అంటే కూటమి కావాలి అంటూ…

కానీ కారణాలు మీడియాలోనే ఉన్నాయి. అమరావతి పనులు ఆగాయి. పోలవరం ప్రొజెక్టు పూర్తికాలేదు. కొత్తగా పరిశ్రమలు రాలేదు. 2019 – 2024 మద్యలో అభివృద్ది కన్నా సంక్షేమమే మిన్న అని వైసిపి పార్టీ అభిప్రాయపడినట్టుంది… అందుకే ఒక్క బటన్ నొక్కడం వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేవిధంగా పనిచేశారని అంటారు. అయినా 2023 సంవత్సరం చివరికి ఏపీ ప్రజల ఆలోచనలో పెద్ద మార్పు వచ్చిందని ఈ సారి విశ్లేషకులు కూడా గ్రహించలేకపోయారని మీడియాలో చర్చ.

2024లో జరిగిన ఎన్నికలలో ప్రజల తీర్పు 2019 ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఇంకా ఎక్కువ మెజార్టీని కూటమికి కట్టబెట్టారు. ఏపీకి ఏం కావాలి? అనే ప్రశ్నకు ప్రజలు చాలా క్లారీటితోనే ఉంటున్నారు. అభివృద్దిని వేగంగా ఆశిస్తున్నారు.

అయితే అభివృద్ది అలా వేగంగా జరగాలంటే, ఆరంభంలోనే సాధ్యం కాదు. కానీ ప్రారంభం జరిగిన కొన్నాళ్లకు అభివృద్దిలో వేగం ఉంటుంది కానీ ఏదైనా ఆరంభంలోనే అభివృద్ది వేగంగా జరగదని అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఎవరు ఎలా విశ్లేషించకున్నా… ఏపీ ప్రజలు ప్రభుత్వానికి ఇస్తున్న గడువు అయిదేళ్లు మాత్రమే… ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే, పూర్తి వ్యతిరేక తీర్పును ప్రజలు ఇచ్చేస్తున్నారు. అది ప్రభుత్వ అంచనాకు కూడా అందని విధంగా ఉంటుంది.

ఏపీకి ఏం కావాలి? అంటే, సామాన్యులకు, మధ్య తరగతివారికి ఆదాయం పెరగాలి.

సామాన్యుడికి ఆదాయం ఉండాలి. సామాన్యుడికి ఆదాయం ఉంటే, అతను తనకు వచ్చిన ఆదాయంలో కొంత సొమ్మును ఖర్చు చేస్తాడు. అలాంటి సామాన్యులు అనేకమంది ఖర్చు చేసే, ఖర్చు వలన సమాజంలో మనీ రోటేషన్, వ్యాపారం, వాణిజ్యం పెరుగుతుంది. అభివృద్ది సాధనలో భాగంగా సామాన్యుడి ఆదాయం పెరగడం మొదటి పనిగా చెబుతారు.

ఎందుకంటే, నగరాలలోనూ, పట్టణాలలోనూ, పల్లెల్లోనూ కూడా సామాన్యులు ఎక్కువగా ఉంటారు.

ఇక మధ్యతరగతి ప్రజలకు ఆదాయం పెరిగితే, వారి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంకా వారు ఎక్కువగా పన్నులు చెల్లించడంలో కూడా ఉంటారు. కాబట్టి ఈ వర్గం ప్రజల ఆదాయం కూడా పెరిగే విధంగా అభివృద్ది ప్రణాళిక ఉండాలి.

అంటే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెరగాలి. ఉద్యోగ రూపకల్పన జరగాలి. చిన్న పరిశ్రమల పోత్సాహం జరగాలి.

ఏపీలో పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగితే, ఏపీలో పరిశ్రమలు వస్తాయని అంటారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటారు.

ముసలివారికి, అనారోగ్యవంతులకు, వితంతువులకు తదితర ఆధారపడి జీవించేవారికి ఏపీలో సంక్షేమం ఒక వరంగా ఉంది. కావునా ఏపీలో సంక్షేమం పధకాల అమలు అవసరం.

విద్యా ప్రమాణాలు పెరగాలి. ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు పెరగాలి. నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా చర్యలు ఉండాలి.

వ్యక్తిగత అభిప్రాయాలను, సాంఘిక అభిప్రాయాలుగా పరిగణించకుండా, సామాజిక శ్రేయస్సును కాంక్షించేవిధంగా చర్చలు జరగాలి. ప్రజలలో సామాజిక ప్రయోజనాలు, సామాజిక అభివృద్ది, సామాజిక శాంతి బాగుంటే, అందులో జీవించే కుటుంబ వాతావరణం బాగుంటందనే అవగాహన ప్రజలలో ఉండాలి. అప్పుడే అసాంఘిక కార్యకలాపాలు సాగించేవారిలో మార్పు ఉంటుంది.

ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకం, ప్రభుత్వానికి ప్రజలలో భరోసా ఇవ్వడం ప్రధానం

ఏపీకి రాజధాని పూర్తికాలేదు. ఏపీకి గుండెకాయలాంటి ప్రొజెక్టు పూర్తి కాలేదు… అవి పూర్తయ్యే సరికి ఏపీ బాగుంటుంది. కానీ ఏపీ ప్రజలు ఇచ్చిన సమయం ఐదేళ్లు మాత్రమే… ఈ ఐదేళ్ళలో ప్రభుత్వం ప్రజల నమ్మకం పొందాలి. అప్పుడే ఏపి అభివృద్ది చెందడానికి కావాల్సిన సమయం ప్రభుత్వానికి లభిస్తుంది.

ప్రధానంగా ఏపీకి ఏం కావాలి? అంటే ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకం కావాలి. ప్రభుత్వం ప్రజలను మోసం చేయడంలేదనే భరోసాని ప్రజలలో కల్పించాలి. ఎందుకంటే ప్రచారంలో మంచి చెడులు మద్య సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కావునా ఎటువంటి ప్రచారం, ఎప్పుడు ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలియదు. కావునా ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకం పోకూడదు. ఇంకా పారిశ్రామిక వేత్తలలో ఏపీపై నమ్మకం బలపడాలి.

ఎన్నో అవకాశాలు ఉంటాయి. కష్టపడాలి అనే స్వభావం గల వ్యక్తికి సమాజం అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. అలాగే భవిష్యత్తుపై అవగాహన ఉన్న నాయకుడికి సమాజంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి. అయితే ప్రధానం నాయకుడిపై ప్రజలకు దీర్ఘకాల నమ్మకం, అలాగే ప్రజలలో తనపై ఉన్న నమ్మకం వమ్ముకాకుండా, నాయకుని పరిపాలన ఉంటే, ఏపీలో అభివృద్ది సాద్యమే… నమ్మకమే ఇప్పుడు ప్రధానం అయితే, అసత్య ప్రచారాలను పట్టించుకోకుండా ఉండడం మరింత ముఖ్యం.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మధువు మీనింగ్ ఇన్ తెలుగుచిత్తము అనే పదానికి తగిన అర్థం