By | July 22, 2024
కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? మహా భారతం ఇతిహాసం అంటే గతంలో జరిగినది… దానిని గ్రంధస్తం చేశారు. కాబట్టి జరిగిపోయినది. కానీ పంచమవేదంగా మహాభారతాన్ని చెబుతారు. అందులో నుండి ధర్మ సూక్ష్మములు తెలుసుకోవచ్చును అని పెద్దలు చెబుతారు.

మహాభారతం గొప్పగ్రంధం అందులోని కొందరి జీవితాలను పరిశీలిస్తే, జీవితంలో ఎలా ఉండకూడదో? ఎలా ఉండాలి? వంటి కొన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని అంటారు. అలా కర్ణుడి గురించి పరిశీలిస్తే….

పాండవులకు తల్లి అయిన కుంతీదేవి, వివాహమునకు ముందే కర్ణుడికి కన్నతల్లి. కుంతీదేవి బాలికగా ఉన్నప్పుడే, దుర్వాస మహర్షికి సేవలు చేసి, ఆ మహర్షి మెప్పు పొందింది. కనుక దుర్వాస మహర్షి కుంతీదేవికి ఒక మంత్రమును ఉపదేశిస్తాడు. సూర్యుని చేసి, దుర్వాస మహర్షి ఉపదేశించిన మంత్రమును ఆమె పఠించడంతో, సూర్యుడు ప్రత్యక్షం అవుతాడు. కుంతీదేవికి సంతానం ప్రసాదిస్తాడు. వివాహం కాకుండా సంతానం ఉండకూడదని భావించిన కుంతీదేవి, కర్ణుడిని ఒక పెట్టెలో భద్రంగా పెట్టి, ఆ పెట్టెను నదీ ప్రవాహంలో వదిలిపెడుతుంది. అలా కుంతీదేవి వదలిని పెట్టె, రాధాదేవికి లభిస్తుంది. అప్పటి నుండి కర్ణుడు సూతుడు, రాధాదేవిల ప్రేమానురాగాల మద్య పెరుగుతాడు.

సూతుడు, దృతరాష్త్రుడు స్నేహితులు కావునా, కురు, పాండవులతో పాటే, ద్రోణాచార్యుల వద్ద విలువిద్యను కర్ణుడు కూడా అభ్యసిస్తాడు. అస్త్రములను పొందుతాడు. ఆ తర్వాత పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రమును పొందుతాడు.

కర్ణుడు గొప్ప గుణములను కలిగి ఉంటాడు. గొప్ప పరాక్రమవంతుడు. కుమార విద్య ప్రదర్శన సమయంలో కర్ణుడు, అర్జునుడితో పోటీపడతాడు. దుర్యోధనుడి వలన అంగరాజ్యమునకు రాజు అవుతాడు.

అలా కర్ణుడు అంగరాజుగా మారినప్పటి నుండి దుర్యోధనుడు, కర్ణుడి మైత్రి స్థిరపడుతుంది. విడివడలేని స్నేహబంధంగా మారుతుంది. ఇక అక్కడి నుండి పాండవుల పతనం కోరుకుంటున్న, దుర్యోధనుడి పధక రచనలలో కర్ణుడి పాత్ర కీలకంగా మారుతుంది. ఇంకా దుర్యోధనుడు పాండవులపై విపరీతమైన పగను పెంచుకోవడం కర్ణుడి పాత్ర కూడా ఉంటుందని చెబుతారు.

కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి? ధర్మం వైపు నిలబడకపోతే

ఇక కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు, అర్జునుడి చేతిలో హతుడవుతాడు. అందుకు ఆయనకు గల శాపాలు కూడా కలసివస్తాయి. అయితే అందరూ అనేది ఏమిటంటే?

శాపాలు లేకపోతే, కర్ణుడుని, అర్జునుడు ఏమిచేయలేడు. ఇంకా అరణ్యపర్వంలో కవచకుండళాలు ఇంద్రునికి ఇవ్వకుండా ఉండి ఉంటే, కర్ణుడిని గెలవడం కూడా కుదరదని అంటారు.

అవును అని అంగీకరించాలి కూడా… అయితే ఎందుకు మరి దేవతలు ఈ విధంగా చేశారు.

పుట్టుకతో కవచ కుండలాలు గల కర్ణుడు, కేవలం ధర్మం వైపు నిలబడకపోవడం వలననే అతనికి అజేయశక్తినిచ్చే, కవచ కుండళాలు అతనికి దూరం అయినాయి అంటారు. ఎందుకు కర్ణుడు అధర్మపరుడైన దుర్యోధనుడివైపు వెళ్ళి ఉంటాడు?

ఆది నుండి అర్జునుడు అంటే, కర్ణుడికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా విలువిద్యలో అర్జునుడు పొందుతున్న మెప్పు కన్నా తన విద్య మెప్పు పొందాలనే భావన… వలన అర్జునుడి కంటే, తను గొప్ప అనిపించుకోవాలనే బలమైన భావన వలన బహుశా కుమార విద్యా ప్రదర్శన సమయంలో కర్ణుడు, అర్జునుడితో పోటీ పడతాడు. అందులో కర్ణుడి ప్రతిభ చూసిన దుర్యోధనుడు, కర్ణుడిని అంగరాజుగా చేయడంతో, దుర్యోధనుడితో మైత్రి పెరిగింది.

కర్ణుడి పతనానికి కారణం ఏమిటి?

కుఠిల బుద్ది, అసూయపరుడైన దుర్యోధనుడి ఆలోచనలకు అనుకూలంగా కర్ణుడు ఆలోచనలు చేయడమే, అతని శక్తి క్షీణించడానికి కారణం అంటారు.

ధర్మాన్ని గెలిపించడమే దేవతల కర్తవ్యం అని, అందులో భాగంగా మానవులను పావులుగా చేసుకుంటారు. అందుకు వారి స్వభావమును దోషముగా చూపుతారని అంటారు.

సహజంగా కర్ణుడు గొప్ప గుణములు గలవాడు. కానీ చెడు సావాసం చేయడం. ఆ చెడు సహవాసంతో మమేకం కావడమే అతని పతనానికి నాంది అంటారు. మరీ ముఖ్యంగా ద్రౌపదీ వస్త్రాపహరణకు దుర్యోధనుడిని మాటలతో ఉసిగొప్పింది కర్ణుడేనని అంటారు. అదే అక్కడి చాలామంది పతనానికి నాంది అంటారు.

అంటే ఎంత పరాక్రమం, ఎంతటి శక్తి ఉన్నా సరే చెడ్డవారితో స్నేహం చేస్తే, సహజ లక్షణాలు కూడా శోభించవు.

ఎన్ని గొప్పగుణాలు ఉన్నా, చెడ్డవ్యక్తితో స్నేహం చేస్తే, ఆ స్నేహం వలన గొప్ప గుణాలు కూడా మసకబారిపోతాయి.

కావునా కర్ణుడి జీవితం నుండి ఏం గ్రహించాలి? అంటే మంచి వారితో స్నేహం చేయలేకపోయినా, చెడ్డవారితో స్నేహం కూడదు.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మధువు మీనింగ్ ఇన్ తెలుగుచిత్తము అనే పదానికి తగిన అర్థం