దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు మరియు లక్ష్యాలను సాధించడానికి ఒక సంస్థ లేదా వ్యక్తికి మార్గనిర్దేశం చేసే వ్యూహాత్మక రూపకల్పన. దీర్ఘకాలిక ప్రణాళికలు వలన ఉపయోగాలు ఉంటాయి.
స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని, వాటిని సాధించడానికి తగిన సమయం లభిస్తుంది.
ఆర్ధిక వనరులు, మానవ వనరులు మరియు బౌతిక వనరులు వినియోగించుకుని వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి దిశను నిర్ధేశిస్తాయి.
భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులు గుర్తించడంలో, ఆయా పరిస్థితులకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించడంలో సాయపడతాయి.
దీర్ఘకాలిక ప్రణాళిక అమలులో తాత్కాలిక ప్రణాళికలు అమలు చేసుకుంటూ, దీర్ఘకాల లక్ష్యాలను నిర్ధేశించుకోవచ్చును.
స్థిరమైన అభివృద్దిని సాధించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉపయోగపడతాయి.
దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా, పరిస్థితులకు అనుకూలంగా స్వల్పకాలిక ప్రణాళికను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది.
విశ్వసనీయత ఉంటుంది. అమలు చేయడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఫలితం కూడా ఎక్కువకాలం ఉంటుంది.
ఈ విధంగా దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేసిన సంస్థలో మరియు సంస్థపై విశ్వనీయత వస్తుంది.
ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?
0 responses to “దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు”