By | August 8, 2024
పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా?

పవన్ కళ్యాణ్ కామెంట్స్ పుష్పపైనా? ఈరోజు పవన్ కళ్యాణ్ కర్నాటక ముఖ్యమంత్రితో భేటీ అయ్యాకా, ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ అడవుల గురించిన మాటలు చర్చానీయంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న మంత్రి శాఖల్లో అటవీ శాఖ కూడా ఒక్కటి.

అయితే మీడియాతో మాట్లాడుతూ ఆయన ”40 సంవత్సరాల క్రిందట సినిమాలలో హీరో అడవులను రక్షించే పాత్రలను పోషిస్తూ ఉంటే, ప్రస్తుతం సినిమా హీరో అడవులను నరికి, అటవీ సంపదను స్మగ్లింగ్ చేసే పాత్రలు పోషిస్తున్నారంటూ”… అర్ధం వచ్చేలా సినిమా స్థితి ఉందని అభిప్రాయం వెల్లడించడంతో… ఆ మాటలు పుష్ప సినిమానే ఉద్దేశించి మాట్లాడినట్టుగా భావించడానికి అస్కారం ఉండడంతో ఇప్పుడు ఆ చర్చ సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా వస్తుంది.

అడవుల సంరక్షణ గురించి ఉద్దేశించి మాట్లాడినట్టే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఆయన అటవీశాఖను కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి.

సినిమాల ప్రభావం జనాలలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సినిమాల పాత్రలు పాజిటివ్ గా ఉంటే, ఆ ప్రభావం ప్రజలలోనూ ఉంటుంది. మొక్కల పెంపకం, అడవుల సంరక్షణ గురించిన పాత్రలు కనిపించాల్సిన సినిమాలలో, అడవులలో చెట్లను కొట్టే పాత్రలు, ప్రజలకు చేరువ కావడం, పర్యావరణానికి అంత మంచిది కాదు అనే అభిప్రాయం కూడా ఉంటుంది.

సినిమాను, సినిమాగా చూసి ఆనందించి, సినిమాలో ఆంశాలను వదిలేసేటప్పుడు, ఎలాంటి సినిమాలు అయినా ఫరవాలేదు కానీ సినిమాలను చూసి, అనుకరించాలనే తపన ఉన్నప్పుడు సినిమా హీరో ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించే పాత్రలు చేయడమే సామాజిక శ్రేయస్సు జరుగుతుంది.

కాబట్టి పవన్ కళ్యాణ్ నేరుగా పుష్ప సినిమాను ప్రస్తావించనప్పుడు, ఆ వ్యాఖ్యాలు పుష్పకు ఆపాదించకుండా, ఆయన అడవుల సంరక్షణ కోసం తపనపడుతున్నారని భావించడం మేలు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు