By | August 2, 2024
మహా భారతంలో ధర్మరాజు గురించి

మహా భారతంలో ధర్మరాజు గురించి, మన భారతంలో ధర్మరాజు పాండవులలో జ్యేష్ఠుడు. ధర్మమార్గం విడవకుండా ప్రవర్తించిన మహనీయుడు. అందరికీ ఆయుధాలు ఉంటే, ధర్మరాజుకు ధర్మమే ప్రధాన ఆయుధం. ముల్లోకాల్లోనూ ఎదురులేని అర్జునుడు కూడా ధర్మరాజు మాట జవదాటడు. మన మహా భారతంలో ధర్మరాజుని గురించి తెలుసుకుంటే, ధర్మం గొప్పతనం తెలుస్తుంది.

ఎందుకు ధర్మరాజు గొప్పవాడు?

ఎందుకంటే, ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు అంటారు. కానీ ధర్మముని ఆచరించి ధర్మరాజుగా ప్రసిద్దికెక్కాడు. అతను అజాత శత్రువు. ప్రజల మనసెరిగి పాలిస్తాడు. ధర్మం కోసమే యుద్ధం చేశాడు కానీ ధర్మం వీడి రాజ్యాన్ని కోరుకోలేదు. ధుర్యోధనుడు మరియు అతని స్నేహితులుతప్ప మహాభారతంలో పెద్దలంతా ధర్మరాజే చక్రవర్తి కావాలని ఆశించారు. కారణం ధర్మరాజు ధర్మమునే ఆచరిస్తాడు.

శ్రీకృష్ణుడు, భీష్ముడు వంటి పెద్దలు ధర్మరాజుకి పట్టాభిషేకం చేయడానికి కృషి చేస్తారు. ఇంకా ధర్మరాజు దానములు చేశాడు. బంధువర్గమంతా బాగుండాలని ఆశించాడు. పెద్దల ఆశయాలను అమలు చేశాడు. తండ్రి కోసం ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. ఆ యాగం వలన పెద్ద యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతారని తెలుసుకున్న ధర్మరాజు చాలా చింతిస్తాడు. ఇంకా తన వల్ల యుద్ధం రాకూడదని, ఎవరు ఏమన్నా అంగీకరిస్తానని తనకు తాను నియమం పెట్టుకున్నాడు. అందుకే ధుర్యోధనుడు దురుద్దేశ్యంతో జూదానికి పిలిచినా, వెళ్లి జూదమాడాడు. వద్దని తగవుకు పోలేదు. జూదంలో ఓడాకా బొంకనూ లేదు. మాట ప్రకారం అరణ్య, అజ్ఙాతవాసం చేసి వచ్చి, రాయభారం నడిపాడు.. కానీ రాజ్యం కోసం యుద్ధమే మార్గమని అనుకోలేదు. ధుర్యోధనుడు ఎవరిమాట వినకుండా ఉండడం చేత యుద్ధానికి దారి తీసిన పరిస్థితులలో ధర్మరాజు యుద్ధం చేయడానికి సిద్దమయ్యాడు.

మహా భారతంలో ధర్మరాజు గురించి

ధర్మరాజు పాలన అంటే, ధుర్యోధనుడి రాజ్యంలో ఉన్న ప్రజలకు కూడా ఇష్టం. ధుర్యోధనుడు ధర్మరాజుని శత్రువుగా భావించాడు కానీ ధర్మరాజు ధుర్యోధనుడిని కూడా మిత్రుడుగానే భావిస్తాడు.

అనేక ధర్మసూక్ష్మములు తెలిసినా పెద్దలు దగ్గర వినయంగా ఉండడం ధర్మరాజుకే చెల్లింది. కర్ణుడే తన అన్న అని కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యేవరకు ధర్మరాజుకు తెలియదు. తెలిసి ఉంటే, మహా భారత యుద్ధమే ఉండదు. కానీ ధుర్యోధనుడు మాత్రం అలా కాదు, తన కన్నా పెద్దవాడు ధర్మరాజు అని తెలిసి కూడా, వంశాచారం వదిలి, తనకే పూర్తి రాజ్యం కావాలని కాంక్షించి కూర్చున్నాడు. అందుకే ధర్మరాజు గొప్పవాడు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి