రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి? రాజకీయాలలో మార్పులు అనివార్యం. ఎందుకంటే సమాజంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని అంటున్నారు. కానీ ఏళ్లతరబడి పరిష్కారం కాని విషయాలు అలాగే కొనసాగుతున్నాయని అంటారు. సమాజంలో మార్పును తీసుకురాగల రంగం రాజకీయ రంగం కనుక రాజకీయాలలో మార్పులు అవసరం అంటారు.
ఎటువంటి మార్పు రాజకీయాలలో అవసరం అని నీవు భావిస్తావు?
రాజకీయాలలో మార్పు మంచి పరిణామంగా భావించాలి. అలా భావించలేని భావజాలం రాజకీయాలలో పాతుకుపోయినప్పుడు, నేను ఖచ్చితంగా రాజకీయాలలో మార్పును కోరతాను.
ఎటువంటివారు రాజకీయాలలో కొనసాగరాదని నీవు బావిస్తావు? ఎప్పుడు రాజకీయాలలో మార్పు అనివార్యంగా భావిస్తావు?
ప్రధానంగా అవినీతిని అంతం చేయడంలో ప్రభుత్వాలు ఫలితం సాధించలేనప్పుడు, రాజకీయాలలో మార్పు అనివార్యం అని భావిస్తాను. ఇంకా అవినీతి మరకలు అంటిన నాయకులకు రాజకీయాలలో చోటు ఉండరాదు.
అభివృద్దిని సాధించకుండా కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే పనిచేసే నాయకులు రాజకీయాలలో అనర్హులు. ప్రగతివైపు పయనించని ప్రాంతంలో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తాయి కాబట్టి స్వార్ధ ప్రయోజనాల కోసమే రాజకీయాలలో ఉండేవారిని, రాజకీయాల నుండి దూరం చేయాలి.
ప్రజలకు చెందవలసిన ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగతం చేసే నాయకులను రాజకీయాల నుండి దూరం చేయాలి. ప్రజలకు చేరవలసిన సంక్షేమ పధకాలలో అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను రాజకీయాల నుండి దూరం చేయాలి.
ఎటువంటివారిని నీవు రాజకీయాలలో నాయకుడిగా ఎన్నుకుంటావు?
ప్రజాశ్రేయస్సు కోసం ఆలోచించేవారిని, రేపటి సామాజిక భవిష్యత్తు కోసం, తాత్కలిక ప్రయోజనాలను రక్షిస్తూ, ప్రజలలో అవగాహన కల్పిస్తూ, ప్రణాళిక రచన చేసి, సమాజాన్ని అభివృద్దివైపు నడిపించే నాయకత్వ లక్షణాలు గల నాయకుడికి ప్రజలు పట్టం కడతారు.
సంస్థలున బలోపేతం చేసి, సంస్థల ద్వారా సంపదను సృష్టించి, సమాజాన్ని ప్రగతి బాట పట్టించే నాయకులకు రాజకీయాలలో మంచి భవిష్యత్తు ఉంటుంది.
పాత ఆలోచలనే అమలు చేస్తూ, కొత్త ఆలోచనలకు ఆస్కారం ఇవ్వని నాయకత్వం వలన సమాజం అభివృద్ది చెందలేదు కనుక సామాజిక పరిస్థితులకనుగుణంగా కాలంలో వచ్చే మార్పులను పరిశీలిస్తూ, రేపటి గురించి ఆలోచించగలిగే నాయకులకు రాజకీయాలో ప్రజలు పెద్దపీఠ వేస్తారు.
అన్ని కులాల వారిని సమభావంతో ఆదరించగలిగే నాయకులకే రాజకీయాలలో భవిష్యత్తు.
మతసామరస్యం లేని నాయకులకు రాజకీయాలలో చోటు ఉండదు.
సమాజాన్ని అభివృద్దివైపు నడిపించడంలో వచ్చే సమస్యలకు పరిష్కారం కనుగొంటూ, సమాజంలో శాంతి భద్రతలు, వ్యవస్థల పనితీరు చక్కగా ఉండే పరిపాలన రావాలని అటువంటి మార్పు రాజకీయాలలో కావాలని అందరూ ఆశిస్తారు.
ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?
0 responses to “రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి?”