By | August 3, 2024
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? మహాభారతంలో ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించేవారిలో అర్జునుడు కూడా ఒకడు. అలా అందరిలో ఒక్కడిగా కాకుండా, అందరి దృష్టిని దాటి గురువు దృష్టిలో పడ్డాడు. కేవలం సాధన చేయడం, నేర్చుకోవాలనే తపన కనబరచడం, గురువు అంటే వినయంతో ఉండడం… శ్రద్దతో వినడం, ఏకాగ్రతతో సాధన చేయడం…. అర్జునుడిని మంచి విద్యార్ధిగా నిలబెట్టాయి. అందుకే విద్యను అభ్యసించడంలో అర్జునుడు ఆదర్శం అంటారు.

ద్రోణాచార్యులు ఒక చెట్టుపై ఉన్న పక్షిని చూడమని కౌరవ, పాండవులకు చెబుతాడు. అందరూ చెట్టు కొమ్మలు, ఆకులు, పక్షి అంటూ…. ఒక్కొక్క సమాధానం చెబితే, అర్జునుడు మాత్రం తన లక్ష్యమైన పక్షి కన్ను మాత్రమే కనబడుతుందని ద్రోణుడితో చెబుతారు. అలా చెప్పడమే కాదు, బాణం వదిలి పక్షి కన్నునే కొట్టి, తన గురి ఏమిటో అందరికీ తెలియజేస్తాడు. అలా విద్యను అభ్యసించడంలో అర్జునుడు చాలా ఏకాగ్రతతో ఉంటాడు.

ఇంకా అర్జునుడు అన్నం తింటున్నప్పుడు దీపం కొండెక్కుతుంది. అయినా చీకటిలో పళ్లెంలో అన్నం తినడం చేస్తూ, ఆలోచన చేస్తాడు. కంటికి కనబడకుండా ఉన్న ఆహారం చీకట్టో కూడా తినగలగుతున్నాను అంటే, చీకటిలో కూడా లక్ష్యం ఎందుకు చేధించకూడదు? అని.

అలా ఆలోచన చేసిన అర్జునుడు, చీకటిలో బాణం వేయడం సాధన చేస్తూ, చీకటిలోనే లక్ష్యం చేధిస్తాడు. సాధన చేయడం పట్టుదలను కనబరస్తూ అర్జునుడు విద్యార్ధిగా ఉత్తమైన స్థితికి చేరాడు.

కావునా విద్యను అభ్యసించడంలో అర్జునుడు ఆదర్శం.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి