By | August 4, 2024
వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి?

వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి? కొందరు పెట్టి పుట్టారు అంటారు. అటువంటివారు అనుభవించడమే జీవితం అన్నట్టుగా, వారి జీవితం సాగిపోతుంది. కానీ కొందరు తప్పించి, అందరం బ్రతకడం కోసం, ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. మన సమాజంలో మనకు ఒక గుర్తింపు వస్తుంది. చదువును బట్టి కొలువు, కొలువును బట్టి సంఘంలో హోదా…. ఇంకా ఆస్తిపాస్తులు, కుటుంబ ప్రస్థానం బట్టి సమాజంలో గుర్తింపు ఉంటుంది. పుట్టుకతోనో, అధికారంతోనో, ధనంతోనో వచ్చే గుర్తింపు, సమాజంలో లభించే గౌరవ, మర్యాదలు ఉంటుంటాయి. అయితే, అన్నింటికంటే, మనం మన స్వయంకృషితో సాధించుకున్న గుర్తింపు మాత్రం చాలా ఆనందాన్నిస్తుంది. అది జీవితాంతం సంతృప్తినిస్తుంది.

సినిమాలలో చిరంజీవి స్వయంకృషితో వృద్దిలోకి వచ్చారని అంటారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలలో ప్రవేశించడానికి, చిరంజీవి ఇమేజ్ ఉపయోగపడింది, కానీ పవన్ కళ్యాణ్ కృషి చేసి, సాధించిన గుర్తింపు మాత్రం వెరీ స్పెషల్… అలాగే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్… తదితరులు సహజంగానే వారికి లభించిన గుర్తింపుని మరింత పెంచుకోవడానికి, కృషి చేసి, విజయవంతం అయ్యారు.

కనుక కృషి ఉంటే, మనం ఉన్న స్థాయి నుండి మరింత మంచి స్థాయికి ఎదగవచ్చు. అలా కృషి చేసి, సాధించిన గుర్తింపు మాత్రం జీవితంలో గొప్ప తృప్తిని ఇస్తుంది. అటువంటి ప్రయత్నం చేయడం పురుష ప్రయత్నంగా చెబుతారు.

వ్యక్తి జీవితంలో సాధించవలసినది ఏమిటి?

తన స్వశక్తితో తాను ఇష్టపడి, కష్టపడి పనిచేసి, ఇతరులకు సాయం చేస్తూ, తాను జీవితంలో ఎదుగుతూ, తను నమ్ముకున్నవారి నమ్మకం వమ్ము చేయకుండా, కృషి చేస్తూ కనీసం తన కుటుంబ సభ్యులకు తాను ఆదర్శప్రాయంగా నిలబడడమే వ్యక్తి జీవితంలో సాధించవలసిన విషయంగా చెబుతూ ఉంటారు.

వ్యక్తి తన శక్తి ఏమిటో తనకే తెలియకపోవడం వలన ఆ వ్యక్తి శక్తి నిరర్ధకం అవుతుంది. అందువలన ప్రయోజనం ఏముంటుంది? కావునా వ్యక్తి తన శక్తి ఏమిటో తాను గుర్తెరగాలి.

తనకున్న శక్తి సామర్ద్యములతో పని చేస్తూ, తనపై ఆధారపడినవారి అవసరాలను కూడా తాను తీరుస్తూ, తన కర్తవ్యం తను నిర్వహించడం ఒక యజ్ఙం వంటిదని అంటారు. ఇంకా తాను చేసిన కృషి వలన ఇతరులు కూడా అతనిని అనుసరించే మార్గం ఏర్పడగలదు.

కుటుంబ సంప్రదాయం, సమాజంలో తండ్రికి గల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా, తన ప్రతిభా పాటవాలతో తన నివసిస్తున్న సమాజంలో గుర్తింపు పొందడానికి వ్యక్తి కృషి చేయాలని అంటారు.

చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ తేజ్ చిరుత సినిమాతో చిరంజీవి అభిమానులకు పరిచయం అయితే, తర్వాత రామ్ చరణ్ నటన, మరియు అతని ప్రతిభతో, అందరి అభిమానాన్ని పొందారు. దేశవ్యాప్తంగా గుర్తింపు గల నటులలో ఒకరిగా మారారు. అలా తండ్రికి ఉన్న గుర్తింపు, తన కృషితో మరింత పెంచుకోవడానికి వ్యక్తి కృషి చేయాలని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి