సన్మాన పత్రం ఇన్ తెలుగు
సన్మాన పత్రం ఇన్ తెలుగు

సన్మాన పత్రం ఇన్ తెలుగు

సన్మాన పత్రం ఇన్ తెలుగు. పదవీ విరమణ సమయంలో లభించే సన్మాన పత్రం వ్యక్తి జీవితంలో అత్యంత గౌరవమైన పత్రం. ఒక రంగంలో ఒక వ్యక్తి తన కర్తవ్య నిర్వహణలో అంకిత భావంతో చేసిన పనికి, అభించే గౌరవ పత్రం. ఈ పత్రంలో అతని పనితీరు, అతను సాధించని విజయాలు, పాటించిన ప్రమాణాలకు గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యక్తికి సన్మాన పత్రం వ్రాయడానికి…

ప్రభుత్వ / ప్రవేటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్న నేపధ్యంలో సన్మాన పత్రం ఇన్ తెలుగు

శ్రీశ్రీశ్రీ ఉద్యోగిని ఈయనగా చెబుతూ…. మన ఆఫీసులో అత్యంత ప్రభావంతమైన పనితీరు కనబరిచిన వారిలో ముఖ్యలు ఈయన. ఈయన చేసిన కృషి వలన ఈయనకు మాత్రమే కాకుండా మన ఆఫీసుకు కూడా ప్రజలలో మంచి పేరు వచ్చింది. ఇంకా పై అధికారుల వద్ద కూడా మన ఆఫీసు గురించి సదభిప్రాయం ఉందంటే, కేవలం అది ఈయన కృషి మాత్రమే. మనకు, మన యజమాన్యానికి మద్య ఈయన వారధిలాగా పనిచేశారు. పట్టుదలతో విశేష కృషి చేసిన ఈయన ఈ రోజు పదవీ విరమణ చేయడం గొప్ప విషయం కానీ అదే సమయంలో ఈయన మనకు దూరం కావడం మనస్సుకు బాధగా ఉంటుంది. ఆపదలో అన్నలాగా, కష్టంలో తండ్రిలాగా మనయందు ఈయన చూపిన దయ మరువలేనిది.

సవాళ్లను ఎదుర్కోవడంలో ఈయన చూపిన పట్టుదల, మనందరికీ ఆదర్శం. మనం చూశాం ఈమద్యన జరిగిన కొన్ని సంఘటనల్లో మనమంతా ఎంత ఆందోళనకు గురి అయ్యామో? ఆ సమయంలో ఈయన చూపిన తెగువ ప్రశంసనీయం.

నిరంతరం కొత్త విషయం నేర్చుకోవడంలో కూడా ఈయన కొత్తవారితో పోటీపడడం అద్భుతమైన విషయం. మారిన పరిస్థితులకు అనుగుణంగా విధాన నిర్ణయాలను తీసుకోవడం, వాటి విషయంలో యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించడం, ప్రజలలో వాటిపై అవగాహన తీసుకురావడం… ఈయన కృషి చాలా విశేషమైనది.

ఈయను ఈరోజు పదవీ విరమణ చేయడం, మనం అందులో భాగస్వాములం కావడం చాలా ఆనందదాయకం.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు