సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం ఏవిధంగా ఉంటుంది? ఇది ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉండడం వలన పిల్లలపై కూడా ప్రభావం చూపగలదు. కావునా సినిమాల్లో అశ్లీలతను తొలగించాలి.
ఎందుకంటే, సినిమాలు ప్రత్యేకంగా చూడరు. అందరూ కలిసి చూస్తారు. ఇంకా కుటుంబసమేతంగా సినిమాలు చూస్తారు. కనుక సినిమాలు నిర్మించేవారు తమ సినిమాల్లో అశ్లీలత లేకుండా చూడాలి.
ఆకట్టుకోవడానికి అర్ధరహితంగా హీరోయిన్ అంగాంగములను శృంగారంగా చూపించడం వలన సినిమాకు కలెక్షన్లు రావచ్చును కానీ అది సమాజంలో చెడు ప్రభావానికి దారితీస్తుంది. కావునా ఈ విషయంలో సినిమాలలో అశ్లీలత లేకుండా చూడాలి.
యువత పెడద్రోవ పట్టకుండా ఉండడానికి ఇటువంటి ప్రదర్శనలు గల చిత్రాలు ఉండరాదు.
ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?
0 responses to “సినిమాల్లో అశ్లీలం సమాజంపై ప్రభావం”