అశక్తత meaning అంటే అర్ధం? వ్యక్తికి ఉద్దేశిస్తే, అశక్తుడు, అశక్తురాలు అంటారు. అంటి శక్తి లేనవాడు… శక్తిలేనిది అని భావిస్తారు. అశక్తత అంటే శక్తి లేకుండుట. ఏమి చేయలేని స్థితిని అశక్తతగా భావిస్తారు. ఈ అశక్తత పదానికి మీనింగ్ వచ్చే ఇంగ్లీషు పదాలు అయితే inability, incapacity, disability… వంటి పదాలు వస్తాయి.
నేను ఆ సమయంలో అశక్తుడుగా ఉన్నాను…’ అంటూ జరిగిపోయినా కాలంలో తాను చేయవలసిన పనిని చేయకపోవడానికి కారణం చెబుతూ… అలా మాట్లాడుతూ ఉంటారు.
వ్యక్తికి నిజంగా శక్తి లేకపోవడం సూచిస్తూ మాట్లాడితే అతను అశక్తుడు అంటారు. అలా ఆడువారికి అయితే అశక్తురాలు అంటారు. కానీ శక్తి ఉండి, ఏమి చేయలేని స్థితిని అశక్తత అంటారు. అంటే అధికారం ఉండి, అధికారి నిర్ణయం తీసుకోలేకపోవడం. బలం ఉండి, బలవంతుడు బలాన్ని ఉపయోగించలేకపోవడం… పరిస్థితుల ప్రతికూలంగా ఉన్నప్పుడు శక్తి ఉండి కూడా ఉపయోగించకుండా మిన్నకుండడాన్ని అశక్తతగా చెబుతారు.