పద్దెనిమిది నెలల్లో పదిలక్షల ఉద్యోగాలు

పద్దెనిమిది నెలలో పదిలక్షల ఉద్యోగాలు అంటూ వార్తా సమాచారం ఉంది. ప్రచారంలో ఉన్న ఈ సమాచారంలో ఏడాదిన్నర కాలంలో పదిలక్షల ఉద్యోగాల నియామాకాలు జరగాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీగారి ఆదేశాలు. ఈ సమాచారం యువతకు సంతోషకరమైన సమాచారమే. ఎందుకంటే పదిలక్షల అర్హులైన యువతికి ఉద్యోగాలు రాబోయే పద్దెనిమి నెలల్లో పొందే అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా వేచి ఉంటున్న యువతకు ఉద్యోగావకాశాలు రాబోతున్నాయి.

పద్దెనిమిది నెలల్లో పదిలక్షల ఉద్యోగాలు నియామాకాలు జరగాలని

దాదాపుగా పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని మోదీ ఆదేశించారు. ఇంకా పనిని పూర్తి చేయడానికి పద్దెనిమిది నెలల గడువు విధించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో గల వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలలో మానవ వనరుల పరిస్థితిని సమీక్షించి, వచ్చే 18 నెలల్లోనే 10లక్షల ఉద్యోగాల నియామకాలు జరగాలని మోదీ నిర్దేశించినట్టు కేంద్ర ప్రభుత్వం కార్యాలయం ట్విట్టర్ ట్వీట్ ద్వారా ప్రకటించింది.

నిరుద్యోగం దేశం ఎదుర్కొంటున్న సమస్యలలో పెద్ద సమస్య అయితే, ఈ ప్రక్రియ పూర్తయితే, కొంతవరకు నిరుద్యోగులకు ఉపశమనం కలుగుతుంది.

రెండేళ్ళకు పూర్వమే గ్రూప్ – A, గ్రూప్ – B, గ్రూప్ – C విభాగాలలో దాదాపు 9 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. మరి ఈ రెండేళ్ళ పదవీ విరమణలు జరిగాయి. అవి కూడా ఖాళీనే కాబట్టి… ప్రభుత్వం ప్రకటించిన ప్రకటన అమలు అయితే, పదిలక్షల ఉద్యోగాల నియామకం పూర్తవుతుంది.

ప్రకటనల వలన యువతలో ఆశలు పెరుగుతాయి. అవి అమలు అయితే పది లక్షల మందికి ఉపాధి లభించినట్టవుతుంది. వారిపై ఆధారపడినవారికి కూడా మేలు జరుగుతుంది. వారి ద్వారా చదువులు చదువుకునేవారికి కూడా మేలు. కాబట్టి మోదీ గారి ఈ నిర్ణయం సక్రమంగా అమలు కావాలి… ఆశిద్దాం.

మద్య తరగతి జీవితాలలో ప్రభుత్వ ఉద్యోగం పెద్ద ఆధారం. అటువంటి ఆధారపడదగిన ఉద్యోగాలు అర్హులైనవారికి లభిస్తే, అది సంతోషకరం.

మరి కొన్ని తెలుగురీడ్స్ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

తెలుగురీడ్స్

10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *