బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే, మనకు బాగా దగ్గరగా ఉన్నవారు ఎవరో తెలిసిపోతుంది. సాదారణంగా ఉన్నప్పుడు మన మనసు మన మాట వింటుంది. కానీ బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మాత్రం మన మాట పట్టించుకోదు. మనలాగా ఆలోచించేవారు లేదా మన అంతరంగం గురించి బాగా తెలిసినవారి మాట వింటుంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఎప్పుడూ సంతోషంగా ఉండే మనసుకు ఒక్కసారిగా ఎక్కువ ఒత్తిడితో ఉన్నప్పుడు మనసు మాత్రం మనమాట వినదు. ఎంత వద్దూ అనుకున్నా ఆలోచనలతో అంతరంగం అధిక ఆలోచనల తాకిడికి గురవుతుంది. అంతరంగంలో ఉండే మనసు వివిధ భావనలకు గురి అవుతూ ఉంటుంది. అనుభవం పెరిగే కొలది, తననితాను నియంత్రించుకుంటూ, మనకు సహకారిగా బాగా పనిచేస్తుంది. కానీ ఒక్కొక్కసారి అనుకోని సంఘటనల వలన కావచ్చును. అనుకోని వ్యక్తుల మాటల ప్రభావం కావచ్చును. ఊహించని ఎదురుదెబ్బల వలన కానీ మనసు ఒత్తిడికి గురైతే మాత్రం అది అశాంతిగా మారుతూ అంతరంగంలో ఓ అలజడినే సృష్టిస్తుంది. ఇక ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట ఉండదు.

మనసు మనకు ఒక బలం. దానికి ఉన్న అనుభవం మనకు అత్యంత శక్తివంతమైన బలం. అటువంటి బలమైన మనసుకుండే అలవాట్లు, ఎప్పుడైనా అనుకోని పరిస్థితులలో మనసు సంఘర్షణకు గురైతే మాత్రం మన అంతరంగం అయోమయ్యంగా మారుతుంది. అలాంటి సమయాలలో మన మనసు మరలా కుదురుకోవాడానికి అయినవారి ఓదార్పు మాటలు మన మనసుని ఒత్తిడి నుండి దూరం చేయగలిగితే, అది స్వస్థతకు చేరుతుంది. కొందరు ఒంటరిగానే ఆలోచిస్తూ, ఒత్తిడి నుండి బయటపడే ప్రయత్నం చేయగలిగితే, కొందరికి తోటివారి సహకారంతో ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉంటుంది.

సమస్యల తాకిడికి ఏర్పడే ఒత్తిడి

అయినా కొందరు ఒకచోట కూర్చుని, కళ్ళుమూసి, బయటి విషయాలకు దూరంగా మనసుని తీసుకువెళ్ళి, ఏదో ఒక చోట ఏకాగ్రతతో నిలిపి, కాసేపు ఒత్తిడికి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా అప్పటి ఆలోచనల నుండి మనసును మళ్ళించడం కూడా, మన మనసుని మనం నియంత్రించుకోవడం వంటిదే. ఈ ప్రయత్నం విజయవంతం అయితే, సమస్యల తాకిడికి ఏర్పడే ఒత్తిడిని దూరం చేసుకోవడం సులభమే అంటారు.

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో
బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

కానీ ఒత్తిడికి గురైన మనసు అంత త్వరగా ఆలోచనల నుండి బయటపడకపోవచ్చును. కాబట్టి కొందరు ఏదో పుస్తకం చదువుతూ లేదా ఏదైనా సినిమా చూస్తూ తమ తమ సొంత ప్రయత్నాల ద్వారా ఒత్తిడి నుండి దూరం అయ్యే ఆలోచన చేస్తారు. అప్పుడు పుస్తక పఠనం, సినిమా వీక్షణం కూడా మనపై ప్రభావం చూపుతాయి.

ఒత్తిడికి లోనైన మనసు త్వరగా ఒత్తిడి నుండి బయటపడడానికి, మనసుకు బాగా దగ్గరైనవారి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తారు. దీని వలన త్వరగా ఒత్తిడిని దూరం చేయగలం అంటారు. ఇలా ఒక వ్యక్తిలో ఏర్పడిన ఒత్తిడిని, ఆ వ్యక్తి నుండి దూరం చేసే బంధం ప్రతివారికి ఉంటుంది. వారిలో అమ్మ ఉండవచ్చును. నాన్న ఉండవచ్చును. భార్య ఉండవచ్చును. అన్నాతమ్ముడు, అక్కా చెల్లెలు ఉండవచ్చును. ఇంకా మంచి మిత్రుడు కావచ్చును. లేదా ప్రియురాలు / ప్రియుడు కావచ్చును.

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే, ఒత్తిడి తగ్గుతుందో? వారు మన మనసుకు బాగా దగ్గరయినట్టు!

మన బాధ ఎవరితో చెప్పుకుంటే, మన మనసు స్వస్థతకు చేరుతుందో, వారు మన మనసుపై ప్రభావం చూపుతున్నట్టు. మన మనసుపై మంచి ప్రభావం చూపే వారిలో సహజంగానే మొదట తల్లిదండ్రులు ఉంటారు. అయితే ఒక వయస్సు పెరిగే కొలది, తల్లిదండ్రులతో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం తగ్గవచ్చును. అప్పుడు కొన్ని విషయాలు అమ్మానాన్నతో చర్చించలేకపోవచ్చును. అలాంటి సమయంలో అన్నింటిలోనూ మన మనసుతో మమేకం అయ్యేవారిలో మొదటగా జీవిత భాగస్వామి ఉండవచ్చును. భార్య / భర్తతో అన్ని పంచుకోవడం, మనకు అలవాటుగా మారిపోతుంది. రెండు శరీరాలే కానీ వారి మనసు ఒక్కటిగా ప్రవర్తిస్తుంది.

అంటే మన జీవితంలో ఎవరితో అయితే ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఉంటామో? వారే మనకు ఒత్తిడి పెరిగినప్పుడు మన మనసుపై త్వరగా ప్రభావం చూపగలరు. అలా ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో పంచుకునే అవకాశం ఉన్నప్పుడు… ఎలాంటి స్థితిలోనైనా మన మనసుపై, వారు మంచి ప్రభావం చూపగలరు.

సమస్య వలన ఒత్తిడికి గురైతే, సమస్యకు పరిష్కారం లభించేవరకు

కొన్ని సార్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాగా ఒత్తిడికి గురైతే మాత్రం, ఆ సమస్యకు పరిష్కారమే మన మనసుని ఒత్తిడి నుండి బయటకు తీసుకురాగలదు. కానీ ఒత్తిడితో ఉన్న మనసుకు పరిష్కారం వెంటనే తట్టదు. అయినవారితో కాసేపు మాట్లాడితే, ఉపశమనం పొందిన మనసు మరలా సమస్యపై దృష్టిపెట్టి, పరిష్కార మార్గం కనుగొనగలదని అంటారు.

అంటే సమస్య వలన ఏర్పడిన ఒత్తిడిని కాసేపు దూరం చేసుకోవడానికి మనకు బంధాలు బాగా ఉపయోగపడతాయి. వారిలో అమ్మానాన్న, జీవితభాగస్వామి, మంచిమిత్రులు…. ఉండవచ్చును.

ఎవరి మీద మనకు బాగా ప్రేమ ఉంటుందో? వారి మాటలు వినడం వలన కాసేపు ఉపశమనం కలగవచ్చును.

మనకు ఎవరిపై అమితమైన గౌరవ మర్యాదలు ఉంటాయో? వారితో మాట్లాడినా మనసుకు భరోసా లభించగలదని అంటారు.

ఎవరి మాట వినని స్వభావి బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు

తమ స్వంత నిర్ణయంతోనే ముందుకు సాగేవారు ఉంటారు. వారు ఇతరుల సలహాను పాటించడం కన్నా, స్వీయ ఆలోచనలతోనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారిపై ప్రేమాభిమానాలు ఉంటాయి కానీ నిర్ణయాలు తమకు తామే తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అలా నిర్ణయాలు తీసుకునేవారు బాగా ఆలోచించే, నిర్ణయాలు తీసుకుని విజయవంతంగా ముందుక సాగుతారు. కానీ ఒక్కోసారి అనాలోచితంగా చేసే నిర్ణయాలు సమస్యకు కారణం కాగలవు. అలాంటివారు ఒత్తిడికి గురైతే మాత్రం తమకు తామే స్వయంగా అంతరంగంలో ఏకాగ్రతతో ఒత్తిడిని జయించాలి అంటారు. అంటే ఎవరి మాట వినని స్వభావి బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు, తమతో తామే మనసుని ఒక చోట కేంద్రీకరించడం ద్వారా కాసేపు మనసుకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేయడం అంటారు.

మనపై మనకు నియంత్రణ అంటే మన మనసుపై మన నియంత్రణ ఎంతవరకు ఉందో? అది ఎప్పుడైనా బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మనకు తెలియబడుతుందని అంటారు.

రోజూ కాసేపు మన మనసుతో మాట్లాడితే

ప్రతిదినం కాసేపు మన మనసుతో మాట్లాడి చూడండి… అంతరంగంలో అద్భుతమును మనం గమనించగలం అంటారు. కానీ ప్రతిదినం మనకుండే సమస్యల తాకిడితో, వాటి గురించిన ఆలోచనలకే మనం నిమిత్తులం అయి ఉంటాము.

కుటుంబ సభ్యుల అవసరాలు, తోటివారి సమస్యలు, మనలో ఉండే లక్ష్యాలు, మనకుండే బాధ్యతలు, మన చుట్టూ ఉండేవారి ప్రవర్తన… ఏదో ఒక బంధం రూపంలో ప్రత్యేక ప్రభావం ఎక్కువ ఆలోచింపజేయడం… ఇలా ఏదో ఒక విధంగా మన మనసు నిత్యం ఆలోచనలతో కూడి ఉంటుంది. కానీ నేనలా ఉన్నాను. నాలోఉండే మనసు ఎలా ప్రభావితం అవుతుంది. నాలో ఉండే మనసు నా చుట్టూ ఉండేవారి వలన ఏవిధంగా ప్రభావితం అవుతుంది. నా మనసు ఎలా ప్రవర్తించి, నా చుట్టూ ఎటువంటి వ్యక్తిత్వాన్ని కనబరుస్తుంది. ఇలా మన మనసుపై మనకు అవగాహన ఎంతవరకు? అంటే సమాధానం కొంచె కష్టతరమే. కానీ ప్రయత్నిస్తే, మనసుతో ప్రతి రోజూ కాసేపు మాట్లాడి చూస్తే, అది మనకు ఓ గొప్ప మిత్రుడు అంటారు.

మనపై ఉండే బాధ్యతలు కానీ మనలో ఉండే లక్ష్యాలు కానీ మన మనసుని మన నుండి ఆలోచనలకే పరిమితం చేస్తూ ఉంటే, ప్రతిదినం కాసేపు మనసుతో మాట్లాడే అవకాశం దేవుడెరుగు… అప్పుడప్పుడు ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంతంగా ఉంటే చాలు అనే భావన బలంగా ఉంటుంది.

మనసు బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ప్రయోజనం కూడా ఉండవచ్చు అంటారు.

ఎందుకంటే మనసుకు అంతగా అనుభవం లేని కొత్త విషయం ఎదురైనప్పుడే, అది లోపల పేర్కోని ఉండే ఆందోళన వలన మరింతగా ఆలోచనల తాకిడి అధికం అయి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతివారికి ఏదో ఒక అంశంలో కానీ ఏదో ఒక వ్యక్తితో కానీ ఏదో ఒక అలవాటు విషయంలో కానీ కొంత ఆందోళన అంతర్గతంగా ఏర్పడుతూ ఉండవచ్చును. అటువంటి ఆందోళనకు తగ్గట్టుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడే మనసు ఒత్తిడి గురికావడం జరుగుతుంది.

అయితే మనసు బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ప్రయోజనం ఏమిటి? అంటే మన మనసుకు ఒక కొత్త అనుభవం ఎదురౌతుంది. ఒత్తిడిని జయించగానే మన మనసు మరలా అలాంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం తక్కువ. ఇంకా మన మనసులో ఉండే ఆందోళన తేలిపోతుంది. మన ఆందోళనకు మూల కారణం తెలిసి, అది దూరం అయ్యే అవకాశం ఎక్కువ. మనసు ఒత్తిడికి గురయిందంటే, దానికొక కొత్త అనుభవం ఏర్పడుతుంది. ఆ అనుభవం నేర్పిన పాఠం వలన మనసు ముందు జాగ్రత్తతో భవిష్యత్తులో ప్రవర్తించే అవకాశం ఉంటుంది.

ఒత్తిడికి లోనయిన మనసుకు అందుకు కారణం అయిన వ్యక్తుల స్వభావం ఏమిటో? వారి ప్రవర్తన ఎలా ఉంటుందో? తదితర అంశాలలో అవగాహన ఏర్పడుతుంది. అయితే ముందుగా మన మనసులో నుండి ఒత్తిడిని దూరం చేయాలి. కర్తవ్యంపై దృష్టిసారించాలి.

మన మనసు బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు వివిధ విషయాలతో మమేకం కావడం.

అంటే ఒక మంచి మ్యూజిక్ వినడం.

ఓ హాస్యపు సినిమా వీక్షించడం లేదా హాస్యపు కార్యక్రమములు చూడడం.

మంచి పుస్తకం చదవడం

తదితర పద్దతులు మేలు చేస్తే, మత్తుపానీయలకు చేరువకావడం మనకు మనమే చేటు చేసుకోవడం అవుతుంది.

మనసుకు బాగా అలవాటు అయిన విషయం

ఒక్క విషయం గమనిస్తే, మన మనసుకు బాగా అలవాటు అయిన విషయంలో, దాని ప్రవర్తన ఎప్పుడూ ఒకే విధంగా ఉండడం గమనార్హం. ఎలాంటి పరిస్థితులలోనూ బాగా అలవాటు ఉన్న విషయంలో మనసు ఒకే ఫలితాన్ని రాబట్టగలదు. అంటే దానికి ఏదో అంతర్లీనంగా ఏర్పడిన తెలియని భావన ఏదో, దానికనుగుణంగా ఏర్పడే సమస్య వలన అది పరిష్కారం గోచరించక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. బాగా తెలిసిన విషయంలో, నాకు తెలుసు అనే భరోసాతో మనసు ఎలాంటి స్థితిలోనూ బాగా పనిచేయగలుగుతుంది. అంటే ఒత్తిడికి మూలకారణం తెలిస్తే, మనసుకు మనసే బలం అవుతుంది. సమస్య దూరం అవుతుంది.

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో ఏర్పడే ఏ ప్రత్యేక భావన

అవును బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియదు. ఇంకా సమస్యను మరింత జఠిలం చేసుకుంటూ ఉంటాము. కానీ ఒక్క విషయం గమనిస్తే, మనకు మాత్రమే బాగా సంతోషం కలిగినప్పుడు, మన మనసు బాగా ఆనందంగా ఉంటుంది. ప్రశాంతతో ఉంటుంది. అలాగే బాగా దు:ఖం కలిగినప్పుడు కూడా మనసు బాధపడుతుంది. మరలా ఉపశమనం పొంది, తిరిగి స్వస్థతకు చేరుతుంది. అయితే మనకు మాత్రమే ప్రత్యేకంగా జరిగిందనే భావన మాత్రం మనసుపై ఒత్తిడిని పెంచుతుంది. మనకు మాత్రమే ఇలా అనే ప్రత్యేక భావం లేనప్పుడు మనసు త్వరగా స్వస్థతకు చేరే అవకాశం ఎక్కువ అంటారు.

వందమందిలో మనకు ఒక ప్రత్యేక గుర్తింపు వస్తే, వందమందిలో నేను గొప్ప అనే భావన బలపడవచ్చును. అలాగే వేలమందిలో మనకు ఒక ప్రత్యేక గుర్తింపు వస్తే, ప్రత్యేకంగా మనసులో భావన సంతోషంతో నిండిపోతుంది. అలాగే మనసు బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు కూడా నాకు మాత్రమే ఇలా జరుగుతుందనే భావనే మన మనసుపై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనకు మాత్రమే ఇలా? అనే ప్రత్యేక భావన బాధకరమైన విషయాలలో వెంటనే మనసులోంచి తొలగించాలని అంటారు.

సమాజంలో అనేకమంది బాగా ఒత్తిడికి గురికావడం జరుగుతుంది.

నిత్యజీవనం ఎప్పుడూ ఒకేవిధంగా కొనసాగదు. సుఖదు:ఖాలు ఉన్నట్టే, అధిక ఒత్తిడి కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మన మనసుపై ప్రత్యేకమైన ప్రభావం చూపించే వ్యక్తులు పరిచయం అవుతారు. అలా ఆయా సంఘటనల లేక ఆయా వ్యక్తుల ద్వారా ఒత్తిడికి గురికావడం వలన, వివిధ కొత్త విషయాలు తెలియబడతాయి. అయితే ముందుగా ఒత్తిడికి గురిచేసే, ప్రత్యేక భావన మన మనసులో బలపడకుండా జాగ్రత్తపడాలి.

వేలమంది బాగా ఒత్తిడితో ఉంటారా? అంటే అవుననే సమాధానం కొన్ని గణాంకాలు పరిశీలిస్తే, తెలియబడుతుంది. ఇందుకు ప్రత్యేకించి పరిశోధన చేయనవసరం లేదు. కేవలం యూట్యూబ్ వీడియోలలో స్ట్రెస్ అవుట్ వీడియోలు ఎంతమంది వీక్షించారో గమనిస్తే చాలు. ఎంతమంది స్ట్రెస్ అవుట్ వీడియోలు చూసి ఉంటే, అంతమంది స్ట్రెస్ కు గురయినట్టే కదా? ఒత్తిడికి దూరంగా అనే వీడియో ఓ కోటిమంది చూసి ఉంటే, కోటిమంది బాగా ఒత్తిడికి గురికావడం జరిగిందని భావించవచ్చును కదా…?

అలాంటప్పుడు మనకు మాత్రమే ఏదో ప్రత్యేకంగా జరిగిపోతుందనే ఆందోళనను మనసులో పెరగనివ్వకూడదు.

అధిక ఒత్తిడికి గురికావడానికి మరొక కారణం

ఈ విషయంలో ఏమో ఎలా ఉంటుందో? ఆ విషయంలో ఏమో ఎలా జరుగుతుందో? భయంగా ఉందనే ఆందోళనాత్మక ఆలోచనలు మనసులో పెరగడం వలన కూడా ఆయా సంఘటనలు జరిగినప్పుడు మనసు ఒత్తిడికి గురికావడం జరగవచ్చని అంటారు.

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మనకు బాగా సహకరించే వ్యక్తులు మనకు మేలు చేయగలరు. ఇంకా మంచి మ్యూజిక్ వినడం. యోగసాధన, ఏకాగ్రతతో ఒక విషయంపై దృష్టిని నిలపడం. తదితర చర్యలతో ఒత్తిడిని అప్పటికీ దూరం చేసుకుని మనసు స్వస్థతకు చేరిన తర్వాత ఒత్తిడికి కారణమైన అంశాలపై దృష్టిసారించాలని సూచిస్తారు.

అతి విశ్వాసం అపనమ్మకానికి దారితీయడం వలన కూడా ఒత్తిడికి గురికావడానికి కారణం కాగలదు.

మనకు అనుభవ పూర్వకంగా తెలిసే విషయ పరిజ్ఙానం మనలో ఒకింత గర్వానికి దారితీయవచ్చును. గర్వం కలిగినప్పుడు అతిశయం కలుగుతుంది. మనలో అతివిశ్వాసానికి కారణం కాగలదు. అతి సర్వత్రావర్జయేత్ అన్నారు. అంటే అతి ఎక్కడా పనికిరాదు. ముఖ్యంగా అంతర్లీనంగా అతి అసలు పనికిరాదని అంటారు. అలాంటి అతిశయం మనసులో ఏర్పడితే, ఏ విషయంలో అయితే అతి ఏర్పడుతుందో అదే విషయంలో ఎదురుదెబ్బ తగిలినప్పుడు మనసు తీవ్రఒత్తిడికి గురికావడం జరగవచ్చును. అలా అతి విశ్వాసం మనలో అపనమ్మకంగా మారే అవకాశం ఉంటుంది.

అధిక ఒత్తిడికి గురికావడం వలననే వ్యసనాలకు ఆస్కారం ఉంటుంది.

అవును ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వలన, ఏదో ఒక పానీయం స్వీకరించడం లేదా ఏదో కార్యక్రమం అతిగా చూడడం జరగవచ్చును. అదే అలవాటుగా మారి తిరిగి కోలుకోలేని వ్యసనంగా కూడా మారవచ్చును. ఇంకా వ్యసనం వలన సమస్యకు పరిష్కారం కొనుగొనడం మాని సమస్యకు బయపడడం జరగవచ్చును. తద్వారా తనపై తనకు నమ్మకం కోల్పోయే అవకాశం కూడా ఉండవచ్చని అంటారు.

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అలాగే మనసుని మనసుతోనే నియంత్రించాలి కానీ దానికి కొత్త విషయం పరిచయం చేస్తే, ఆ విషయంతో అది మమేకం అయితే మనసు గతితప్పుతుందని అంటారు. కావునా ముందుగా బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మన మంచి మిత్రుడితో మాట్లాడేయడం, ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకునే ప్రయత్నం చేయడం. మిత్రునితో మాట్లాడిన దూరంకానీ ఒత్తిడి మనసులో ఉంటే, అతి చేరువుగా ఉండే జీవిత భాగస్వామితో పంచుకోవడం. ఒత్తిడి భారం తగ్గించుకోవడం. అయినా తగ్గని ఒత్తిడి ఉంటే, ఖచ్చితంగా మన మనసుతో మనమే పోరాటం చేయాలి. మనసుని అలవాట్ల వైపు వెళ్ళకుండా స్వీయ సాధన చేత దానిని నియంత్రించాలని అంటారు.

ముఖ్యంగా సహజంగా ఏర్పడిన వస్తు విషయాలతో మనసుని నియంత్రించడానికి చూడాలి. అంటే సాయం వేళల్లో ప్రశాంతమైన ప్రకృతితో మమేకం కావడం. దేవాలయంలో దైవ సన్నిధిలో గడపడం. పండితుల మనోవిజ్ఙానపు మాటలు ఆలకించడం. పురాణేతిహాసలలో నీతి కధలు చదవడం. ఇలా మనసు దృష్టిపెట్టాలనే తలంపు మనసులో పుట్టాలి కానీ మనసు మనకు ఓ మంచి మిత్రుడు కాగలడు.

మన మనసు మనకొక మిత్రుడి వలె ఉండాలి.

ఎక్కువగా ఒత్తిడితో ఉంటున్నామంటే, మనసులో ఏదో ఆందోళన చాలాకాలం నుండి ఉంటుందనే విషయం గమనించాలి. కుటుంబంలో తండ్రి ముందు మాట్లాడడానికే భయపడే కొడుకు వలె మన మనసు మనతో ఉంటే, అది విపత్కర స్థితిలో ఇబ్బందికరం. అలా కాకుండా తండ్రితో కొంచె చొరక ఉన్న మిత్రుడి మాదిరిగా మాట్లాడే కొడుకు వలె మన మనసు మనతో మాట్లాడుతుంటే, అదే అద్భుతం అంటారు. అది పరిష్కారం సాధించగలదని అంటారు.

తెలుగురీడ్స్.కామ్

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్

మనసుకు నచ్చే మంచి మాటలు

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

దైనందిన జీవితంలో ఆన్ లైన్లో సృష్టించబడిన బ్లాగుల ద్వారా

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

వివిధ విద్యావిషయాలు తెలుగు వ్యాసాలు

నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్