By | June 15, 2022
కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం

తక్కువ వయస్సు ఉన్నవారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందించే కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం గురించి ఈ తెలుగు సమాచార విషయాలలో తెలుగురీడ్స్ పోస్టు.

ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తాం. ఇన్సూరెన్స్ ఉంది కదా అని మిగిలిన వాటి గురించి ఆలోచన చేయకపోవచ్చును. ఇన్సూరెన్స్ మనపై ఆధారపడినవారికి బెనిఫిట్ చేస్తే, వృద్ధాప్యంలో మనకు బెనిఫిట్ చేసే పధకం ఉంటే, అది వృద్ధాప్యంలో అక్కరకు వస్తుంది. అదే…

ప్రభుత్వ ఉద్యోగులకు పెన్సన్ వస్తుంది. ప్రవేటు ఉద్యోగులకు పిఎఫ్ ఉంటే, వారికి పెన్సన్ పధకం ఉంటుంది. అటువంటి అవకాశం లేని ఇతరులకు పెన్సన్ వచ్చే అవకాశం ఉందా? అంటే అందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్సన్ పధకం.

అలాంటి ఒక పధకం కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకంలో ఎవరు చేరవచ్చును?

  • వయస్సు పరిమితి: 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు.
  • పైన చెప్పబడిన వయస్సుగల వారు విద్యార్ధులు కూడా ఈ పెన్సన్ పధకంలో చేరవచ్చును.

ఎవరికి అర్హత లేదు?

40 సంవత్సరాల వయస్సు దాటినవారు ఈ పెన్సన్ పధకంలో చేరడానికి అనర్హులు.

ఈ పధకంలో నెలవారీ చెల్లించవలసిన మొత్తము ఎంత? లభించే పెన్సన్ ఎంత?

తక్కువ వయస్సువారికి అటల్ పెన్షన్ యోజన పథకం ప్రీమియం ఎంత?

18 ఏళ్ళ వయస్సు వ్యక్తి నెల నెలా 42 రూపాయిలు చెల్లిస్తే, 60 ఏళ్ళ తర్వాత అతనికి 1000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. అదే వయస్సు గల వ్యక్తి నెలకు 84 రూపాయిలు చెల్లిస్తే, 60 ఏళ్ళ తర్వాత అతనికి 2000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ నెలకు 126 రూపాయిలు చెల్లిస్తే, 60 ఏళ్ళ తర్వాత అతనికి 3000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. ఇంకా ఎక్కువగా నెలకు 168 రూపాయిలు చెల్లిస్తే, 60 ఏళ్ళ తర్వాత అతనికి 4000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. చివరగా నెలకు 210 రూపాయిలు చెల్లిస్తే, 60 ఏళ్ళ తర్వాత అతనికి 5000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది.

ఎక్కువ వయస్సువారికి కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం నెలవారీ చెల్లింపు

40 ఏళ్ళ వయస్సు గల వ్యక్తి నెలకు 291 రూపాయిల చొప్పున చెల్లిస్తే, 60 ఏళ్ళ అనంతరం అతనికి 1000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. అదే వయస్సు గల వ్యక్తి నెలకు 582 రూపాయిలు చొప్పున చెల్లిస్తే, 60 ఏళ్ళ అనంతరం అతనికి 2000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ నెలకు 873 రూపాయిలు చొప్పున చెల్లిస్తే, 60 ఏళ్ళ అనంతరం అతనికి 3000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. ఇంకా ఎక్కువగా నెలకు 1164 రూపాయిలు చొప్పున చెల్లిస్తే, 60 ఏళ్ళ అనంతరం అతనికి 4000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది. చివరగా నెలకు 1454 రూపాయిలు చొప్పున చెల్లిస్తే, 60 ఏళ్ళ అనంతరం అతనికి 5000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది.

కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం వలన ఏ వయస్సు వారికి ఎక్కువ ప్రయోజనం?

ఒక వ్యక్తి వయస్సుని బట్టి, నెలవారీ చెల్లించవలసిన చెల్లింపు ఉంటుంది. 18ఏళ్ళ వయస్సుగలవారు కనిష్ట చెల్లింపులలో 42, 84, 126, 168, 210 ఈ ధరలలో ఎంపిక చేసుకుని చెల్లించవలసి ఉంటుంది. వయస్సు 25 ఏళ్ళు ఉంటే, 76, 151, 226, 301, 376 ధరలలో ఒక దానిని ఎంపిక చేసుకుని చెల్లింపులు పూర్తిచేసిన దానిని అనుసరించి, చేస్తే 60ఏళ్ళ అనంతరం అతనికి ఈ నెల నెలా 76 చెల్లింపు పూర్తి చేసి ఉంటే 1000/-, 151 చెల్లింపు పూర్తి చేసి ఉంటే 2000/-, 226 చెల్లింపు పూర్తి చేసి ఉంటే 3000/-, 301 చెల్లింపు పూర్తి చేసి ఉంటే 4000/-, 376 చెల్లింపు పూర్తి చేసి ఉంటే 5000/- పెన్సన్ లభిస్తుంది.

అలా వయస్సు ఎక్కువ ఉన్న కొలది నెలవారీ చెల్లింపు ఎక్కువగా ఉంటుంది. తక్కువ వయస్సు ఉన్నవారు ఎక్కువ సంవత్సరాలలో తక్కువ చెల్లింపు చేస్తారు. ఎక్కువ వయస్సు ఉన్నవారు తక్కువ సంవత్సరాలో ఎక్కువ చెల్లింపులు చేస్తారు. నెలకు 1000 రూపాయిల పెన్సన్ ఎంచుకున్నవారికి 18 ఏళ్ళ వయస్సు అయితే అతను 42 సంవత్సరములలో నెలకు 42 రూపాయిల చొప్పున 504 నెలలకు 21,168 రూపాయిలు చెల్లిస్తారు. అనంతరం అతనికి నెలకు 1000 రూపాయిల పెన్సన్ లభిస్తుంది.

అదే 40ఏళ్ళ వయస్సు గల వ్యక్తి నెలకు 1000 రూపాయిల పెన్సన్ ఎంచుకుంటే, అతను నెలకు 291 రూపాయిల చొప్పున 504 నెలలకు 69840 రూపాయిలు చెల్లిస్తే, 60ఏళ్ళ అనంతరం అతనికి నెలకు 1000రూపాయిల పెన్సన్ లభిస్తుంది.

కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన పథకం చేరినవారికి మార్పులు అవసరం అయితే

తక్కువ చెల్లింపు పధకంలో చేరి, తర్వాత ఎక్కువ చెల్లింపు పధకానికి మార్పులు చేసుకోవచ్చును. అలాగే ఎక్కువ చెల్లింపు పధకంలో చేరినా, తరువాత తక్కువ చెల్లింపు పధకంలోకి మార్పు చేయించుకునే అవకాశం ఉంది.

ప్రభుత్వ గుర్తింపు కలిగిన బ్యాంకు ఖాతా కలిగి ఉంటే, ఆ బ్యాంకు ఖాతా నుండి నెల నెలా ఈ పెన్సన్ పధకానికి చెల్లింపు జరిగే విధంగా చూసుకోవచ్చును. ఇంకా పోస్టాఫీసు ద్వారా కూడా ఈ పధకంలో చేరవచ్చును.

పెన్సన్ పధకంలో చేరిన వ్యక్తి మరణిస్తే, చెల్లింపులు పూర్తయ్యాక మరణిస్తే, ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి పెన్సన్ వస్తుంది. ఆ వ్యక్తి కూడా లేకపోతే, నామినీగా చేర్చబడిన వ్యక్తికి చెల్లిస్తారు.

పధకంలో చెల్లింపులు పూర్తి కాకుండానే పెన్సన్ పధకం గల వ్యక్తి మరణిస్తే, అ వ్యక్తి జీవిత భాగస్వామి ఈ పెన్సన్ పధకం చెల్లింపులు చేయవచ్చును. పూర్తయ్యాక పెన్సన్ పొందవచ్చును.

మధ్యలోనే పధకం నుండి నిష్క్రమిస్తే, కేవలం చెల్లించిన చెల్లింపుల మొత్తం నుండి నిర్వహణ చార్జీలు, వర్తించే చార్జీలు తగ్గించి, మిగిలిన మొత్తమును చెల్లిస్తారు.

సకాలంలో చెల్లింపులు చేయకపోతే, ఫెనాల్టీ కూడా ఉంటుంది.

సెంట్రల్ గవరన్నమెంట్ పెన్సన్ ప్లాన్

ధన్యవాదాలు

మరి కొన్ని తెలుగురీడ్స్ పోస్టులు

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

తెలుగురీడ్స్

10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి