నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం, నిరసన వ్యతిరేక పదాలు, నిరసన వ్యక్తం అంటే నిరసన తెలుపుట.
ఒక అధికారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేదా ఆక్షేపిస్తూ తగు కారణమును చూపుతూ వ్యతిరేక భావనను వ్యక్తం చేయుటను నిరసనగా ప్రకటిస్తూ ఉంటారు. ఈ నిరసన కార్యక్రమములో మన సమాజంలో ఎక్కువగా రాజకీయ వాతావరణంలో చూస్తూ ఉంటాము. ఇంకా ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగుల ద్వారా కూడా అప్పుడప్పుడు నిరసన కార్యక్రమములు జరుపుతూ ఉంటారు. ఇంకా సమాజంలో ఏదైనా దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అర్ధం అయ్యేలా ప్రజలంతా ఏకమయ్యి నిరసనలు తెలియజేస్తూ ఉంటారు. దిశ అనే కేసులో ప్రజలంతా ఏకధాటిపై నిరసనలు తెలియజేస్తూ సంఘీభాం ప్రకటించారు.
అలాగే అవినీతి గురించి అన్నాహాజరేకు మద్దతుగా కూడా నిరసనలు జరిగాయి. అలా సంఘంలో జరిగిన దారుణాలు లేదా అవాంఛనీయమైన నిర్ణయాలు ప్రకటించినప్పుడు ప్రజల నుండి కానీ పార్టీ కార్యకర్తల నుండి కానీ సదరు సంస్థ కార్మికుల నుండి కానీ వ్యతిరేకిస్తూ భావ ప్రకటనను తెలియజేయడాన్ని నిరసన అంటారు.
నిరసన పదానికి పర్యాయ పదాలు
తిరస్కారం ప్రధాన పర్యాయ పదంగా వాడుతూ ఉంటారు. ఈ పదాన్నే ఇంకా తిరస్కృతి, తిరస్కరించుట, తిరస్కరించు అను పదాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక తిరస్కారమునే వ్యతిరేకించుట అని కూడా అంటారు. ఇంకా ధిక్కారము అంటారు. ఈ పదాన్నే ధిక్కరించుట అంటారు. నిరసనలో అయితే ధిక్కార ధోరణి కొనసాగింపు అంటారు. ధిక్కార స్వరము అని కూడా నిరసనలో వాడుతూ ఉంటారు. నిరాకరణ మొదలైన పదాలు పర్యాయ పదాలుగా చెబుతారు. ప్రధానం తిరస్కృతి, తిరస్కారము, ధిక్కారము, వ్యతిరేకించుట, నిరాకరణ, నిరాకరించుట….
నిరస పదానికి వ్యతిరేక పదాలు స్వీకరించుట, స్వీకారము, సంఘీభావము, అంగీకరించుట….