ఉదాసీనత అనగా ఏమిటి నిర్వచనం

కొన్ని తెలుగు పదాలు సాదారణంగానే ఉంటాయి కానీ భావన బలంగానే ఉంటుంది. ప్రతి పదము ఒక లోతైన విశ్లేషణ క ఉండవచ్చును. పదము యొక్క అర్ధము గ్రహించి ఉండడం వలన భాషపై పట్టు పెరుగుతుంది. భాషపై పట్టుచేత భాషతో భావప్రకటన సులభం. భావ ప్రకటనం వలన అనేక అభిప్రాయములు వెల్లడి… అవుతాయి. వెల్లడి అయ్యే అభిప్రాయం బట్టి, ఫలితం ఉంటుంది. తెలుగు పదాలు వాటి అర్ధాలు ఇక ఉదాసీనత అనగా ఏమిటి నిర్వచనం.

పదమును నిర్వచనం అంటే మన వాడుక భాషలో పట్టించుకోకుండా ఉండడం. ఏదైనా ఒక విషయంపై పట్టింపు భావన లేకుండా ఉండడం. లేదా ఏదైనా ఒక విషయాన్ని దాటవేస్తూ, దానిపై దృష్టిసారించకుండా ఉండడం. అంటే ఒక విషయంలో కానీ ఒక వ్యవహారంలో కానీ ఒక వ్యక్తితో కానీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది. ఆ మార్పు ఎలా ఉంటుంది… ఇక ఆ విషయంలో కానీ ఆ వ్యక్తితో కానీ అసలు ఆసక్తి లేనట్టుగా భావించి, పట్టింపుధోరణి లేకుండా ఉంటారు. ఇంకా చెప్పడమంటే ఒక విషయము యందు కానీ ఒక వ్యక్తి యందు కానీ అయిష్టపు భావన పెరిగితే, ఆ విషయముతో కానీ వ్యక్తి యందు కానీ ఎటువంటి భావనలు వ్యక్త చేయకుండా ఉండడం. ఆ విషయమును గురించి లేదా వ్యక్తిని గురించి ఆలోచనలు చేయకుండా కూడా తమ మనసును నియంత్రిస్తూ ఉండవచ్చును.

ఒక విషయము గురించి తెలిసి ఉండి, ఆ విషయమును పట్టించుకోకుండా దాటవేస్తూ, ఆ విషయముతో సంబంధం లేనట్టుగా వ్యవహరించడం ఉదాసీనతగా చెబుతారు.

ఒక వ్యక్తి ప్రవర్తనను గురించి ఇలా చెబుతూ ఉంటారు. ‘ఆ వ్యక్తి అతని విషయంలో చాలా ఉదాసీనతతో వ్యవహరించారు.’ ఇంకా ఆ సంఘటనపై ఆయన చాలా ఉదాసీనతతో ఉన్నారు.’ ఇలా సందర్భానుసారం పట్టింపుధోరణి లేకుండా వ్యక్తం చేసే ప్రవర్తనను ఉదాసీనతగా వ్యవహరిస్తారు.