తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి? సంఘర్షణ తెలుగు పదములో ఘర్షణ అంటే పోట్లాట, పోరు, కొట్లాడుట, విభేదించుట తదితర పదాలు పర్యాయ పదాలుగా చెబుతారు. అంటే ఘర్షణ ఒక తగాదాగా చెబుతారు.

అలాగే ఇద్దరూ లేదా అంతకుమించి ఎక్కువమంది మద్య వాడి వేడి చర్చ జరుగుతూ వారు పోట్లాడుకునే స్థితికి చేరినా, అలా పతాక స్థాయికి చేరిన సంఘటనను ఘర్షణపూరితమైన వాతావరణంగా చెబుతారు. ఇలా నలుగురి మద్యలో జరిగే చర్చ కూడా వివాదస్పదంగా మారే స్వభావల ప్రవర్తన కూడా ఘర్షణగా చెబుతూ ఉంటారు.

ఇలా బౌతికంగా కంటికి కనిపించే వివాదస్పద సంఘటనలు లేదా చర్చలను ఘర్షణ అంటే మరి సంఘర్షణ అంటే ఏమిటి?

తెలుగు శాస్త్రముననుసరించి… స అంటే సత్ అనగా సత్యం అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు సత్ + ఘర్షణ సంఘర్షణ అంటే, సత్ అందరిలోనూ ఉంటుంది. అందరిలోనూ అంటే, అందరి అంతరంగం వెనుక ఉండేది అంటారు. అంటే ఇలా ఆలోచిస్తే మనిషిలోపలే జరిగే ఘర్షణే సంఘర్షణ అవుతున్నట్టుగా అనిపిస్తుంది.

వ్యక్తిగతంగా లోపల మదనపడే విషయాలతో మనసు మనసుతో ఆలోచనకు ఆలోచనకు విభేదించే ఘర్షణపూరిత ఆలోచనలు మనసులో అలజడిని రేపితే అదొక సంఘర్షణ అవుతుంది.