చిత్తము అనే పదానికి తగిన అర్థం కన్నా చిత్తం అనే పదానికి వివరణ చూడడం మేలు. అమ్మ అనే పదానికి అర్ధం కన్నా అమ్మ యొక్క గొప్పతనమే చూస్తాం అలాగే చిత్తము గురించిన ఆలోచన మేలు.
మనిషి ఉండే మనసులో ఒక భాగమే చిత్తము అంటారు. జరుగుతున్న విషయాలను గుర్తు పెట్టుకోవడంలోనూ, గుర్తు తెచ్చుకోవడంలోనూ చిత్తము ప్రధాన పాత్ర పోషిస్తుందని అంటారు.
మనసున చిత్తము అంటే గుర్తు అనే భావన వస్తుంది.
వాస్తవం ఎప్పుడు చిత్తములోనే ఉంటే, అటువంటి వాస్తవాన్ని అంగీకరించి మాట్లాడటం చిత్తశుద్దితో మాట్లాడడం అవుతుంది.
అలాగే జరిగిన వాస్తవ సంఘటన దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం చిత్తశుద్దితో ప్రవర్తించడం అవుతుంది.
వాస్తవాలు వదిలి మాట్లాడడం, జరిగిన వాస్తవం వదిలి ప్రవర్తించడం చిత్తశుద్ది లేకపోవడంగా పరిగణిస్తారు.
మనసులో చిత్తము గుర్తుపెట్టుకునే ప్రక్రియ నిర్వహిస్తుంది. ఇంకా గుర్తు చేసే ప్రక్రియ కూడా చేస్తుంది. చిత్తశుద్దితో ప్రవర్తించేవారిని ధన్యజీవులుగా చెబుతారు.
చిత్తశుద్ది జీవిత లక్ష్యాన్ని దగ్గర చేస్తుందని అంటారు. పరమార్ధం పొందడంలో చిత్తశుద్ది కీలకం అవుతుందని పెద్దలు అంటారు.
చిత్తము అనే పదానికి తగిన అర్థం అంటే మనసులో జ్ణాపకాల నిల్వ… చూసిన సంఘటన కావచ్చు, విన్న విషయం కావచ్చు, చేసిన ఆలోచన కావచ్చు, ఏదైనా చిత్తములో నిక్షిప్తం అవుతూ ఉంటాయి. మరలా చిత్తము నుండే మనసులో మెదులుతూ ఉంటాయి.