తెలుగు భాష గొప్పతనం – తెలుగు ప్రత్యేకత

Telugu Bhasha Goppatanam – తెలుగు ప్రత్యేకత

మన మాతృభాష అయిన Telugu Bhasha Goppatanam గురించి కవులు, రచయితలు ఎన్నో సంవత్సరాల క్రితమే తమ రచనల ద్వారా మనకు తెలియజేశారు. తెలుగు సాహిత్యాన్ని చదివితే, తెలుగు భాష యొక్క మహత్తు మరియు మాతృభాష ప్రాముఖ్యత స్పష్టంగా అర్థమవుతుంది

తెలుగు ప్రత్యేకత, తెలుగుభాషలో చదువుకున్నవారికి, పరభాషలో చదువుకున్నవారికి భావాలలో వ్యత్యాసం ఉంటుందని అంటారు. అనాదిగా ఏనాటి నుండో ఉన్న గ్రంధాలు మన భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతాయి.

పద్యం, గద్యం ఏదైనా ఖచ్చితమైన భావాలను పదాలలో పలికించే సత్తా తెలుగులో ఉంటుంది అంటారు.

మాతృభాష ప్రాముఖ్యత ఏమిటి? Telugu Bhasha Goppatanam | తెలుగు ప్రత్యేకత

మన భావాలను సహజంగా వ్యక్తపరచగలిగేది ఒక్క మాతృభాషలోనే. ఎందుకంటే మనం పుట్టిన నాటి నుండి మాట్లాడడం నేర్చుకోవడం, హావభావాలు వ్యక్తీకరించడం అంటే మాతృభాషలోనే సాగుతుంది… కాబట్టి సహజంగా మాతృభాషలోనే మనిషి తన హావ భావాల ప్రకటన చేయగలడు… ఇంకా అటువంటి వాడుక తెలుగు భాషలో ఉన్న పదాలు మన మనసుకు దగ్గరగా ఉంటాయి. అందువల్ల మాతృభాష ప్రాముఖ్యత మన జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.

తెలుగు సాహిత్యం ప్రత్యేకత మన మాతృభాష ప్రాముఖ్యత ఎక్కువ. ఇప్పుడు తెలుగులో పుట్టి పెరిగినవారికి సాహిత్యంలో చదివిన పదాలు, రచయిత మనసులోని భావాన్ని త్వరగా పట్టుకోగలవు కావునా సాహిత్యంలో తెలుగు ప్రత్యేకత కలిగి ఉంటుంది. ముఖ్యంగా రచయిత హృదయం అర్ధం అయితే, రచనలో ఉన్న మర్మం తెలియబడుతుంది.

తెలుగు భాషలో:

  • పద్యాలు
  • కవితలు
  • గద్యములు
  • సామెతలు
  • సూక్తులు
  • పురాణాలు

ఇలా అనేక రకాల సాహిత్యం లభిస్తుంది. పదాలు చిన్నగా ఉన్నా వాటి భావాలు అర్ధం చేసుకోగలగడం మాతృభాషలోనే సులభం.

ముఖ్యంగా: తెలుగు ప్రత్యేకత

  • చిన్న పద్యాలలో పెద్ద భావం ఉంటుంది
  • ఒక లైన్ సామెతలో జీవిత సత్యం ఉంటుంది
  • సూక్తులు మన ఆలోచనలను మార్చగలవు

మన మాతృభాష దేశ భాషలలో గొప్పది, ఎన్నో కవితలు, శతకాలు, గాధలు, నవలలు మన తెలుగు సంస్కృతీకి అద్దం పడతాయి. పాతకాలం రోజులు కూడా కళ్ళకు కట్టినట్టు మనసులో ఊహాశక్తిని పెంచే శక్తి పుస్తకాలలో ఉంటుంది… అటువంటి ఊహ శక్తి ఇవ్వగల భాష.

తెలుగు పద్యాలు మరియు వాటి అర్ధం

తెలుగు పద్యాలలో తెలుగు ప్రత్యేకత:

  • తక్కువ పదాలతో ఎక్కువ భావం ఉంటుంది
  • దైవచింతన, తత్వచింతన, సామాజిక విషయాలు ఉంటాయి

చిన్న చిన్న వాక్యాలలోనే జీవిత పరమార్థం చెప్పగలగడం తెలుగు ప్రత్యేకత. నిజంగా కొన్ని వ్యాక్యాలు జీవిత సత్యమునే బోధిస్తాయి. కొందరి వ్యాఖ్యలు మనసులో నిలిచిపోతాయి… అవి మన మన మాతృభాష తెలుగు భాష ప్రత్యేకత.

తెలుగు భాషలో పుస్తకాలు చదవడం ఎందుకు ముఖ్యం?

పురాణాలు, ఇతిహాసాలు మన మాతృభాషలో చదివితేనే సులభంగా అర్థమవుతాయి. రచయితలు తమ రచనల ద్వారా పూర్వకాల సంప్రదాయాలను మనకు అందించారు. అవి అర్ధం కావడానికి మాతృభాష అయిన తెలుగుభాషలో రాయబడిన పుస్తకాలు మనకు విశేష జ్ఞానాన్ని అందిస్తాయి.

👉 అందువల్ల:
మన మాతృభాష తెలుగు భాషలో పుస్తకాలు చదవడం మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి చాలా అవసరం.

పురాణాలు, ఇతిహాసాలు మరియు Telugu Bhasha Goppatanam

రామాయణం, మహాభారతం, భాగవతం వంటి గ్రంథాలు తెలుగులో అందుబాటులో ఉండటం వల్ల:

  • పాత్రల స్వభావం అర్థమవుతుంది అదే తెలుగు ప్రత్యేకత
  • జీవిత విలువలు తెలుస్తాయి

ఇవి చదివితే Telugu Bhasha Goppatanam మరింత స్పష్టమవుతుంది.

తెలుగు భాష చరిత్ర

భాషా పండితుల ప్రకారం తెలుగు భాషకు సుమారు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది.
ఇది ద్రావిడ భాషలలో ఒకటి అని భావిస్తారు.

👉 కానీ ముఖ్యమైనది:
తెలుగు ఎప్పుడు పుట్టిందన్నది కాదు, అది అనాదిగా ఆచారంలో, సంప్రదాయంలో మనలో మన పూర్వికుల నుండి కలసి ప్రవహిస్తున్న అక్షర సంద్రం.
👉 మనం దానిని ఎలా అభివృద్ధి చేస్తున్నామన్నదే ముఖ్యం, ఆంగ్లం నేర్చుకోవడానికి ఒక ఆరునెలల సమయం పట్టవచ్చు, కానీ పూర్తీ తెలుగు భాషలో ప్రావిణ్యం రావాలంటే, దానికి కాలపరిమితి చెప్పలేరు.

ఎందుకు తెలుగు భాషను నేర్చుకోవాలి?

  • మన భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలం
  • మన సంస్కృతి అర్థమవుతుంది
  • మనోవిజ్ఞానం తెలుసుకోవచ్చు
  • తత్త్వం తెలియాలంటే, ముఖ్యంగా జీవిత పరమార్ధం తెలియడానికి పండితుల మాట లేక మంచి పుస్తకాల బాట.

తెలుగు భాషలో ఉన్న గ్రంథాలు మనసును మార్చగల శక్తి కలిగి ఉంటాయి.

తెలుగు భాష మన జీవితంలో పాత్ర

జీవితానికి మార్గదర్శకత్వం ఇవ్వగలిగినవి ఏమిటి:

  • తల్లిదండ్రులు
  • గురువులు
  • పుస్తకాలు

అమ్మతో ఆరంభం మన తెలుగు పదాలు పలకడం, నాన్నతో ఆరంభం అక్షరాభ్యాసం, తాతతో ఆరంభం తెలుగు కదల పరిచయం… అమ్మ ఉగ్గు పెడుతూ చెప్పిన తెలుగు కధలు, పుస్తకాలలో మరలా చదువుతుంటే? ఒక్కసారి ఊహ చేయండి.

గురువు చెప్పిన ఉపమానం, తర్వాత పుస్తకాలలో మనల్ని పలకరిస్తే? గురువుతో ఆరంభం చదువులో మెట్లు ఎక్కడం, పుస్తకాలతో ప్రారంభం జ్ఞానాన్వేషణ…

👉 ముఖ్యంగా తెలుగు పుస్తకాలు తెలుగు ప్రత్యేకతను చాటుతాయి:

సహజంగానే మంచి మిత్రుడు, మనసుకు ఆహ్లాదకరమైన మాటలతో దగ్గరవుతాడు. మంచి పుస్తకం కూడా మనకు మంచి నేస్తం వలె మన మనసుతో మన ఊహాలోకంలోకి వస్తుంది. మనకు మంచి మిత్రుల్లా మార్గనిర్దేశం చేస్తాయి. దార్శనికులు రాసిన పుస్తకాలలో సమాజం గతం ఉంటుంది, చదివినవారికి భవిష్యత్తు కనబడుతుంది… విషయ పరిజ్ఞానం కోసం తెలుగు భాషలో ఉన్న అనేక తెలుగు పుస్తకాలలో ఉంటుంది. తెలుసుకోవలసిన్ జ్ఞానం తెలుసుకోవడానికి తెలుగు భాష ప్రాముఖ్యత ఉంది. వ్యక్తిత్వ వికాసం, మనో విజ్ఞానం వంటి తాత్విక విషయాలు తెలుగు భాషలో గల పుస్తకాలు చదవడానికి తెలుగు భాషలో చదువు అవసరం.తెలుగు భాషను పట్టుకోవడం ముగింపు

అనేది కేవలం పదాల్లో కాదు, భావాల్లో ఉంది. కనుక భాషలో చదువుని ప్రోత్సహించాలి… భాషలో పట్టు సాధించాలి.
మాతృభాష అయిన తెలుగును నేర్చుకోవడం, తెలుగు సాహిత్యం చదవడం ద్వారా మన జీవితానికి మార్గదర్శకత్వం లభిస్తుంది.

👉 కాబట్టి:
మాతృభాషను ఇష్టపడదాం, తెలుగు భాషను ప్రేమిద్దాం, అభివృద్ధి చేద్దాం. అమ్మ భాష కాబట్టి తెలుగులో చదువుదాం…

తెలుగురీడ్స్ ఛానల్

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts