మేఘన మనసు మామూలు విషయం కాదు.

1970 లలో సామజిక స్థితిని భావన చెందుతూ, 1999 లలో కూడా కొందరు వ్యక్తులు ఉంటారు…. అలాగే 1990 లలో స్థితిని భావన చెందుతూ, 2020 లలో కూడా కొందరు పెద్దలు ఉంటారు. సంప్రదాయం కొనసాగాలంటే, పాతకాలం భావనలు బలంగా ఉన్నవారు, వర్తమానంలో వ్యవహరించాలి కదా!

మేఘన కళాశాల ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యాక, ఇంటికి చేరిన రోజు. ఆ రోజు మేఘన ఆటో దిగి, ఇంటిలోకి చూసి, ఆశ్చర్యపడింది… ఇంటి లోపల చాలా కోలాహలంగా  ఉంది.  ఇంట్లో ఓ ప్రత్యేకమైన హడావుడి కనిపిస్తుంది… మేఘన లోపలకు వచ్చింది…..

మేఘన తల్లి మాట్లాడుతూ : ఏమ్మా… ప్రయాణం బాగా జరిగిందా? లోపలకు వెళ్ళు అన్నది
“ఇంట్లో ఇలా పండుగ వాతావరణం లా ఉంది… ఏమైంది అమ్మా? ఏదైనా శుభవార్తా?” అంటూ తల్లిని ప్రశ్నించింది మేఘన…

తల్లి: (నవ్వుతూ….)
“నీకో మంచి శుభవార్తే మేఘూ… ఈ ఆదివారం పెళ్లి చూపులు ఉన్నాయ్. అబ్బాయి చెన్నైలో IT కంపెనీలో ఉద్యోగం. మంచివాళ్లు. మీ న్నాన్నగారు నీతో మాట్లాడతారు.” అనడంతో

మేఘన: (ఆశ్చర్యంతో, ఉలిక్కిపడి)
“పెళ్లి చూపులా? కానీ… ఇప్పుడే ఎందుకు అమ్మా…” అని అన్నది. మేఘన లోపలికి వెళ్ళింది… కాసేపటికి ఆమె తండ్రి మేఘన వద్దకు వచ్చాడు.

తండ్రి రమణరావు: (ఆమె చెంతకు వచ్చి, గంభీరంగా)
“చూడు తల్లీ, ఎప్పటికి నీవు, నాకు చిన్న పిల్లవే, కానీ సమాజానికి మాత్రం కాదు. దాని దృష్టి అడపిల్ల విషయంలో మాత్రం కఠినంగానే ఉంటుంది. అందుకే డబ్బు ఉన్నవానికి, లేనివానికి కూడా ఎదిగిన అడపిల్ల భారంగా మారుతుంది.  అయినా నీకు వయస్సు వచ్చింది, నిన్ను వదిలించుకోవాలని, నేను ఈ పెళ్లి సంభందం చూడలేదు. మీ మేనమామ మంచి సంభందం అని మాట్లాడడంతో, అంతేకాకుండా ఈ నిర్ణయం మంచి చేస్తుందని అనిపించింది. అందుకే ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను… నీవు ఒప్పుకుంటే, ఈ పెళ్లి చూపులు, ఆ తరువాత పెళ్లి మాటలు ఉంటాయి

…మిగిలిన విషయాలు మీ అమ్మతో మాట్లాడు….” అని అక్కడి నుండి రమణరావు నిష్క్రమించాడు.

మేఘన మనసు మామూలు విషయం కాదు.

మేఘన మనసులో తెలియని ఆందోళన మొదలైంది….
ఆ రాత్రి అమ్మతో మేఘన మాట్లాడుతూ: “అమ్మా…! ఇప్పుడు పెళ్లి ఏమిటి?” అని అన్నది… ఆమె తల్లి మేఘనతో “ఆడపిల్ల వయసులో ఉండగానే పెళ్లి చేసుకుంటే, ఆ కాపురం చాలా చక్కగా సాగుతుంది…. వయస్సు మీరుతున్న కొద్దీ, జీవితం చేజారిపోతుంది…” అనగానే మేఘన తన తల్లితో…

“అమ్మా…. నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, జీవితంలో చాలా సాధించాలి… అనుకుంటుంటే, నీవేమిటి, పెళ్ళే కాకపోతే జీవితం లేనట్టుగా మాట్లాడుతున్నావ్?” అంటున్న మేఘన మాటలకు, ఆమె తల్లి అడ్డుపడుతూ,

“చూడు, ఎవరు ఎంత గొప్ప చదువు చదివినా, జీవితంలో ఒకరి తోడూ తప్పదు.. జీవితంలో ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, వారి జీవితంలో, జీవిత భాగస్వామి లేకుండా ఉండరు. పెద్ద మనిషి అయ్యాకా, అక్షరాలు దిద్దడం సాధన చేస్తుంటే, ఎలా ఉంటుందో? యుక్త వయస్సు వచ్చాక, ఒంటరిగా ఉండాలా? జాయింట్ గా ఉండాలా? అని ఆలోచన చేయడం కూడా అంతే! కాబట్టి నీవు పెళ్లి చేసుకోవడం కరెక్టు, నీకు నచ్చినవాడిని చేసుకునే హక్కు నీకు ఉంది, సరైన వయస్సులో పెళ్లి చేసే బాద్యత మాపై ఉంది….

నీకున్నది ఒక్కటే అవకాశం నచ్చిన పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేసుకోవడం. ఇక పెళ్ళయ్యాక చదువుకుని సంసారం బాద్యతలు మోసేవారు కూడా ఉన్నారు… కాబట్టి అవకాశం ఉంటె, పెళ్లి అయ్యాక కూడా నీవు చదువుకోవచ్చు” అని అక్కడి నుండి వెళ్ళిపోయింది… మేఘన ఆశ్చర్యపడుతూ ఆలోచనలో పడింది.

చెన్నై నగరంలో మధ్య తరగతి అపార్ట్‌మెంట్‌. పెళ్లై వారం రోజులు అయింది. మేఘన మొదటి రోజు నుండే నవ్వలేకపోతుంది. బయటినుంచి చూస్తే “ఒక కొత్త జంట” — కానీ లోపల చూస్తే, ఇద్దరి మధ్య ఒక మౌనం, ఒక అంతరం.

ఆనంద్ రెడీ అయ్యి, ఆఫీసుకు బయలుదేరుతూ…. మేఘనతో…. “నేను ఆఫీసుకు వెళ్తున్నాను… నీకు నచ్చిన టిఫిన్ ఆర్డర్ చేసుకో, మధ్యాహ్నం కూడా…. నేను సాయంత్రం లేటుగా వస్తా… అప్పుడు కూడా… “ అంటూ ఆమెను చూసాడు… మేఘన వినినా, విన్నట్టుగా, విననట్టుగా ఉండడంతో, ఆ అర్ధం కానీ భావనను వదిలేసి, బయటకు దారి తీసాడు…

చెన్నైలో, మేఘన పెళ్లైన అపార్ట్‌మెంట్‌. వారం రోజులు నిశ్శబ్దంగా గడిచాయి. ఆ ఉదయం తలుపు దగ్గర ఓ నడక వినిపిస్తుంది. తలుపు తీయగానే — ఆమె తండ్రి రమణయ్య అక్కడ నిలబడి ఉన్నాడు.

మేఘన: (ఆశ్చర్యంతో)
“నాన్నగారు?! మీరు ఇక్కడ?” అన్నది.

తండ్రి రమణయ్య: (చెమటతుడుచుకుంటూ, గట్టిగా నవ్వేందుకు ప్రయత్నిస్తూ)
“ఈ ఊరికి కొంచెం పని ఉండి, చెన్నై వైపు వచ్చాను… అనుకోకుండా, ఇక నీ దగ్గరకు రావాలని అనిపించింది.”

మేఘన: (వేడిగా తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తూ)
“లోపల రండి నాన్నా…?” అంది

తండ్రి లోపకు వచ్చాక, కొద్దిసేపటి మౌనం తరువాత…

తండ్రి ఇలా అన్నాడు, తన కూతురితో.:
“నిజంగా చెప్పాలంటే… ఈ వారం రోజులు నిద్ర పట్టలేదు మేఘా. నీవు సంతోషంగా ఉన్నావా అని నా మనసు ప్రశాంతంగా లేదు. నిన్ను నీ కలలవైపు నడవకుండా ఆపిన తల్లీదండ్రి మేమే కదా…”

మేఘన: (కళ్ళలో తడి)
“ఏమి మాట్లాడకుండా” నిలబడి ఉంది.

తండ్రి మేఘనతో మాట్లాడుతూ:
“నీవు సంతోషంగా లేవని అర్ధం అవుతుంది… అయితే నీకు ఒక మాట చెబుతాను, అది చేసిన తరువాత కూడా నీ మనసు ఇలాగే ఉన్నది అంటే, నీకు నచ్చినట్టు ఉండడానికి, నేను అంగీకరిస్తాను….” అన్నాడు…

మేఘన తండ్రిని చూసింది, కానీ ఏమి మాట్లాడలేదు… మరల తండ్రి, మేఘనతో

ఇలా “చూడు, ఒక వస్తువుని వదిలిపెట్టేస్తున్నాము అంటే, ఆ వస్తువుని ఉపయోగించి, అది ఎందుకు పనికిరాదు, అని అనుకున్నప్పుడే, ఆ వస్తువుని మనం విడిచిపెట్టేస్తాము… లేకపోతె సమాజం మనల్ని పనికిమాలినివారముగా పరిగణిస్తుంది… కాబట్టి, ఒక్కసారి నీ భర్త అంటే, ఏమిటో తెలుసుకో, అతని వ్యక్తిత్వం తెలిసాక, ఆలోచించుకో…” అని అక్కడి నుండి బయలుదేరాడు..

ఎప్పటిలాగానే ఆనంద్ మరలా ఆఫీసుకు బయలుదేరుతూ, మేఘనతో చెబుతున్నారు “నేను ఈరోజు బయటకు వెళ్తున్నాను.. ఆఫీసుకు కాదు… వచ్చేటప్పటికి లేటు అవుతుంది…” అని ఆమెను చూసాడు… మేఘన ఆనంద్ కు ఒక బాక్స్ చూపిస్తూ, “ఏమిటి?” అని అడిగింది…. ఆనంద్ ఆమెతో “అది, నీకే, ఏమిటో చూసుకో…” అని చెప్పి బయటకు బయలుదేరాడు.

మేఘన ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసింది… అందులో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది.. దానిని బయటకు తీసి చూసింది.. “ఏమిటి? ఇప్పుడు దీనిని సెట్ అప్ చేసుకోవాలా?” అని అనుకుంటూ… స్మార్ట్ ఫోన్ స్విచ్ ఆన్ చేసింది… అయితే ఆ ఫోన్ స్మార్ట్ ఫోన్ కొత్తగా సెట్ అప్ అడగకుండా ఎదో పాత ఫోన్ ఆన్ అయినట్టుగా ఫోన్ స్టార్ట్ అయ్యింది. కాని కొత్త ఫోన్ అప్పటివరకు డైల్ యాప్ కూడా ఓపెన్ చేయలేదు… కాని సెట్ అప్ చేసిన ఫోన్ వలె ఉంది…

ఆ ఫోన్ పట్టుకుని చూసింది సామ్సంగ్ ఎస్ సిరీస్ స్మార్ట్ ఫోన్…. అని అర్ధం అయ్యింది… ఫోన్ బాగుంది అనుకుంది… సెల్ లో ఫైవ్ జి సిగ్నల్ రాగానే, వాట్సప్ మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి…. వాట్సప్ నోటిఫికేషన్లు మేఘనకు కనబడుతున్నాయి… అవి ఇలా ఉన్నాయి…

మేఘన మనసులో మొగుడు గురించి ఆలోచన

“ఒరేయ్… ఏంట్రా… ఈ మౌనం…. నీ ఫోన్ మోగదు, మెసేజ్ పోదు…. ఏడ ఉన్నావు….” అంటూ ఒకటి ఉంటె, మరొకటి “ఏరా… బాబు, ఏమయ్యింది… అంతా ఒకే నా?” అని ఉన్నది. ఇంకొక మెసేజ్ నోటిఫికేషన్ లో “పెళ్లయ్యందట, ఒరేయ్ ఎవరైనా పెళ్ళయ్యాక, ఫ్రెండ్స్ ని ప్రక్కన పెడతారు…. నువ్వేంట్రా పెళ్ళికి ముందే, మమ్మల్ని పట్టించుకోవడం మానేసావ్?” అని ఉన్నది…. ఇంకా వాట్సప్ నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి….

“ఫోన్ అనేది, మన ఫ్రెండ్స్ కు ఓ మెసేజ్ కానీ ఓ కాల్ కానీ చేయడానికి, మూసుకుని ప్రక్కన పెట్టుకోవడానికి కాదు…” అని మరొకటి… మేఘన కు అవి చదువుతుంటే, ఆశ్చర్యంగా అనిపిస్తూ, ఏమిటి ? ఏమయ్యింది? ఎందుకు ఈ ఫోన్ వాడడం మానేసినట్టు, మరి ఆనంద్ దగ్గర ఫోన్ ఏమిటి? అని ఆలోచన చేస్తుంది. ఇంతలో కాల్ వస్తుంది… కాంటాక్ట్ నేమ్ “అక్క కాలింగ్” అని వస్తుంది…. మేఘన్ కాల్ అటెంప్ట్ చేయలేదు.. ఫోన్ రింగ్ ఆగింది…

మేఘన వాట్సప్ చాట్ ఓపెన్ చేసింది… చాలా కాంటాక్ట్స్ నుండి చాలా చాట్ మెసేజ్ లు ఉన్నాయి… ఆమె వాట్సప్ చాట్స్ స్క్రోల్ చేస్తూ ఉంది…. అక్కడ ఒక కాంటాక్ట్ దగ్గరా ఆగింది… ఆ కాంటాక్ట్ నేమ్ “నీ మొగుడు” అని ఉంది… ఆమె ఆ చాట్ ఓపెన్ చేసింది…. అందులో ఓ వాయిస్ మెసేజ్ ఉంది… దానిని ఆమె నొక్కింది. ఆమె వింటుంది.

“ఈ వాయిస్ మెసేజ్ ఇలా చేయడానికి కారణం స్మార్ట్ ఫోన్ అయితే, అందుకు ప్రేరణ నా ఫ్రెండ్… అతను నాతో “నీవు ఎప్పుడూ ఫోన్ వాడుతున్నావు, నీవు ఒంటరిగా మారడానికి అదే కారణం అవుతుంది… పెళ్లి కావలసినవాడివి జాగ్రత్త” అనడంతో, నాకు వెంటనే కలిగిన ఆలోచనలు: స్మార్ట్ ఫోన్ తన పరిధి దాటి మరీ మనిషి మనసులో ప్రవేశించింది, ప్రవేశిస్తుంది కాబట్టి, స్మార్ట్ ఫోన్ వలన కొత్తగా భార్య భర్తలు మనసు పంచుకోవడం జరగకపోవచ్చు… ఎందుకంటే ఒకరితో ఒకరు మాట్లాడుకునే లోపు స్మార్ట్ ఫోన్ ఎదో ఒక విషయంలో ఎదో ఒక అంశంలో మనల్ని మమేకం చేస్తూ, సంసారంలో విసుగు పుట్టుకకు పురుడు పోస్తుంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేను అనేవారి సంఖ్య కూడా ఎక్కువే… నేను దీనికి బలి కాకూడదు… అనుకున్నాను… సంసారంలో చిచ్చు పెట్టె స్మార్ట్ ఫోన్, నేను నా సంసారంలో దూరం పెడదామని అనుకున్నాను. కానీ, ఒకవ్యక్తి గురించి తెలుసుకోవడానికి, అతని స్మార్ట్ ఫోన్ చుస్తే చాలు అంటారు… కాబట్టి, నా ఫోన్, నా కాబోయ్ భార్యకు చూపితే బాగుటుంది… కదా? నాలో మొదలైన ప్రశ్నకు సమాధానం: కొత్త స్మార్ట్ ఫోన్లో నా ఇమెయిల్ మరియు అదే ఫోన్ నంబర్ వేసి, ఆ ఫోన్ నా భార్యకు గిఫ్ట్ గా ఇస్తే, నన్ను నేను పరిచయం చేసుకున్నట్టే… చూద్దాం ఒక ప్రయత్నం చేసేద్దాం… అనుకుని ఇప్పటి నుండి నా ఈ పాత ఫోన్ స్విచ్ అఫ్ చేసేస్తాను… కొత్త కీ పాడ్ ఫోన్ కొని, కొత్త సిమ్ కొంటాను… నా ఫ్రెండ్స్ కు అప్పుడే చెప్పను… ఈ నెంబర్… నా భార్యతో నేను ఫ్రెండ్స్ కు పరిచయం అయ్యాక కొత్త నెంబర్ నా నెంబరు గా వారికీ ఇస్తాను.. అప్పటి దాక ఫ్రెండ్స్ కు బై, భార్యకు వెల్కం.”

ఆమెకు అర్ధం కాలేదు… ఆనంద్ గురించి ఆలోచిస్తుంది…. అలా ఎలా తానేమిటో? తన లోటు పాట్లు ఏమిటో? అంటూ తన గురించి ఆలోచించకుండా, ఎంతసేపు ఎదుటివారి తప్పులను ఎత్తి చూపుతూ, తనలోని తప్పును కప్పిపెట్టుకుని జీవించేవారు ఎక్కువగా  ఉన్న ఈ కాలంలో? తన గురించి పూర్తిగా తన జీవిత భాగస్వామికి తెలియజేయాలనుకోవడం ఆమెకు విచిత్రంగా అనిపించింది… డామినేషన్ కోసం ట్రై చేసే కాలంలో, ఇతడు ఏమిటి? ఇలా ఉన్నాడు? అని ఆలోచిస్తున్న మేఘన “ఒక్కసారిగా ఉలిక్కిపడింది?” ఎందుకంటే ఎవరో డైరెక్ట్ గా బెడ్ రూమ్లోకి వచ్చి, ఎదురుగా నిలబడ్డారు… ఆమె కంగారుగా పైకి లేచి, “ఎవరు నువ్వు?” అని గట్టిగా ప్రశ్నించింది…

అతను మేఘనతో “మేడం, భయపడకండి… నేను మిమ్మల్ని చాలా రోజుల నుండి చూస్తున్నాను… ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నారు. మీ భర్తతో మీరు కలసి ఉంటున్నారు, అంతేకానీ కాపురం చేయడం లేదు. ఇలా ఎన్నాళ్ళు?” అని అతను అంటూండగా, మేఘన తన చేతిలోకి ఒక ఐరన్ పైప్ తీసుకుని, దానిని అవలీలగా వంచుతూ, అతనితో ఇలా అంటుంది. “మనిషిగా పుట్టిన ప్రతివాడు, తన పుట్టుక గురించి ఆలోచించుకుంటే, తనేం చేయాలో? ఆలోచన ఉంటుంది…. అలా కానీవారే చేయకూడని పనులకు పూనుకుంటారు…” అంటూ ఆమె చేతిలో ఐరన్ పైప్ పూర్తిగా వంచి అతనికి చూపుతూ “ఇప్పుడు నీవలన దీని షేప్ మారింది, ఇక అడుగు ముందుకేస్తే, మారేది నీ జీవితం?” అని సీరియస్ గా అన్నది… అతను వెంటనే “ఏమిటి? నీ బలం చూపిస్తే, భయపడి వెళ్ళిపోతాను అనుకున్నావా? నీవు ఒప్పుకున్నా? ఒప్పుకోకపోయినా? “ అని అతను అంటూండగా అతని భుజంపై ఒక చేయిపడింది…. ఆ చేయి అతనిని వెనుకకు తిప్పింది…. వెనుకకు తిరిగిన అతనిని నలుగురు బయటకు తీసుకువెళ్లారు…. అక్కడికి వచ్చి ఆమెను రక్షించిన వాచ్ మెన్, “సారి మేడం, నేను ఇతను మీకు తెలుసు అనుకున్నాను… అందుకే లోపలి రానిచ్చాను, మీరు గట్టిగా మాట్లాడుతుంటే, ఇలా వచ్చాను..” అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

మేఘన మనసులో మంచి ఆలోచనలు మొగుడి గురించి

“సాయంకాలంలో ఒక అమ్మాయి చక్కగా బ్లూ కలర్ ఫ్లవర్స్ తో డిజైన్ చేయబడిన వైట్, ఫాబ్రిక్ సిల్క్ శారి కట్టుకుని, డబల్ బెడ్ కాట్ బెడ్ పై పడుకుని స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని, ఎదో ఆలోచిస్తూ ఉంది… ఆమె ముఖం మురిసిపోతుంది… తన గురించి ఆలోచించే తన భర్త కొరకు ఆమె చూపు ఎదురు చూస్తుంది”