నా గురువు గురించి నేను చెప్పగలగడం, అంటే అది మా గురువుగారి అనుగ్రహమే కారణం. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ రాయడానికి నా గురువు ప్రధమ కారణం. అక్షరాభ్యాసం దగ్గర నుండి నేను గురువుల దగ్గర విద్యను అభ్యసించాను. కానీ నాకు నేను సొంతంగా అలోచించి ఈ ఆర్టికల్ రాయగలుగుతున్నాను అంటే అది గురువుగారి అనుగ్రహం నాపై ఉండడమే… ఇలా మా గురువుగారు పిల్లలను చాలామందిని తీర్చిదిద్దారు అని మా స్కూల్ నందు ఇతర ఉపాధ్యాయులు చెబుతుంటే, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది..

అయన ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడని అందరూ అంటారు. గురువుగారు తరగతిలోకి ఎంతో ఆప్యాయంగా మాతో మాట్లాడతారు… ఇంకా ఇంటివద్ద మేము చేసిన హోం వర్క్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. పాఠాలు చెప్పేటప్పుడు చక్కగా మాకు అర్ధం అయ్యే వాడుక భాషలో చెబుతారు. అయన పాఠం చెబితే, అర్ధం కాకపోవడం ఉండదు. అంత చక్కగా పాఠాలు బోధిస్తారు..

ఎప్పుడు అయన విద్య లేనివాడు వింత పశువు అనే మాటను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు… ఆ మాటలలో అయన విద్య అంటే తెలుసుకోవడం… తెలుసుకున్నది సాధన చేయడం… నేర్చుకున్నది మరలా ఎదో ఒక రూపంలో తెలియజేయడం… ఇటువంటి సాధన లేనివారు వింత పశువుతో సమానమని అంటారు.

పాఠాలు చెప్పే సమయంలో ఎంత సరదాగా బోధిస్తారో? పెండింగ్స్ ఉంటే, అంతే కఠినంగా మారిపోతారు… అప్పుడు మాకు భయం కూడా వేస్తుంది.. అందుకే మేము పెండింగ్స్ ఉంచుకోము…

నా గురువు వలన మేము కూడా ప్రయోజకులుగా మారతమనే బలమైన నమ్మకం మా అందరిలోనూ ఉంది…

జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?

రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్

అంకణము అంటే అర్ధం ఏమిటి?

పునః పునః అంటే అర్ధం ఏమిటి?


కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు