వృక్షాలు మన మిత్రులు పది వ్యాక్యాలు వ్రాయండి. వృక్షాలు గురించి వ్రాయడానికి పది వ్యాక్యాలు సరిపోవు కానీ ప్రయత్నిస్తాను. అవి కేవలం మొక్కలు మాత్రమే కాదు అవి మన జీవితంలో భాగం. మనమే మన జీవితంలో మొబైల్ ఒక భాగంగా చేసుకుంటున్నాము… వాటివలన లాభ నష్టాలూ రెండూ ఉంటాయి… కానీ వృక్షాల వలన మనిషి ఉపయోగమే ఎక్కువ… అటువంటి వృక్షాలను మనిషి తన అవసరాల కోసం తొలగించడం భాధాకరం విషయం. వృక్షాలను ప్రకృతి మనిషి జీవితంలో ఒక భాగంగా చేస్తే, మనం వాటికీ హాని చేసే పరికరాలు వాడుతూ, వాటి నుండి పొందవలసిన ప్రయోజనం పొందలేక, ఇంకా రాబోయే తరాల కోసం వాతావరణం స్థితిని మార్చేస్తున్నాము… ఎందుకు ఇంతగా వృక్షాల గురించి చెప్పడం, అవి మనకు మిత్రులు అని చెప్పడం అంటే ఈ క్రింది వివరణ చదవండి.

వృక్షాలతో వ్యక్తి జీవితం ముడిపడి ఉంది. వాటితో మనిషి జీవించాడు.. వాటితో వ్యక్తి జీవిస్తున్నాడు. వాటితోనే వ్యక్తి, వ్యవస్థ, వ్యవసాయం, ఆహారం, ఆక్సిజన్ ఇలా వ్యక్తి అవసరాలు తీరాలంటే మొక్కలు మనుగడ మరింత అవసరం…

మనిషి ఆక్సిజన్ లేకపోతె బ్రతకలేడు, అటువంటి ఆక్సిజన్ చెట్లు మనకు అందిస్తాయి. మనం గాలి లేని ఒక గదిలో ఉన్నప్పుడు, అక్కడ ఆక్సిజన్ ఉన్నా, గాలి బయటకు వెళ్ళకపోతే, మన వదిలే కార్బన్ డై ఆక్సైడ్ వాయువు ఆ గదిలో పెరిగి ప్రాణాంతక స్థితికి వెళ్లిపోతాము… మన వదిలే వాయువు మనకు అంత ఇబ్బందిని సృష్టిస్తే, వృక్షాలు ఆ వాయువుని పీల్చుకుని, మనకు అవసరం అయిన ఆక్సిజన్ అందిస్తాయి… అంటే చెట్లు లేకపోతె మానవ మనుగడ ఉండదని అర్ధం అవుతుంది… అన్నం పెట్టిన అమ్మను ముసలి వయసులో వదిలేసినట్టుగా, టెక్నాలజీ వచ్చాక వృక్షాలపై శ్రద్దగా మనిషిగా బాగా తగ్గిపోయింది.

వాతావరణంలో కీలక పాత్ర పోషించే వృక్షాలు – మన మిత్రులు పది వ్యాక్యాలు.

వాతావరణ సమతుల్యతకు చెట్లు కారణం అవుతాయి. వాతావరణం చల్లగా ఉండడానికి వృక్షాలు ప్రధాన కారణం.

ఇంకా మనం తినే వివిధ ఆహార పదార్దాలు మనకు చెట్ల నుండి లభించేవి… అంటే చెట్లు మనిషి ఆకలిని కూడా తీరుస్తున్నాయి… మరి మొక్కలను మనం పెంచకపోవడం పాపమే అవుతుంది. మనకే కాదు పశువులకు కూడా అవి ఆహారంగా మారే మొక్కలు ఎన్నో ఉంటాయి.

మనిషికి సహజంగా వచ్చే ప్రశాంతతకు కారణం అయ్యే ప్రకృతి సౌందర్యంలో చెట్లు, మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు లేకుండా ఊహించలేము.

ఎండలో మనిషికి నీడనిచ్చే పెద్ద పెద్ద వృక్షాలు ఎన్నో ఉన్నాయి… ఇంకా ఇల్లు లేని నిరుపేదలు చెట్లనే నివాసంగా చేసుకుని బ్రతుకుతారు.

ఆధునిక పద్దతులలో మనకు లభించే మెడిసన్ కు కూడా ఔషద మొక్కలు మూలంగా ఉంటాయి… అంటే మన అనారోగ్యాన్ని తగ్గించుకోవడంలో కూడా మొక్కలు ఉపయోగపడతాయి.

వాతావరణంలో వేడి తాపం చెట్ల దగ్గర తగ్గుతుంది… చూడండి, ఊరిలో అనేక ఇళ్ళ మద్యలో ఉండే వాతావరణానికి, ఊరి పొలిమేరలో చెట్లు ఎక్కువగా ఉన్నచోట ఉండే వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంటుంది… ఇలా వృక్షాలు ప్రకృతిలో వ్యత్యాసాలను తగ్గించి, మానవ మనుగడకు సాయం చేస్తుంటాయి… అటువంటి వృక్షాలను మన పెద్దలు పూజించాలి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు…

వృక్షాలు లేకుండా వ్యక్తి, వ్యవస్థ రెండూ ఉండవు…