విజ్ఞాన శాస్త్రం – ఆధునిక యుగం (వ్యాసం) తెలుగురీడ్స్. విజ్ఞాన శాస్త్రం – ఆధునిక యుగం నేటి యుగంలో విజ్ఞాన శాస్త్రం లేకుండా మనవ మనుగడ అసాధ్యం కానీ దాని ప్రభావం రెండు రకాలుగా మనపై ఉంటుంది.

మానవ మనుగడలో విజ్ఞాన శాస్త్రం అనేది మానవ అభివృద్ధికి మూల స్తంభం. మనిషికి అవసరమైన విషయాలను మరింత సులబతరంగా మార్చుకోవడంలో మనిషికి విజ్ఞాన శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అది జ్ఞానాన్ని విశ్లేషించే విధానమే కాదు, జీవితాన్ని మారుస్తూ, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారింది. రాతి యుగం నుండి మనిషి ఈనాటికి ఎంతో అభివృద్ధి సాధించాడు. అందుకే ఆధునిక యుగాన్ని “విజ్ఞాన యుగం” అని కూడా పిలవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు ప్రతి రంగంలోనూ, విజ్ఞాన శాస్త్రం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆధునిక జీవితం మీద ప్రభావం

ఒకప్పుడు విషయం ప్రచారం పొందడానికి రోజులు తీసుకుంటే, ఇప్పుడు గంటలు వ్యవధి సరిపోతుంది. నిమిషాలలో సమాచారం ప్రపంచంలో చేరిపోతుంది…. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న మొబైల్స్, లాప్ టాప్స్, ఇంటర్నెట్‌, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఏ.ఐ. టెక్నాలజీలు అన్నీ విజ్ఞాన శాస్త్ర ఫలితంగా అభివృద్ధి చెందినవే. మనిషి ఉన్న చోట నుండే, అప్పటికప్పుడు ప్రాపంచిక విషయాలను పొందగలుగుతున్నాడు. మనిషి ఇంటి నుండే ప్రపంచంతో అనుసంధానం అవుతున్నాడు. ఇంటి నుండే వృత్తి పనులు నిర్వహించగలిగే స్థాయికి మనిషి జీవితం మార్పు వచ్చింది. రవాణా రంగంలోనూ, రైళ్లు, విమానాలు, విద్యుత్ వాహనాలు ఇలా ఎన్నో సౌకర్యాలు మనిషి జీవనాన్ని మరింత సులభతరం అవుతుంది…

వైద్య రంగంలో విప్లవం

వైద్య రంగంలో విజ్ఞాన శాస్త్రం చేసిన మార్పులు, మనిషికి వైద్యాన్ని మరింత చేరువ చేస్తుంది. శస్త్రచికిత్సల సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఆర్గన్లు, కృత్రిమ శ్వాస యంత్రాలు, రోబోటిక్ సర్జరీలు ఇవన్నీ మనిషి ఆరోగ్య రక్షణలో విప్లవాత్మక పాత్రను పోషిస్తున్నాయి. ప్రాణాంతక వ్యాధుల విషయంలో విజ్ఞాన శాస్త్రం ఎంతగానో మనిషికి సాయపడుతుంది. అందుకు ఉదాహరణ, కరోనా వంటి మహమ్మారులను ఎదుర్కోవడంలోనూ విజ్ఞాన పరిశోధనలే కీలకమయ్యాయి.

విద్య మరియు పరిశోధన

విద్య విషయంలో విజ్ఞాన శాస్త్రం ప్రభావం కనబడుతుంది. నేడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ డిజిటల్ విద్యను వినియోగించుకుంటున్నారు. డిజిటల్ క్లాసెస్, వర్చువల్ ల్యాబ్‌లు, విద్యార్ధులకు విజ్ఞానంతో కూడిన కొత్త మార్గాలను అందిస్తున్నాయి. పరిశోధనలు నిరంతరం కొత్త ఆవిష్కరణలకు దారి చూపుతున్నాయి. ఆసక్తి ఉండాలే కానీ ఆద్యాత్మిక విషయాల్లో, మనోజ్ఞానం విషయంలో, సామజిక విజ్ఞానంలో, వృతి విషయాల్లో మరింత జ్ఞానం పెంచుకునే అవకాశం ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది… వేగంగా విషయసేకరణ చేయగలం… గతంలో ఇంతటి వేగం, ఇన్ని సదుపాయాలు జ్ఞాన సముపార్జనకు అందుబాటులో లేవు…

సామాజిక మార్పులు

విజ్ఞాన శాస్త్రం ద్వారా సామాజిక స్పృహ పెరిగింది. సమాజంలో జరిగే వివిధ విషయాలు, సమాజంలో పెరుగుతున్న సమస్యలు, సమాజంలో ప్రాంతాలలో జరిగే కార్యకలాపాలలో విజ్ఞాన శాస్త్రం ప్రభావం పెరుగుతుంది…

ముగింపు

విజ్ఞాన శాస్త్రం లేకుండా నేటి మన జీవన ఊహించలేం. ఆధునిక జీవితంలో విజ్ఞాన శాస్త్రం ప్రభావం మరింత పెరుగుతుంది… కావునా దీనిలో అందరికి సరైన జ్ఞానం అవసరం. విజ్ఞాన శాస్త్రం మానవాళిపై మంచి చెడు ప్రభావాలను చూపుతుంది. ఎవరైతే మంచికి ఉపయోగించుకుంటారో? వారికి విజ్ఞాన శాస్త్రం వరం… చెడుకు ఉపయోగించుకునే వారి వలన వారితో పాటు, వారికి సంభందించిన వారికి కూడా నష్టమే… నైతిక విలువల లేని వారి చేతిలో విజ్ఞాన శాస్త్రం, పిచ్చోడి చేతిలో రాయి వంటిది.

జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?

రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్

అంకణము అంటే అర్ధం ఏమిటి?

పునః పునః అంటే అర్ధం ఏమిటి?


కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు