స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం. స్మార్ట్ ఫోను వాడుక సర్వ సాధారణం అయింది. అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోను ఉంటుంది. కారణం స్మార్ట్ ఫోను ఉపయోగించి సులభంగా కొన్ని పనులు చేయొచ్చు…
ఇతరులతో చూస్తూ మాట్లాడుట, మెసేజ్ చేయడం, ఫోటోలు వీడియోలు ఎడిట్ సోషల్ మీడియాలో పెట్టడం ఇలాంటివి వ్యక్తిగత అభిరుచులు బట్టి ఉంటాయి. డబ్బులు పంపించడం, కరెంట్ బిల్ పే చేయడం, లొకేషన్ షేర్ చేయడం వంటివి అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్ ద్వారా నిర్వహించవచ్చును. కాబట్టి స్మార్ట్ ఫోను నేడు అందరికీ అవసరమే.
అయితే స్మార్ట్ ఫోనలో వైరస్ ఉంటే ఎలా ?
ముందుగా మన స్మార్ట్ ఫోనులోకి వైరస్ వచ్చే అవకాశం ఎలా ఉంది ? గమనిస్తే….
తెలియని నెంబర్ నుండి ఆఫర్స్ అంటూ వచ్చే మెసేజులు క్లిక్ చేయడం ద్వారా స్మార్ట్ ఫోనులోకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది.
కొన్ని రకాల గేమ్స్ ఆడుతున్పప్పుడు మద్య మద్యలో వచ్చే యాడ్స్ రూపంలో కూడా వైరస్ లు ఉండవచ్చును.
ప్లేస్టోర్ కానీ ఐట్యూన్స్ బ్యాన్ చేసిన గేమ్స్ మరియు మొబైల్ యాప్స్ వాడుట వలన కూడా స్మార్ట్ ఫోనులో వైరస్ ప్రవేశించవచ్చును.
ఇంకా మీ బ్యాంక్ ఎక్కౌంట్ బ్లాక్ అయ్యిందంటూ వచ్చే సాదారణ మెసేజులలో ఉండే లింకులు క్లిక్ చేయడం ద్వారా కూడా స్మార్ట్ ఫోనులో వైరస్ ప్రవేశించవచ్చును. ఒక్కోసారి ఇలాంటి మెసేజులు క్లిక్ చేయడం వలన ఫోన్ హ్యాకింగ్ కు గురికావచ్చును అంటారు. ఈ విధంగా స్మార్ట్ ఫోనులో వైరస్ ప్రవేశించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతారు.
వైరస్ బారిన పడిన స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ త్వరగా డిస్చార్జ్ అవుతూ ఉంటుంది.
ర్యామ్ ఎక్కువగానే ఉన్నా ఫోన్ స్లో అవుతుంది.
సాదారణంగా స్మార్ట్ ఫోనులో ఎక్కువ యాప్స్ లేదా హెవీ గేమ్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ స్లో అవుతుంది. అంటే బ్యాక్ గ్రౌండులో యాప్ రన్నింగ్ అవ్వడం ఫోనుకు భారం. కాబట్టి ఫోన్ స్లో అవుతుంది. అయితే అటువంటి యాప్స్ మనం క్లోజ్ చేయగానే స్మార్ట్ ఫోన్ యధావిధిగా పనిచేస్తుంది. కానీ వైరస్ బారిన పడిన ఫోనులో వైరస్ ఎప్పుడూ బ్యాక్ గ్రౌండులో రన్నింగ్ అవుతూనే ఉంటుంది. కావునా ఫోన్ స్లో అవుతుంది అయితే ఎటువంటి యాప్ బ్యాక్ గ్రౌండులో రన్ అవుతున్నట్టుగా వైరస్ బారిన పడిన పోనులో కనబడదు.
బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో కూడా ఏవైనా డౌన్ లోడ్స్ పెట్టినప్పుడు కూడా ఏ ఫైల్స్ డౌన్ లోడ్ అవుతున్నాయో సరిచూసుకోవాలి.
స్మార్ట్ ఫోను వాడేటప్పుడు మనం ఏం టచ్ చేస్తున్నామో? ఎందుకు టచ్ చేస్తున్నామో? ఎటువంటి యాప్స్ వాడుతున్నామో? మన ఫోనులో ఉన్న యాప్స్ ఫోనులో ఎటువంటి పర్మిషన్స్ కలిగి ఉన్నాయో? సరైన అవగాహన ఏర్పరచుకోవాలి. తద్వారా పోనులో అనవసరంగా ఉండే యాప్స్ తొలగించవచ్చును.
ఇక వైరస్ బారిన పోన్ పడినట్టు అనుమానంగా ఉంటే, ఆ స్మార్ట్ ఫోన్ రీసెట్ చేయడమే ఉత్తమమని అంటారు.
అయితే స్మార్ట్ ఫోన్ రీసెట్ చేసే సమయంలో డేటా, ఫోన్ కాంటక్ట్స్ బ్యాకప్ తీసుకోవాలి.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం”