Jeevitamlo chaduvuku enta viluva? చదువు ఎందుకు అవసరం?

Jeevitamlo chaduvuku enta viluva? చదువు ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే. చదువుకోవడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి పని వచ్చినా, ఆ వృత్తి పనికి తగిన డిమాండ్ ఉంటేనే, ఆ వృత్తి పని ద్వారా వ్యక్తి జీవనం బాగుంటుంది. అదే వృత్తి పనితో బాటు తగిన చదువు కూడా ఉంటే, ఆ వ్యక్తి మెరుగైన అవకాశాలు లభిస్తాయి.

ప్రతివారి Jeevitamlo chaduvuku enta viluva ?

చదువు వల్ల కలిగే లాభాలు చాలా విస్తృతంగా ఉంటాయి. అది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు, మనిషి ఆలోచనా విధానం, సమాజంలో గౌరవం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, కొత్త అవకాశాలు పొందడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

సమాజం సహజంగా చదువుకున్న వ్యక్తికి మంచి గుర్తింపు ఇస్తుంది. చదువు వలన వ్యక్తి మాట్లాడే తీరు, సమస్యలను అర్థం చేసుకునే అవగాహన శక్తి, ఇతరులతో వ్యవహరించే శైలి ఉంటాయి. చదువు వలన మనిషికి జ్ఞానం ఒక్కటే కాదు, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

చేతిపని తెలిసినవారికి చదువు కూడా ఉండడం వలన ఆ పనిలో అతను మంచి ఫలితాలు పొందగలడు. ఇంకా తనకు తెలిసిన విద్యను మరింతమందికి మెరుగైన విధానంలో నేర్పగలడు. పనిలో వచ్చే కొత్త కొత్త టెక్నాలజీని అందుకోగలడు. ఆ పనిలో అతను ఇతరులకు మార్గదర్శకుడిగా ఎదిగే అవకాశాలు ఉంటాయి.

చదువుకున్న మెకానిక్ కేవలం తనకు తెలిసిన మోడల్ వెహికల్స్ కు మాత్రమే రిపేర్ చేయగలిగితే, చదువుకున్న మెకానిక్ మాత్రం కొత్త కొత్త మోడల్ వెహికల్స్ కూడా రిపరి చేయగలిగే సామర్ధ్యం పెంచుకోగలడు.

అదే రైతు అయితే కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేయగలడు

జీవితమును తమకు నచ్చినట్టుగా మార్చుకునే అవకాశాలు మెరుగుపడతాయి.

ఆర్ధిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ముందుగా మరొకరిపై ఆధారపడవలసిన అవసరం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణం చేసే సందర్భాలలో…

ప్రయాణాలలో తెలిసి వస్తుంది. చదువు ఎందుకు అవసరం? అని

అక్షర జ్ఙానం లేకపోతే ప్రయాణించవలసిన ఊరు పేర్లు కూడా చదవలేము. అదే చదువుకుని ఉండడం వలన ప్రయాణపు మార్గముల గురించి ఒకరిపై ఆధారపడకుండా తెలుసుకోగలము. ఇది చదువుకోవడం వలన వ్యక్తికి కలిగే ప్రాధమిక ప్రయోజనం.

అక్షరజ్ఙానం ఉంటే ప్రయాణంలో ఒక బస్సు వెళ్ళే రూటు గురించి వివరాలు కోసం మరొకరిపై ఆధారపడనవసంలేదు. విషయ విజ్ఙానం ఉంటే లోకంలో మనగలగడానికి మార్గం ఉంటుంది.

ఇంకా చదువుకుని ఉండడం వలన వివిధ ప్రాంతాలలోని విషయ పరిజ్ఙానం గురించి పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చును. చదువు వలన వ్యక్తి నిత్యవిద్యార్ధిగా ఉండవచ్చును. Jeevitamlo chaduvuku enta viluva అంటే జీవితం ఎంత విలువో, అందులో చదువు వలన వచ్చే విలువ ఎక్కువ.

మరీ ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులు తమ పిల్లల పెంపకంలో కీలక పాత్రను పోషించగలరు.

ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవచ్చును. ఉపాధిని సృష్టించవచ్చును. ఎంత వ్యాపారం చేసినా, కనీస అక్షరజ్ఙానం అవసరం ఉంటుంది.

ఇంకా పరిశోధనాత్మకమైన తెలివితేటలు గల బాలుడికి సరైన చదువు తోడైతే, అతను ఒక శాస్త్రవేత్తగా మారే అవకాశాలు ఉంటాయి.

గత సామాజిక పరిస్థితులు, ఇప్పటి వర్తమాన పరిస్థితులు, భవిష్యత్తు సామాజిక పరిస్థితుల విశ్లేషణలు గ్రహించే శక్తి చదువుకుని ఉండడం తెలియబడుతుంది.

Jeevitamlo chaduvuku enta viluva అది జీవితాలను మార్చగలిగే శక్తిని అందించగలదు.

పాడి పరిశ్రమలు వృద్ది కి చదువు మరింత సహాయకారి అవుతుంది.

చదువు ఎందుకు పదిగోవులు కాసుకుంటే పాడి ఉంటుంది… గోవులు వృద్ది చెందుతాయి. ఆర్ధికాభివృద్ది ఉంటుంది… చిన్నతనం నుండి పని అలవాటు అవుతుంది. అనేవారు ఉంటారు.

అవును చిన్నతనం నుండి పనిచేయడానికి అలవాటు పడినవారు బద్దకించరు. చిన్నతనం నుండి సుకుమారంగా పెరిగినవారు, కష్టాలకు కుదేలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కష్టపడి రూపాయిలు సంపాధించినా అవి ఖర్చు చేయడానికి కూడా నేటి రోజులలో అక్షరజ్ఙానం అవసరం ఉంది.

ఇంకా పది గోవులు కాసుకుని పాడిని వృద్ది చేసుకునే వారు చదువుకుని ఉంటే, పాడి పంటలు, పశువుల పెంపకంలో మరిన్ని విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవచ్చును. ఇంకా పాడిపంటలు ద్వారా మరింత ఆర్దికాభివృద్ది సంపాదించి, మరికొంతమందికి ఉపాధి ఇవ్వవచ్చును. అంటే దీనిని బట్టి కష్టానికి చదువు తోడైతే, అది ఒక సంస్థగా మార్చుకునే శక్తి వ్యక్తి ఏర్పడగలదు. కాబట్టి చదువు మనిషికి మేలు చేస్తుంది.

ఇలా ఒక వ్యక్తి జీవితంతో చదువు యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది. చదువుకోని వారిని నేటి రోజులలో చూస్తుంటే, వారి సాంకేతిక పరికరాల విషయంలో ఇతరులపై ఆధారపడవలసి వస్తుంటుంది.

శ్రద్దాసక్తులు పెరిగితే కార్యదక్షత పెరుగుతుంది. కార్యదక్షత వలన కార్యాలయములలో అధికారం లభిస్తుంది.

ఇప్పుడు అయితే స్మార్ట్ ఫోన్, ట్యాబ్ అంటూ అందరిచేతిలో సాంకేతికత సహాయంగా ఉంటే, దానిని ఉపయోగించుకోవడానికి ఎంతోకొంత చదువు ఉంటే, సాంకేతికత బాగా ఉపయోగించుకోవచ్చును.

అదే సాంకేతికతకు నాణ్యమైన చదువు ఉంటే, సాంకేతికతలో అద్భుతాలు సృష్టించవచ్చును. ఏదైనా చదువుకుని ఉండడం వలన వ్యక్తి ఉన్నతికి ఉత్తమమైన మార్గాలు ఎక్కువగా ఉంటాయి.

లోకంలో మంచిమాటలు ప్రాచుర్యంలో ఉంటాయి. అలాంటి మాటలలో ఒక్కటి.. ధనం దొంగిలించగలరు కానీ విద్యను దొంగిలించలేరని… విద్య వలన వ్యక్తికి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి.

వ్యక్తి చదువుకుని ఉంటే, అది అతని ఉన్నతికి మరింత ఊతం ఇచ్చినట్టే ఉంటుంది. కాబట్టి చదువు చాలా విలువైనది… కాలం చాలా చాలా విలువైనది. అలాంటి కాలాన్ని తగురీతిలో సద్వినియోగం చేసుకోవడంలో చదువు బాగా ఉపయోగపడుతుంది.

Jeevitamlo chaduvuku enta viluva? అందరికి విద్య అవసరం అని ప్రభుత్వాలు చెప్పాయి, అక్షరాస్త్యత పెంచడానికి పధకాలు తెచ్చారు అంటే జీవితంలో చదువు చాలా విలువైనది అని సమాజం చెబుతుంది. సమాజంలో నివసించే వ్యక్తీ, సమాజంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా మనిషి మారాలి. చదువు వలన భవిష్యత్తుకు కావలసిన జ్ఞానం ఎప్పటికప్పుడు శోదిస్తూ ఉండవచ్చు.

వెలకట్టలేని కొన్ని విషయాలలో చదువు కూడా ఒక్కటి. కేవలం చదువు ఒక్కటే కాదు దానికి వినయం ఉంటే, ఆ విద్య శోభిస్తుంది….

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం