Category Archives: 2021

మీకు మీ బంధుమిత్రులకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021

సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021 sankranthi subhakankshalu quotes 2021

భోగినాటి భాగ్యం దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు..

మీ వాకిలి సంక్రాంతి ముగ్గులతో మీ మనసు ముత్యాల నవ్వులతో ఉప్పొంగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు…

సంక్రాంతి వస్తుంది… తెస్తుంది సంతోషాల చిరుజల్లు… ఆ చిరుజల్లులలో మీకుటుంబం తడిసి సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

సంవత్సరంలో వచ్చే పెద్ద పండుగ, వస్తూ వస్తూ మీకు సకలైశ్వర్యములు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ మీకు మీ బంధు మిత్రులు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

మీ లోగిలి అంతా ముగ్గులమయంతో నిండాలి. మీ మనసంతా ఆనందమయం కావాలని కోరుకుంటూ మీకు మీ బంధు మిత్రులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

వస్తే వాయినం ఇస్తా, ఉంటే ఊరంత పందిరివేసి పండుగ చేస్తాం… పెద్ద పండుగలో బంధుమిత్రులతో కలిసిమెలిసి సంతోషం పంచుకోవాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు…

బంగారం ధర భోగిమంటలు వలె పైపైకి, ఎంత పైపైకెగిరిన బంగారం అయిన బంగారంలాంటి మనసు మందు తేలిపోతుంది… అటువంటి బంగారంలాంటి మనసు కలిగిన మిత్రమా నీకు నీకుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు…

సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021
సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో ఇమేజ్

కరోనా కారణంగా కలవకపోవచ్చును… కానీ మనసు వేదికగా జరిగే పండుగలో వేదికంతా మీరే… నామనసే మీ పండుగకు వేదిక అవ్వడానికి వెయిట్ చేస్తుంది… మీకు మీ బంధుమిత్రలకు సంక్రాంతి శుభాకాంక్షలు…

ఆలోచనకు హద్దు ఉండదు, పెద్ద పండుగ ఆనందానికి అవధులు ఉండవు… ఆ ఆనందములు మీకు మీ కుటుంబసభ్యులకు కలకాలం కలగాలని మనసావాచా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు.

సంక్రాంతిలో కాంతి ఉంది.. నీమనసులో కాంతి అనేకమందికి మార్గదర్శకమైంది… మిత్రమా నీవున్నచోట నిత్యమూ సంక్రాంతే… నీకు నీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

వచ్చే… వచ్చే… వాన ఆగితే ఆనందం… మండే… మండే… ఎండ చల్లబడితే సంతోషం… వచ్చే వచ్చే సంక్రాంతి సంతోషం… సంక్రాంతి వచ్చి వెళ్ళాక కూడా కొనసాగాలని కోరుకుంటూ… మీకు మీ బంధు మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

ప్రతి పండుగలో మనకు సంతోషంతో సాగుతుంది… పెద్ద పండుగకు పెద్దలను సంతోష పెట్టామనే తృప్తితో సాగుతుంది… అంత గొప్పదైన సంక్రాంతి.. మీకు మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలను అందించాలని ఆశిస్తూ… మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరిన్ని కోట్స్

పంచితే పెరిగేది ప్రేమ అయితే, పంచుకునేవారందరూ కలిసేది పెద్ద పండుగకే, సంక్రాంతి వస్తుంది… బంధువులను కలుపుతుంది… మీకు మీ బంధుమిత్రుల బంధుమిత్రులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు…

రైతుకు పండుగే, రైతు పండించే పంటను తినే మనకు పండుగే అందరికీ ఆనందాలను అందించే సంక్రాంతి నుండి మీ ఇల్లు నిత్య సంక్రాంతి వలె వెలగాలని కోరుకుంటూ…. మీకు మీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు…

సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021
సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో ఇమేజ్

ధన్యవాదాలు తెలుగు బ్లాగు

తెలుగురీడ్స్ హోమ్

ఈ సంవత్సరం 2021 తెలుగు పండుగలు ఏకాదశి తిధులు, మాసశివరాత్రులు

ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు , ఏకాదశి తిధులు, వరలక్ష్మీవ్రతం, వినాయక చవితి, దసరా దీపావళి తదితర పం ఏఏ తేదీలలో ఏఏ రోజులలో ఏఏ పండుగలు వచ్చాయో..

జనవరి మాసంలో పండుగలు తెలుగులో

2వ తేదీ జనవరి 2021 అనగా శనివారము – సంకష్టరహర చతుర్ధి
9వ తేదీ జనవరి 2021 అనగా శనివారము– సఫల ఏకాదశి
10వ తేదీ జనవరి 2021 అనగా ఆదివారము- ప్రదోష వ్రతం
11వ తేదీ జనవరి 2021 అనగా సోమవారము- మాస శివరాత్రి
13వ తేదీ జనవరి 2021 అనగా బుధవారము- భోగి
14వ తేదీ జనవరి 2021 అనగా గురువారము- సంక్రాంతి
14వ తేదీ జనవరి 2021 అనగా గురువారము- అమావాస్య
15వ తేదీ జనవరి 2021 అనగా శుక్రవారము- కనుమ
16వ తేదీ జనవరి 2021 అనగా శనివారము- ముక్కనుమ
18వ తేదీ జనవరి 2021 అనగా సోమవారము- స్కందషష్ఠి
24వ తేదీ జనవరి 2021 అనగా ఆదివారము – పుత్రాద ఏకాదశి
25వ తేదీ జనవరి 2021 అనగా సోమవారము – కూర్మ ద్వాదశి
26వ తేదీ జనవరి 2021 అనగా మంగళవారము – ప్రదోష వ్రతం

ఫిబ్రవరి మాసంలో పండుగలు తెలుగులో

6వతేదీ ఫిబ్రవరి 2021 అనగా శనివారము – ధనిష్ట కార్తె
7వతేదీ ఫిబ్రవరి 2021 అనగా ఆదివారము – షట్తిల ఏకాదశి
8వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా సోమవారము – షట్తిల ఏకాదశి
9వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా మంగళవారము – ప్రదోష వ్రతం
10వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా బుధవారము – మాసశివరాత్రి
11వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా గురువారము – అమావాస్య
16వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా మంగళవారము – వసంతపంచమి
17వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా బుధవారము – స్కందషష్ఠి
19వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా శుక్రవారము – రధసప్తమి
20వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా శనివారము – భీష్మాష్టమి
23వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా మంగళవారము – జయ ఏకాదశి
24వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా బుధవారము – భీష్మ ఏకాదశి
24వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా బుధవారము – ప్రదోశ వ్రతం
27వ తేదీ ఫిబ్రవరి 2021 అనగా శనివారము – పౌర్ణమి

మార్చి మాసంలో పండుగలు తెలుగులో

2వతేదీ మార్చి 2021 అనగా మంగళవారము – సంకటహర చతుర్ధి
4వతేదీ మార్చి 2021 అనగా గురువారము – యశోద జయంతి
5వతేదీ మార్చి 2021 అనగా శుక్రవారము – శబరీ జయంతి
6వతేదీ మార్చి 2021 అనగా శనివారము – జానకి జయంతి
9వతేదీ మార్చి 2021 అనగా మంగళవారము – విజయ ఏకాదశి
10వతేదీ మార్చి 2021 అనగా బుధవారము – ప్రదోష వ్రతం
11వతేదీ మార్చి 2021 అనగా గురువారము – మహాశివరాత్రి
13వతేదీ మార్చి 2021 అనగా శనివారము – అమావాస్య
15వతేదీ మార్చి 2021 అనగా సోమవారము – రామకృష్ణ పరమహంస జయంతి
16వతేదీ మార్చి 2021 అనగా మంగళవారము – పొట్టి శ్రీరాములు జయంతి
19వతేదీ మార్చి 2021 అనగా శుక్రవారము – స్కందషష్ఠి
25వతేదీ మార్చి 2021 అనగా గురువారము అమల ఏకాదశి
25వతేదీ మార్చి 2021 అనగా గురువారము నరసింహ ద్వాదశి
26వతేదీ మార్చి 2021 అనగా శుక్రవారము ప్రదోష వ్రతం
28వతేదీ మార్చి 2021 అనగా ఆదివారము హోలీ, పౌర్ణమి
29వతేదీ మార్చి 2021 అనగా సోమవారము హోలీ
31వతేదీ మార్చి 2021 అనగా బుధవారము సంకటహర చతుర్ధి

ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు ఏప్రిల్ మాసంలో పండుగలు తెలుగులో

7వతేదీ ఏప్రిల్ 2021 అనగా బుధవారము – పాపవిమోచన ఏకాదశి
9వతేదీ ఏప్రిల్ 2021 అనగా శక్రవారము – ప్రదోష వ్రతం
10వతేదీ ఏప్రిల్ 2021 అనగా శనివారము – మాస శివరాత్రి
11వతేదీ ఏప్రిల్ 2021 అనగా ఆదివారము అమావాస్య
13వతేదీ ఏప్రిల్ 2021 అనగా మంగళవారము – ఉగాది
15వతేదీ ఏప్రిల్ 2021 అనగా గురువారము – గౌరీ పూజ
15వతేదీ ఏప్రిల్ 2021 అనగా గురువారము – డోల గౌరీ వ్రతం
17వతేదీ ఏప్రిల్ 2021 అనగా శనివారము – లక్ష్మీ పంచమి
18వతేదీ ఏప్రిల్ 2021 అనగా ఆదివారము – స్కందషష్ఠి
21వతేదీ ఏప్రిల్ 2021 అనగా బుధవారము – శ్రీరామనవమి
23వతేదీ ఏప్రిల్ 2021 అనగా శుక్రవారము – కామద ఏకాదశి
24వతేదీ ఏప్రిల్ 2021 అనగా శనివారము – వామన ద్వాదశి
24వతేదీ ఏప్రిల్ 2021 అనగా శనివారము – ప్రదోష వ్రతం
27వతేదీ ఏప్రిల్ 2021 అనగా మంగళవారము – చైత్ర పూర్ణిమ
30వతేదీ ఏప్రిల్ 2021 అనగా శుక్రవారము – సంకష్టహర చతుర్ది

మే మాసంలో పండుగలు తెలుగులో

7వతేదీ మే 2021 అనగా శుక్రవారము వరూధిని ఏకాదశి
8వతేదీ మే 2021 అనగా శనివారము ప్రదోష వ్రతం
8వతేదీ మే 2021 అనగా శనివారము శనిత్రయోదశి
11వతేదీ మే 2021 అనగా మంగళవారము అమావాస్య
14వతేదీ మే 2021 అనగా శుక్రవారము అక్షయతృతీయ
17వతేదీ మే 2021 అనగా సోమవారము శ్రీ ఆది శంకరాచార్య జయంతి, స్కందషష్ఠి
22వతేదీ మే 2021 అనగా శనివారము మోహినీ ఏకాదశి
23వతేదీ మే 2021 అనగా ఆదివారము మోహనీ ఏకాదశి
23వతేదీ మే 2021 అనగా ఆదివారము పరశురామ ద్వాదశి
24వతేదీ మే 2021 అనగా సోమవారము ప్రదోష వ్రతం
26వతేదీ మే 2021 అనగా బుధవారము పౌర్ణమి
27వతేదీ మే 2021 అనగా గురువారము నారద జయంతి
29వతేదీ మే 2021 అనగా శనివారము సంకష్టహర చతుర్ది

జూన్ మాసంలో పండుగలు తెలుగులో

4వతేదీ జూన్ 2021 అనగా శుక్రవారము హనుమాన్ జయంతి
6వతేదీ జూన్ 2021 అనగా ఆదివారము అపర ఏకాదశి
7వతేదీ జూన్ 2021 అనగా సోమవారము ప్రదోష వ్రతం
8వతేదీ జూన్ 2021 అనగా మంగళవారము మాస శివరాత్రి
10వతేదీ జూన్ 2021 అనగా గురువారము అమావాస్య
16వతేదీ జూన్ 2021 అనగా బుధవారము స్కందషష్ఠి
21వతేదీ జూన్ 2021 అనగా సోమవారము నిర్జల ఏకాదశి
21వతేదీ జూన్ 2021 అనగా సోమవారము రామలక్ష్మణ ద్వాదశి
22వతేదీ జూన్ 2021 అనగా మంగళవారము ప్రదోష వ్రతం
24వతేదీ జూన్ 2021 అనగా గురువారము పౌర్ణమి
27వతేదీ జూన్ 2021 అనగా ఆదివారము సంకష్టహర చతుర్ధి

జులై మాసంలో పండుగలు తెలుగులో

5వతేదీ జులై 2021 అనగా సోమవారము యోగిని ఏకాదశి
7వతేదీ జులై 2021 అనగా బుధవారము ప్రదోష వ్రతం
8వతేదీ జులై 2021 అనగా గురువారము మాస శివరాత్రి
9వతేదీ జులై 2021 అనగా శుక్రవారము అమావాస్య
12వతేదీ జులై 2021 అనగా సోమవారము పూరీ జగన్నాధస్వామి రధోత్సవం
14వతేదీ జులై 2021 అనగా గురువారము స్కందషష్ఠి
20వతేదీ జులై 2021 అనగా మంగళవారము దేవశయనీ ఏకాదశి
21వతేదీ జులై 2021 అనగా బుధవారము వాసుదేవ ద్వాదశి
21వతేదీ జులై 2021 అనగా బుధవారము ప్రదోష వ్రతం
24వతేదీ జులై 2021 అనగా శనివారము గురుపౌర్ణమి, వ్యాసపూజ
27వతేదీ జులై 2021 అనగా మంగళవారము సంకష్టహర చతుర్ధి

ఆగష్టు మాసంలో పండుగలు తెలుగులో

4వతేదీ ఆగష్టు 2021 అనగా బుధవారము కామిక ఏకాదశి
5వతేదీ ఆగష్టు 2021 అనగా గురువారము ప్రదోష వ్రతం
6వతేదీ ఆగష్టు 2021 అనగా శుక్రవారము మాస శివరాత్రి
7వతేదీ ఆగష్టు 2021 అనగా ఆదివారము అమావాస్య
13వతేదీ ఆగష్టు 2021 అనగా శుక్రవారము నాగపంచమి, స్కందషష్ఠి, కల్కి జయంతి
18వతేదీ ఆగష్టు 2021 అనగా బుధవారము పుత్రాద ఏకాదశి
19వతేదీ ఆగష్టు 2021 అనగా గురువారము దామోదర ద్వాదశి
20వతేదీ ఆగష్టు 2021 అనగా శుక్రవారము ప్రదోష వ్రతం
20వతేదీ ఆగష్టు 2021 అనగా శుక్రవారము వరలక్ష్మీ వ్రతం
22వతేదీ ఆగష్టు 2021 అనగా ఆదివారము రక్షాబంధన్, పౌర్ణమి
22వతేదీ ఆగష్టు 2021 అనగా ఆదివారము యజుర్వేద ఉపాకర్మ
25వతేదీ ఆగష్టు 2021 అనగా బుధవారము సంకష్టహర చతుర్ధి
27వతేదీ ఆగష్టు 2021 అనగా శుక్రవారము నాగపంచమి
28వతేదీ ఆగష్టు 2021 అనగా శనివారము బలరామ జయంతి
30వతేదీ ఆగష్టు 2021 అనగా సోమవారము కృష్ణ జన్మాష్టమి

ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు
ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు
సెప్టెంబర్ మాసంలో పండుగలు తెలుగులో

3వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శుక్రవారము అజ ఏకాదశి
4వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శనివారము ప్రదోష వ్రతం
4వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శనివారము శనిత్రయోదశి
05వతేదీ సెప్టెంబర్ 2021 అనగా ఆదివారము మాస శివరాత్రి
7వతేదీ సెప్టెంబర్ 2021 అనగా మంగళవారము అమావాస్య
9వతేదీ సెప్టెంబర్ 2021 అనగా గురువారము వరాహ జయంతి
10వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శుక్రవారము వినాయక చతుర్ధి
13వతేదీ సెప్టెంబర్ 2021 అనగా సోమవారము లలిత సప్తమి
14వతేదీ సెప్టెంబర్ 2021 అనగా మంగళవారము మహాలక్ష్మీవ్రతం ప్రారంభం
17వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శుక్రవారము పరివర్తినీ ఏకాదశి
17వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శుక్రవారము కల్కి ఏకాదశి
18వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శనివారము ప్రదోష వ్రతం
18వతేదీ సెప్టెంబర్ 2021 అనగా శనివారము శనిత్రయోదశి
19వతేదీ సెప్టెంబర్ 2021 అనగా ఆదివారము అనంత పద్మనాభ వ్రతం
20వతేదీ సెప్టెంబర్ 2021 అనగా సోమవారము పౌర్ణమి
24వతేదీ సెప్టెంబర్ 2021 అనగా సంకష్టహర చతుర్ధి
28వతేదీ సెప్టెంబర్ 2021 అనగా మంగళవారము మహాలక్ష్మీ వ్రత సమాప్తం

ఈసంవత్సరం 2021 తెలుగు పండుగలు అక్టోబర్ మాసంలో పండుగలు తెలుగులో

2వతేదీ అక్టోబర్ 2021 అనగా శనివారము ఇందిరా ఏకాదశి
4వతేదీ అక్టోబర్ 2021 అనగా సోమవారము ప్రదోష వ్రతం, మాస శివరాత్రి
6వతేదీ అక్టోబర్ 2021 అనగా బుధవారము అమావాస్య
7వతేదీ అక్టోబర్ 2021 అనగా గురువారము దసరా నవరాత్రులు ప్రారంభం
13వతేదీ అక్టోబర్ 2021 అనగా బుధవారము దుర్గాష్టమి
14వతేదీ అక్టోబర్ 2021 అనగా గురువారము మహానవమి
15వతేదీ అక్టోబర్ 2021 అనగా శుక్రవారము విజయదశమి
16వతేదీ అక్టోబర్ 2021 అనగా శనివారము పాశాంకుశ ఏకాదశి
17వతేదీ అక్టోబర్ 2021 అనగా ఆదివారము పద్మనాభ ద్వాదశి
17వతేదీ అక్టోబర్ 2021 అనగా ఆదివారము ప్రదోష వ్రతం
20వతేదీ అక్టోబర్ 2021 అనగా బుధవారము పౌర్ణమి
23వతేదీ అక్టోబర్ 2021 అనగా శనివారము అట్లతద్ది
24వతేదీ అక్టోబర్ 2021 అనగా ఆదివారము సంకష్టహర చతుర్ధి

నవంబర్ మాసంలో పండుగలు తెలుగులో

1వతేదీ నవంబర్ 2021 అనగా సోమవారము రమా ఏకాదశి
2వతేదీ నవంబర్ 2021 అనగా మంగళవారము ప్రదోష వ్రతం, ధనత్రయోదశి
3వతేదీ నవంబర్ 2021 అనగా బుధవారము మాస శివరాత్రి
4వతేదీ నవంబర్ 2021 అనగా గురువారము దీపావళి
4వతేదీ నవంబర్ 2021 అనగా గురువారము దీపావళి, లక్ష్మీపూజ
05వతేదీ నవంబర్ 2021 అనగా శుక్రవారము కార్తీకమాసం ప్రారంభం
8వతేదీ నవంబర్ 2021 అనగా సోమవారము నాగులచవితి
9వతేదీ నవంబర్ 2021 అనగా మంగళవారము స్కందషష్ఠి
14వతేదీ నవంబర్ 2021 అనగా ఆదివారము దేవుత్తన ఏకాదశి
15వతేదీ నవంబర్ 2021 అనగా సోమవారము దేవుత్తన ఏకాదశి
15వతేదీ నవంబర్ 2021 అనగా సోమవారము యోగేశ్వర ద్వాదశి
16వతేదీ నవంబర్ 2021 అనగా మంగళవారము ప్రదోష వ్రతం
19వతేదీ నవంబర్ 2021 అనగా శుక్రవారము కార్తీకపౌర్ణమి
23వతేదీ నవంబర్ 2021 అనగా మంగళవారము సంకష్టహర చతుర్ధి
27వతేదీ నవంబర్ 2021 అనగా బుధవారము కాలభైరవ జయంతి
30వతేదీ నవంబర్ 2021 అనగా మంగళవారము ఉత్పన్న ఏకాదశి

డిసెంబర్ మాసంలో పండుగలు తెలుగులో

2వతేదీ డిసెంబర్ 2021 అనగా గురువారము ప్రదోష వ్రతం, మాస శివరాత్రి
4వతేదీ డిసెంబర్ 2021 అనగా శనివారము అమావాస్య
8వతేదీ డిసెంబర్ 2021 అనగా బుధవారము నాగపంచమి
9వతేదీ డిసెంబర్ 2021 అనగా గురువారము సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి
14వతేదీ డిసెంబర్ 2021 అనగా మంగళవారము మొక్షద ఏకాదశి, గీతాజయంతి
15వతేదీ డిసెంబర్ 2021 అనగా బుధవారము మత్స్య ద్వాదశి
16వతేదీ డిసెంబర్ 2021 అనగా గురువారము ప్రదోష వ్రతం
19వతేదీ డిసెంబర్ 2021 అనగా ఆదివారము పౌర్ణమి
22వతేదీ డిసెంబర్ 2021 అనగా బుధవారము సంకష్టహర చతుర్ధి
30వతేదీ డిసెంబర్ 2021 అనగా గురువారము సఫల ఏకాదశి
31వతేదీ డిసెంబర్ 2021 అనగా శుక్రవారము ప్రదోష వ్రతం

ధన్యవాదాలు తెలుగురీడ్స్ బ్లాగ్

తెలుగురీడ్స్ హోమ్

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు ఈ పోస్టులో చూద్దాం… ఇండియన్ గవర్నమెంట్ చైనా యాప్స్ బ్యాన్ చేశాకా… ఇండియన్ యాప్స్ ఏమిటి? అనే ప్రశ్న సాధారణం.

మన ఇండియాలో మన ఇండియన్ డవలప్ చేసిన మొబైల్ యాప్స్ మన ఇండియన్ ఫోన్లలో ఉండాలని…

లేదా మన ఇండియన్ కంపెనీస్ డవలప్ చేయించిన మొబైల్ యాప్స్ మన స్మార్ట్ ఫోన్లలో ఉండాలని… మన భావనగా ఉంది.

చైనా ఆగడాలకు చెక్ పెట్టే నేపధ్యంలో మన ఇండియన్ గవర్నమెంట్ చాలా చైనా యాప్స్ ఉపయోగించకూడదని నిషేదం విధించింది.

కొన్ని రకాల చైనా యాప్స్ మనకు వాడుకలో అలవాటుగా మారాయి… అలాంటి వాటిలో షేర్ ఇట్, లైకీ, హలో, టిక్ టాక్ వంటి మొబైల్ యాప్స్…

మనదేశంలో టెక్ సంస్థలు అందించే కొన్ని ఇండియన్ మొబైల్ యాప్స్... ఇంకా తెలుగులో ఉండే మరికొన్ని మొబైల్ యాప్స్…

కొన్ని మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు
గానా మ్యూజిక్ మొబైల్ యాప్

గానా మొబైల్ యాప్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులను అందిస్తుంది. మూడు మిలియన్ సాంగ్స్ వివిధ ఇండియన్ లాంగ్వేజులలో లభిస్తాయి. లక్షల మంది విజిట్ చేసే మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…


వింక్ మ్యూజిక్ మొబైల్ యాప్

ఇది మరొక మన ఇండియన్ మ్యూజిక్ మొబైల్ యాప్… లక్షల మందిచేత డౌన్ లోడ్ చేయబడిన ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…


హాట్ స్టార్ స్ట్రీమింగ్ మొబైల్ యాప్

స్ట్రీమింగ్ మొబైల్ యాప్… ఈ యాప్ ద్వారా లైవ్ క్రికెట్ మ్యాచులు వాచ్ చేయవచ్చును. అయితే ఫ్రీగా వాచ్ చేయాలంటే, మొబైల్ నెట్ వర్క్ ఆఫర్ కలిగి ఉండాలి. ప్రీమియం చార్జెస్ చెల్లించి స్ట్రీమింగ్ వీడియోలు వీక్షించవచ్చును. ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…


ఫ్లిప్ కార్ట్ షాపింగ్ మొబైల్ యాప్

షాపింగ్ మొబైల్ యాప్… ఈ యాప్ నందు అనేక వస్తువులు అమ్మకాలకు ఉంటాయి. ఆన్ లైన్లో మీ మొబైల్ పరికరం నుండి వస్తువులను ఆర్డర్ చేయవచ్చును. బాగా ప్రసిద్ది చెందిన ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో లేకపోతే ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

జొమాటో ఫుడ్ ఆర్డర్ మొబైల్ యాప్

ఫుడ్ ఆర్డర్ మీ మొబైల్ ఫోన్ చేయాలంటే, జొమాటో మొబైల్ యాప్ మీ ఫోనులో ఉండాల్సిందే… ఇది ఒక పాపులర్ దేశంలో వివిధ ప్రధాన నగరాలలో ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తుంది. ఇది మీకు అవసరమైతే గూగుల్ ప్లేస్టోర్ నుండి ఈ ఇమేజుపై టచ్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి…


రెడ్ బస్ ఆన్ టికెట్ బుకింగ్ మొబైల్ యాప్

రెడ్ బస్ యాప్ ఉంటే, బస్ టిక్కెట్ చేతిలో ఉన్నట్టే అంటూ ప్రచారం కూడా ఉంది. అంతగా పాపులర్ చెందిన రెడ్ బస్ ఇండియన్ మొబైల్ యాప్ ద్వారా బస్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చును… గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు మరి కొన్ని యాప్స్


ఓలా క్యాబ్ ఆన్ లైన్ బుకింగ్ మొబైల్ యాప్

మీరు నించున్న చోట నుండే మీ మొబైల్ య నుండి క్యాబ్ బుక్ చేయవచ్చును. ట్రైన్, ఫ్లైట్ ద్వారా ట్రావెలింగ్ చేసేవారికి ఈ యాప్ ఉపయోగం… ఓలా యాప్ ద్వారా ప్రధాన పట్టణ, నగరాలలో క్యాబ్ బుకింగ్ చేయవచ్చును. ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.


హైక్ మెసెజింగ్ మొబైల్ యాప్

ఇది ఇండియన్ మెసెజింగ్ మొబైల్ యాప్. దీనిలో చాటింగ్ చేయవచ్చును. లుడో గేమ్ ఆడవచ్చును. మరియు మెసెజింగ్ చేయవచ్చును. ఈ హైక్ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.


కూపన్ దునియా మొబైల్ యాప్

మొబైల్ వాడకం పెరిగాకా ఆన్ లైన్ కూపన్లు కూడా బాగానే లభిస్తున్నాయి. ఇండియాలో వివిధ కంపెనీలు అందించే కూపన్స్ గురించి తెలుసుకోవడానికి ఈ కూపన్ దునియా మొబైల్ యాప్ ఉపయోగపడుతుందట… గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.

న్యూస్ హంట్ మొబైల్ యాప్

మీ మొబైల్ ఫోనులో న్యూస్ ను హంటింగ్ చేయండి… న్యూస్ హంట్ మొబైల్ యాప్ డైలీ న్యూస్ హంట్ చేయండి… పాపులర్ చెందిని ఈ న్యూస్ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు
అహా తెలుగు ఓటిటి మొబైల్ యాప్

తెలుగులో గల మూవీస్, వెబ్ సిరీస్, కొత్తగా రిలీజ్ మూవీస్ ఈ అహా తెలుగు మొబైల్ యాప్ ద్వారా వీక్షించవచ్చును. ప్రీమియం ప్లాన్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.


షేర్ చాట్ మొబైల్ యాప్

తెలుగులో గల మరొక పాపులర్ యాప్ ఇండియన్ భాషలలో చాట్ చేయవచ్చును… పోస్టుల్ చేయవచ్చును. అపరిచిత వ్యక్తులతో చాట్ చేయవచ్చును. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

మరి కొన్ని ఇండియన్ మొబైల్ యాప్స్

లైక్లి షార్ట్ వీడియో స్టేటస్ మొబైల్ యాప్

మన ఇండియన్ పాపులర్ మొబైల్ యాప్స్ లిస్టులో ఇది ఒక్కటి. ఈ యాప్ ద్వారా 30సెకండ్స్ వీడియోలను ఆన్ లైన్లో షేర్ చేయవచ్చును. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.


డ్రైవింగ్ అకాడమీ మొబైల్ గేమ్

మన ఇండియన్ పాపులర్ మొబైల్ గేమ్ ఈ 3డి గేమ్ ద్వారా కార్ రేసింగ్ విత్ డ్రైవింగ్ రూల్స్… 100 లెవల్స్ వరకు ఈ గేమ్ ఆడవచ్చును. ఈ మొబైల్ గేమ్ మీఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.


భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు
ఇండియన్ ఆయిల్ ఎల్.పి.జి గ్యాస్ బుకింగ్ మొబైల్ యాప్

ఎల్.పి.జి. గ్యాస్ బుక్ చేయాలంటే, ఈ మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చును. ఇది ఇండియన్ ఆయిల్ వారి మొబైల్ యాప్. గ్యాస్ బుకింగ్ హిస్టరీ, ఎల్పిజీ గ్యాస్ బుకింగ్ డిటైల్స్ లభిస్తాయి. మీ ఫోనులో ఆ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.


ఇండియన్ రైల్ స్టేటస్ మొబైల్ యాప్

టిక్కెట్ బుక్ చేసుకున్న ట్రైన్ ఎక్కడుందో తెలియాలంటే, ఈ మొబైల్ యాప్ ద్వారా ట్రైన్ లోకేషన్ కనుగొనవచ్చును. ఇండియన్ రైల్ ట్రైన్ స్టేటస్ మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు

తెలుగులో కొన్ని మొబైల్ యాప్స్

భారతదేశంలో మన ఇండియన్ మొబైల్ యాప్స్ లిస్టు
తెలుగు నీతి కధలు మొబైల్ యాప్

సంతోషం, స్నేహం, స్పూర్తి, దయ, అభిమానం, విద్య, మనీ వంటి విషయాలలో నీతిని తెలియజేసే నీతి కధలు కలిగిన మొబైల్ యాప్ తెలుగులో రీడ్ చేయాలంటే ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.


తెలుగు సూక్తులు మొబైల్ యాప్

మాట సాధారణంగానే కనబడుతుంది… ఆలోచిస్తే భావం బలంగా మనసును తాకుతుంది… వాటినే సూక్తులు అంటారు. తెలుగులో సూక్తులు రీడ్ చేయడానికి మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.


తెలుగు జోక్స్ మొబైల్ యాప్

తెలుగులో జోక్స్, పొడుపు కధలు, సామెతలు, కోటేషన్స్, కవితలు, ధర్మ సందేహాలు కలిగిన తెలుగు మొబైల్ యాప్… తెలుగులో ఇవి రీడ్ చేయడానికి మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.


తెలుగు రాశిఫలాలు మొబైల్ యాప్

2021 తెలుగు క్యాలెండర్, దిన ఫలాలు, వార ఫలాలు, నక్షత్రం బట్టి రాశి వివరాలు మరియు పంచాంగం ఉంటుంది. డైలీ పంచాంగ చెక్ చేసుకోవచ్చును. ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.


శివ మహా పురాణం మొబైల్ యాప్

పరమ శివుని గురించి తెలియజేసే శివ మహా పురాణంతో బాటు, కార్తీక పురాణం, మాఘపురాణం, శ్రీ గరుడ పురాణం, మరికొన్ని పురాణాలు తెలుగులో రీడ్ చేయడానికి ఈ మొబైల్ యాప్ మీ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఈ ఇమేజుపై క్లిక్ చేయండి.


పైన గల వరుస జాబితాలో గల ఇమేజులపై క్లిక్ చేయండి. తద్వారా గూగుల్ ప్లేస్టోర్ యాప్ మీ ఫోనులో ఓపెన్ అవుతంది.

గూగుల్ ప్లేస్టోర్ నుండి మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఆయా మొబైల్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.

సూచనలు:

మీరు మీ ఆండ్రాయిడ్ ఫోనులో గల గూగుల్ ప్లేస్టోర్ నందు యాప్ ఇన్ స్టాల్ చేసుకునే ముందు, మీరు ఇన్ స్టాల్ చేయబోయే యాప్ యొక్క రివ్యూలు చదవడం మేలు.

ఏదైనా మొబైల్ యాప్ ఇన్ స్టాల్ ఫోనులో ఇన్ స్టాల్ చేసుకునేటప్పుడు, ఆ యాప్ సైజ్ చెక్ చేసుకోవడం మంచిది…

ఇంకా ఒక మొబైల్ యాప్ ఫోనులో డౌన్ లోడ్ చేసుకునేముందు, ఆ యాప్ ప్రభావితం చేయబోయే ఫోను ఫీచర్లను కూడా సరిచూసుకోవడం మేలు.

ఎన్ని ఫీచర్లపై మొబైల్ యాప్ ప్రభావం చూపుతుందో, ఆ యాప్ వలన మీ ఫోన్ సామర్ధ్యంపైన కూడా అంతే ప్రభాం చూపే అవకాశం ఉంటుంది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

తెలుగురీడ్స్ హోమ్ పేజి

విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి

విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి మెంబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్….

ఆలోచనలు మనసు చేస్తూనే ఉంటుంది…. ఆలోచనలు చేయడం సహజ లక్షణం… ఆలోచించడమే అలవాటుగా ఉన్న మనసుకు, ఆలోచించడం మామూలు విషయంగానే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటిలాగానే ఆలోచిస్తుంది.

అటువంటి మనసుకు తన చుట్టూ ఉన్న సామాజిక స్థితి గతులలో వచ్చిన మార్పుల వలన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. ఎప్పుడూ ఆలోచించే మైండ్, పరిస్థితుల మార్పు వలన వచ్చిన ఆలోచనను కొత్త ఆలోచనగా మార్చుకుని సంతోషిస్తుంది… కానీ అదే ఆలోచించడం దాని సహజ లక్షణం…

అయితే మనసు సంతోషమే మనిషి సంతోషం కాబట్టి… దానికి నచ్చినట్టు ఒక్కసారి నడుచుకుంటే, అది వందసార్లు మనకు సలహాలు ఇస్తుంది… అందుకే మనసును సంతోష పెడుతూ, దానితో విజ్ఙానం పొందడం తెలివైన పని అంటారు.

మన మనసును సంతోష పెట్టే పరిస్థితులు కాలం తీసుకువస్తూ ఉంటుంది… అలాంటి వాటిలో ఆంగ్లసంవత్సరంలో మొదటిగా వచ్చేది… జనవరిఫస్ట్… అలాంటి జనవరిఫస్ట్2021 మీకు మీ కుటుంబ సభ్యులకు ఇంకా మీ స్నేహితులు బంధు మిత్రులకు సుఖ సంతోషాలను కలగజేయాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు….

విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి
విష్ యుఏ హ్యాపీ న్యూఇయర్ 2021 టు యు అండ్ యువర్ ఫ్యామీలి

ఈ 2021 సంవత్సరం కరోనా పోవాలి, సామాజిక పరిస్థితులు మరింతగా సామాన్య జీవనానికి సహకరించాలి. అందరికీ హ్యాపీ న్యూఇయర్ 2021 ఇయర్ మొత్తం సాగాలి. విష్ యు ఏ హ్యాపీ న్యూఇయర్ 2021….

హ్యాపీ హ్యాపీగా న్యూ ఇయర్ లోకి వెళుతున్నవారందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూఇయర్…. పాత సంవత్సరం2020 చేదు అనుభవాలనే మిగిల్చింది.

కానీ చేదు ఒంటికి మంచిది… అలాగే చేదు అనుభవాల వలన మనసుకు అవగాహన మరితంగా పెరుగుతుంది.

గడిచిన గతంలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, గడవాల్సిన ఈ కొత్త సంవత్సరం మనసు కొత్త ఉత్సాహంతో ఉండాలి.

ఈ2021 న్యూ ఇయర్ అందరికీ మేలైన విషయాలను అందించాలి. కాలగమనంలో మార్పులకు అనుగుణంగా మనసు ఉత్తేజభరితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ…. మరొక్కమారు హ్యాపీ న్యూఇయర్ టు ఆల్….

ధ్యాంక్యూ…. తెలుగురీడ్స్.కామ్