మన తెలుగు జాతి గర్వించదగిన మహానుభావులలో పి.వి. నరసింహారావు గారు చాలా ప్రముఖులు. పివి నరసింహారావు మన మహనీయుడు, మన దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంతి ఇంకా మొదటి దక్షిణదేశపు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు 1921 సంవత్సరంలో జూన్ 28 తేదీన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. రుక్నాభాయి – సీతారామారావు ఈయన తల్లిదండ్రులు.
1962 లో తొలిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రివర్యులు గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రివర్యులుగా పదవులు నిర్వహించారు. ఆ తరువాత 1971 సెప్టెంబరు 30 న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఎటువంటి గ్రూపులు లేని పివి నరసింహరావుగారు అందరికీ ఆమోదయోగ్యులుగా
పి.వి. నరసింహారావుగారు 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యలేదు. దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకునే ఉద్దేశ్యంతో ఉన్న ఈయనకి ప్రధానమంత్రి పదవి వరించింది. రాజీవ్ గాంధీ హఠాన్మరణంతో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య ఎదురైంది. గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉండే కాలంలో తనకంటూ ప్రత్యేకంగా ఎటువంటి గ్రూపులు లేని పివి నరసింహరావుగారు అందరికీ ఆమోదయోగ్యులుగా కనబడ్డారు.
ఈయన ప్రధానమంత్రి పదవిని అలంకరించడంతో, నంధ్యాల లోక్ సభ అభ్యర్ధి చేత రాజీనామా చేయంచి, అక్కడ లోక్ సభ అభ్యర్దిగా పివి నరసిహారావుగారు నిలబడ్డారు. తెలుగువారు అనే గౌరవంతో అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావుగారు తమ పార్టీ తరపున ఎవరిని ఎన్నికలలో నిలబెట్టలేదు.
మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ల కాలంపాటు పాలించిన ప్రధానిగా
మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ల కాలంపాటు పాలించిన ప్రధానిగా పివి నరసింహారావు గారు కీర్తి గడించారు. ఈయన ప్రధానిగా ఉన్న కాలంలోనే ఆర్ధిక సంస్కరణలు జరిగాయి. అప్పటి ఆర్ధికమంత్రికి మన్మోహన్ సింగ్ కు అవసరమైన స్వేచ్ఛను ఇచ్చి, భారతదేశం అంతర్జాతీయంగా ఆర్ధిక శక్తిగా పుంజుకోవడానికి బాటలు వేశారని కీర్తి గడించారు.
అణు పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘనత పివి నరసింహారావుగారిదేనని అంటారు.
మన తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడైన పివి నరసింహారావుగా పలు భాషలలో ప్రవేశం ఉంది. ఈయన జర్నలిస్ట్, రచయిత కూడా.
కానీ ఈయన మరణానికి మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత తగు గౌరవం పొందలేదనే విమర్శ ఉంది. ఈయన 2004 సంవత్సరంలో డిసెంబర్ 23న పరమపదించారు.