Category Archives: corona

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ, పరోక్షంగా ఆరోగ్యపరంగా సామజిక సేవ కూడా అవుతుంది.

పరిశుభ్రత మనిషి ఆరోగ్య సూత్రాలలో ప్రధానమైనది. మనిషి తన వంటికి పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే తన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే తన నివాసం పరిశుభ్రతగా ఉంటుంది.

తను ఆరోగ్యంగా ఉండడం తన ప్రధాన అవసరం అయితే, తన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచడం సామజిక అవసరం.

తన గురించి తన చుట్టూ ఉండే వారి గురించి పరిశుభ్రతను పాటిస్తే, ఒక సామజిక బాద్యత నిర్వహించిన వారవుతారు. మనిషి ఆరోగ్యం పరిశుభ్రత ఆధారంగా ప్రభావితం అవుతుంది. పరిశుభ్రత గల ప్రదేశంలో పరిశుభ్రతతో ఉన్న శరీరంతో పరిశుభ్రతమైన ఆహారం తీసుకోవడం కుటుంబ ధర్మాలలో ఒక్కటిగా ఉంటుదని అంటారు.

ఒక మనిషి తన పరిశుభ్రతతో బాటు పరిసరాల పరిశుభ్రత కచ్చితంగా పాటిస్తే అది సమాజం పట్ల తన కర్తవ్యమ్ నిర్వహించినట్టే అవుతుంది. అలాగే సామాజిక పరిశుభ్రత కోసం కృషి చేయడంతో సామజిక సేవ చేసినట్టే అవుతుంది.

వ్యక్తీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలలో ఉండే పరిసరాలు అంటే అవి నివసించే ఇల్లు, తిరిగే దారులు, పనిచేసే కార్యాలయాలు, నేర్చుకునే స్థలాలు, చదువుకునే విద్యాలయాలు ఇలా అనేక రకమైన పనులలో అనేక రకాలుగా పరిసరాలు వ్యక్తి చుట్టూ ఏర్పడుతూ ఉంటాయి.

ఇల్లు పరిశుభ్రతతో ఉంటే, ఆ ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది.

ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అంటువ్యాది వస్తే, అది ఆ ఇంట్లో అందరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు పరిసరాలలో పేరుకుపోయిన చెత్త వలన క్రిములు పెరిగి, ఆ క్రిముల వలన వ్యాధులు పెరిగే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి అంటువ్యాధులు నివారణకు ముందుగానే పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవడం మనిషిగా కనీస సామజిక బాధ్యతగా చెబుతారు.

చదువుకునే విద్యార్ధులు ఉండే విద్యాలయాలు పరిశుభ్రతగా లేకపోతే ఆ పరిసరాలలో ఏర్పడే సూక్ష్మజీవుల వలన అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని విద్యాలయాల కార్యవర్గం, విద్యాలయాలలో ఉండేవారు, విద్యార్ధులు కూడా అందరు ఆయా విద్యాలయాల పరిసరాల పరిశుభ్రత గురించి శ్రద్ధ తీసుకుని పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలి.

పరిశుద్దమైన ఆహారం, పరిశుద్ధమైన పానీయం తీసుకోవడం వ్యక్తిగా అందరికి ఆరోగ్య నియమలుగా చెబుతారు. ఒక వ్యక్తి ఆరోగ్యం మరొక వ్యక్తిపై పడుతుందని కరోన వైరస్ కారణంగా అందరికి తెలిసి వచ్చింది. ఆరోగ్యం చెడినవారికి కరోన వైరస్ త్వరగా వ్యాపించి, వారిద్వారా మరింతమందికి కరోన సోకినా ఘటనలు ప్రపంచంలో గత ఏడాది నుండి జరిగాయి.

ఈ కరోనా వైరస్ కారణంగా పారిశుధ్యం, ఆరోగ్యం పరిశుభ్రత, పరిశుభ్రత నినాదాలు పెరిగాయి. పారిశుధ్యంతో కూడిన ఆహారం తీసుకుంటే, వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే, అంటువ్యాధులు త్వరగా సోకవు. లేకపోతే అంటువ్యాధులు ప్రభాలుతాయి. కావున వ్యక్తి తన ఆరోగ్యపరిరక్షణ చేసుకోవడం పరోక్షంగా సామజిక పరిరక్షణ కూడా చేసినట్టే అవుతుంది.

బలమైన వ్యక్తికీ బరించే బలం ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉండేవారు వైరస్ బారిన పడకుండా తమనుతాము రక్షించుకుంటూ ఇతరులను అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడినవారవుతారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం అంటే, సమాజాన్ని ఆరోగ్యపరంగా రక్షించినవారమవుతాము.

పనిచేసే కార్యాలయాలలో, పని చేసే కర్మాగారాలలో ఆయా పరిసరాల పరిశుభ్రతను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఒక కార్యాలయంలో కానీ ఒక కర్మాగారంలో కాని వ్యక్తికి అంటువ్యాధి సోకితే, వారి ద్వారా, వారి చుట్టూ ఉన్నవారికి ఇంకా వారి వారి కుటుంబ సభులకు కూడా అంటువ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటువ్యాధులు ప్రభాలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన కర్తవ్యం అందరిపైన ఉంటుంది.

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ తద్వారా ఆరోగ్యపరంగా సామజిక సేవ కూడా అవుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ కరోనాకు కోవిడ్-19 అనే పేరు పెట్టారు. ఇది చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో లక్షలమంది ప్రాణాలను బలిగొన్న వైరస్ ఇంకా వివిధ రకాలు రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. ఇప్పటికే బ్రిటన్లో కొత్త రకం కరోనా వ్యాధి పుట్టింది.

ఈ కరోనా ఎప్పటి వైరస్

1960 సంవత్సరంలో తొలిసారిగా దీనిని కనుగొన్నారు. ఇది పక్షులు, క్షీరదాలపై దీని ప్రభావం ఉంటుంది. ఈ కరోనా వైరస్ ఆరు రకాలుగా ఉంటుందని కనుగొన్నారు. పక్షులు క్షీరదాలపై ప్రభావం చూపే ఈ కరోనా వైరస్ సాదారణ ఫ్లూ కన్నా పదింతలు ప్రమాదకరమైనది. ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

2019 లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది

కరోనా వైరస్ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ నుండి వ్యాప్తి చెందినట్టుగా గుర్తించారు. చైనా దేశంలో వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ఇద్దరిని బలితీసుకుంది…. ఆ శాంపిల్స్ లండప్ పంపగా అక్కడి పరిశోధనలలో దానిని కరోనా వైరస్ గా గుర్తించారు.

చైనాలో దీనిని 2019 డిసెంబర్ 1న గుర్తించగా మార్చి 5వ తేదికి 95 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడి నుండి దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ పలు దేశాలలో త్వరితగతిన వ్యాప్తి చెందింది.

ఆపై అమెరికా, జపాన్, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, టర్కి, యుకె, ఇండియా ఇలా అన్ని దేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.

కరోనా వైరస్ లక్షణాలు

కరోనా వ్యక్తిలో చాలా సాధారణంగా కనిపించే వ్యాధి లక్షణాలు:
జ్వరం
పొడి దగ్గు
అలసట
వ్యక్తిలో తక్కువ సాధారణంగా కనిపించే వ్యాధి లక్షణాలు:
నొప్పులు మరియు బాధలు
గొంతు మంట
విరేచనాలు
కండ్లకలక
తలనొప్పి
రుచి లేదా వాసన శక్తి కోల్పోవడం
చర్మంపై దద్దుర్లు లేదా వేళ్లు లేదా కాలి వేళ్లు రంగు కోల్పోవడం

కోవిడ్ -19 నివారణ చర్యలు ( కరోనా వైరస్ నివారణ చర్యలు )

కరోనా గురించి అపోహలు ఉంటే, ముందుగా దానికి గురించి నిజాలు తెలుసుకోండి… మందస్తు జాగ్రత్తగా మీతోబాటు మీ చుట్టుప్రక్కలవారి విషయంలోనూ జాగ్రత్తలు వహించండి. మీకు దగ్గరలో గల ఆరోగ్య సంస్థలో సంప్రదించి, తగిన సలహాని పాటించండి.

కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి:
తరచూ మీ చేతులను శుభ్రం చేసుకోవాలి.
దగ్గుతున్న లేదా తుమ్ముతున్న వారి నుండి దూరంగా ఉండాలి.
మాస్కుని ధరించండి.
చేతులు శుభ్రం చేయకుండా చేతితో మీ కళ్లు, ముక్కు లేదా నోటిని తాకరాదు.
దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ ముక్కు మరియు నోటిని మీ వంచిన మోచేయి లేదా టిష్యూతో అడ్డుపెట్టుకోవాలి.
అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవ్వాలి
మీరు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నట్లయితే, మీ దగ్గరలోని ఆరోగ్య సంస్థలో వైద్య పొందాలి.
వ్యక్తి మందస్తు జాగ్రత్తలు పాటించడం వలన వ్యక్తికి కరోనా రాకుండా ఉండడమే కాకుండా అంటువ్యాధి వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నట్టవుతుంది… కావునా వీలైనంత సామాజిక దూరం పాటిస్తూ, చేతులు, కాళ్ళు శుభ్రం చేసుకుంటూ, మాస్క్ ధరించడం శ్రేయస్కరం.

కరోనా వైరస్ ఎక్కువగా ఏఏ దేశాలపై ప్రభావం చూపింది..
కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి
కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ముందుగా చైనాను కరోనా వైరస్ ఒక్క ఊపి వదిలిపెట్టింది… ఆపై ఇటలీలో విజృంభించింది…. ఎంతగా ఇటలీని చూసి ప్రపంచం పాఠం నేర్చుకోవాలి… అనే స్థాయిలో ఇటలీని గజగజలాడించింది

ఇటలీని చూసి ప్రపంచం భయపడుతున్న వేళలోనే అమెరికాను కూడా కరోనా వైరస్ అతలాకుతలం చేసింది… కొన్నాళ్ళకు కరోనా కేసులలో అమెరికాలోనే అత్యధికంగా నమోదు కావడం మొదలైంది… అది మొదలు ఇప్పటి అమెరికానే కరోనా పాజిటివ్ కేసులలో అగ్రస్థానంలో ఉంది. సుమారు 21 కోట్లకు పైగా కరోనా కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి. మూడు లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.

అమెరికాను అతలాకుతం చేసిన కరోనా వైరస్, భారతదేశంలో పడగ విప్పింది… చైనాలో బాగా తగ్గాయి… ఇండియాలో పెరగడం మొదలయ్యాయి… మార్చి నుండి కరోనా కేసులు పెరుగుతుండంతో ఇండియాలో లాక్ డౌన్ అయిదు విడతలుగా భారతప్రభుత్వం అమలు చేసింది.

అయినప్పటికీ భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య పదికోట్లను దాటింది. ఒక లక్షా నలభైవేలకు పైగా కరోనా కాటుకు బలైనారు. భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు వలన రికార్డు స్థాయిలో కరోనా కేసులు రికవరి రేటు పెరిగింది.

అమెరికా, బ్రెజిల్, రష్యా, యుకె, ఫ్రాన్స్, టర్కి, స్పెయిన్, జర్మనీ, కొలంబియా, అర్జెంటీనా, మెక్సికో, పొలాండ్, ఇరాన్, సౌతాఫ్రికా, యుక్రైన్, పెరు, నెదర్లాండ్స్, బెల్జియం, రొమానియా, చీలె, కెనడా మొదలైన దేశాలలో కరోనా తీవ్ర ప్రభావమే చూపింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇది తగ్గుముఖం పడుతున్నట్టు ఉంటూ, మరలా కొత్త వైరస్ పరిణామం చెందగలదు. ఇప్పటికే బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందింది…

కరోనా పై పోరాటం చేయాలంటే, వ్యక్తిగత ఆరోగ్యకరమైన చర్యలతోనే సాద్యం. వైద్యుల సూచనలు మేరకు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, సామాజిక దూరం, మాస్క్ ధరించడం వలన వైరస్ వ్యాప్తి నివారించవచ్చును… ఇది అందరీ సామాజిక బాద్యత…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు