లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు

లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు Real Life Quotes In Telugu కాలంలో మనిషికి కాలం నేర్పే పాఠాలు, జీవితంపై ఏర్పడే అవగాహన మాటలుగా మారతాయి.

పెద్దలు మాట్లాడితే, ఆ మాటలకు అర్ధం మనసుకు జరిగే అనుభవం ద్వారానే తెలుస్తుందని అంటారు.

మాట మనసుని తాకుతుంది. కానీ అన్ని మాటలకు మనసు ప్రతిస్పందించకపోవచ్చును. కొందరి మాటలకు మనసు ప్రేరణ పొందుతుందని అంటారు.

అలాంటి పెద్దల మాటలను పరిశీలన చేయడం ద్వారా మనసు మనసుపై పరిశోధనాత్మకంగా పని చేస్తుందని అంటారు.

ఇక్కడ కొన్ని లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాత్మకం.

  • ఇష్టపడి పని చేస్తే, పనిపై ప్రేమ పెరుగుతుంది. పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది.
  • పరిశీలనా దృష్టితో ఉండడమే పరిశోధనకు మార్గం ఏర్పడుతుంది
  • ఎవరో వేసిన బాటలో అందరూ నడుస్తారు. కానీ ఒక్కరే తాను నడిచిన దారిలో ఎందరినో నడిపించగలరు.

  • సంతోషం మీ చర్యల వలన వస్తే అది ఆనందమయం అవుతుంది. ఇతరుల చర్యల వలన అయితే అది సంతోషం మాత్రమే.
  • ప్రపంచం నిత్య నూతనంగా ఉండడానికి మార్పును కోరుకుంటుంది. అటువంటి ప్రపంచంలో కూడా నీవు నీలాగా ఉండడం నీకు మాత్రమే ఉన్న గొప్పతనం.
  • మీ కృషి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళగలదు. అయితే మీపై మీకు గల నమ్మకమే సవాళ్ళను సైతం అధిగమించగలదు.

  • ఒక్కప్రశ్న చాలు జీవితంలో మార్పు ప్రారంభం కావాడానికి… నేనెందుకు ఇలా ఉన్నాను?.
  • నాకు తెలుసు. నాకు తెలిసినది ఎలా తెలిసినది. ఎవరో తెలుసుకున్నదే, నేను కూడా తెలుసుకున్నాను. మరి నేను కొత్తగా తెలుసుకున్నది ఏమిటి?
  • ఓటమి వెక్కిరించినా సరే, నా ప్రయత్నం చాలా ప్రధానం అనే బలమైన భావన ఘనవిజయానికి నాంది కాగలదు.

Real Life Quotes In Telugu

  • ప్రపంచం మన చుట్టూ ఒక అద్దం వలె పనిచేస్తుంది. మన ప్రవర్తనను బట్టే, ఇతరుల ప్రవర్తన మనకు ఎదురౌతుంది.
  • ఎదురైన ఓటమిలో గ్రహించిన వాస్తవమే, మరలా ప్రయత్నించడానికి ప్రోత్సాహం అవుతుంది.
  • భవిష్యత్తులో ఎలా ఉండాలో ఆలోచనలకే పరిమితం అయితే, మీ గొప్పతనం మీలోనే. అదే ఆచరణలో పెడితే, మీరేమిటో మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి పరిచయం జరుగుతుంది.

  • కంటికి కనబడే మహిమ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతరంగంలో ఉండే మహిమను గుర్తిస్తే, అది ఆనందకరం, అద్భుతాలను ఆవిష్కరించగలదు.
  • చేద్దాం, చూద్దాం, వాయిదా కోసం చూడడం… వ్యక్తి ఉన్నతికి ప్రధాన అడ్డంకులు.
  • జీవితాన్ని ఆస్వాదించాలి కానీ అయోమయ్యంలో గందరగోళంగా కాలం వెలిబుచ్చరాదు.

  • సమయం గడిచిపోతుంది. మనసు ఆలోచనలతో పరిగెడుతుంది. సమయాన్ని, ఆలోచనలు సద్వినియోగం చేసుకోవడంలోనే జీవితం వృద్ది ఆధారపడి ఉంటుంది.
  • అవసరానికి మించిన ధనం, అక్కరకు రాని తెలివి వృధా.
  • ఊహకందని విషయాలలో ఊహించకుండానే జరిగే విశేష క్రియ అద్భుతంగా అనిపిస్తుంది.

Real Life Quotes In Telugu

  • ప్రతిసారి ప్రణాళిక వేసుకుని పోరాడలేం. ఒక్కొక్కసారి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనసుని అందుకు సన్నద్దం చేయడమే తెలివైన పని.
  • చెడుకు ప్రచారం వేగంగా లభిస్తే, మంచికి నీవు అనుమతిస్తేనే నీ దృష్టిలోకి వస్తుంది. మంచి వేచి ఉంటుంది కానీ ఇబ్బంది పెట్టదు.
  • ఆగితే ఆలోచనలు పెరుగుతాయి. ఆగకుండా ఉంటే ఆలోచనలు ఆగుతాయి. కావునా కర్తవ్యం విస్మరించకు.

  • మీకు తెలిసి మీరు లక్ష్యంతో ప్రయాణిస్తున్నారంటే, మీకు జీవితంపై సరైన అవగాహన ఉందని అర్ధం.
  • మనం మాత్రమే సంతోషంగా ఉండడం కాదు. మన చుట్టూ ఉన్నవారు కూడా.
  • ఫలితాన్ని అంచనా వేయడం సహజం. ఆశించిన ఫలితం కోసం పనిచేయడం కర్తవ్యం. ఫలితం పొందలేదని బాధపడడం మూర్ఖత్వం.
  • విఫలం వేయి మార్గములను అన్వేషించగల శక్తిని అందించగలదు.

కొన్ని తెలుగు బ్లాగు పోస్టులు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

Real Life Quotes In Teluguలైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు