Tag Archives: అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర్యం వచ్చాక మనకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం. అది 1950వ సంవత్సరంలో జనవరి నెలలో 26 వ తేది. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం గణంగా జరుపుకుంటాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకలను చక్కగా చేపడతాయి. రాజకీయాలకు వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా దేశభక్తితో జరపుకునే వేడుకలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో, విద్యాలయాలలో, ప్రవేటు కార్యాలయాలలో అనేకమంది ప్రముఖులు భక్తిశ్రద్దలతో పాల్గొంటారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు…

భారతీయులు అంటే ఆచారాన్ని శ్రద్దతో చేస్తారు. ఇక దేశానికి సంబంధించిన వేడుక మన భారతదేశ గణతంత్ర దినోత్సవం అంటే అధికారిక పండుగ… దానిలో పాల్గొనడంలో ప్రతి భారతీయుడు ఉత్సాహంగా ఉంటారు.

సమాజంలో ఎన్ని తారతమ్యాలు ఉన్నా, మనమంతా భారతీయులమైన ఏక భావనను పెంచడానికి ప్రతి నాయకుడు చిత్తశుద్దితో వ్యవహరిస్తారు. అలా మన రాజ్యాంగమును గౌరవిస్తారు. భావి భారతీయులకు ఆదర్శంగా నిలుస్తారు. దేశాన్ని ప్రేమించమన్న అనే సందేశాన్ని బలంగా చాటి చెబుతారు. అదే మనదేశ గొప్పతనం. అలా అనేకమంది చాటి చెప్పబట్టే మన దేశానికి ప్రత్యేక గౌరవం ప్రపంచవ్యాప్తంగా ఉంది.

గణతంత్ర దినోత్సవం భారతీయులంతా ఒక్కటేననే భారతీయ భావన భారతీయులలో

దేశంలో ఆర్ధికపరంగా ఎక్కువ తక్కువలుగా ప్రజలు జీవనం ఉంటుంది. కానీ ప్రతి ప్రాంతీయ నాయకులలోనూ మనమంతా ఒక్కటేనని భావన ఉంటుంది. అందుకే ఆరోజు అందరికీ మిఠాయిలు పంపి, సాటి భారతీయులలో సంతోషాన్ని చూస్తారు.

అందులో ప్రతి కార్యాలయంలో ప్రతి అధికారి కూడా పాల్గొంటూ ఉంటారు.

విద్యనేర్చుకునే విద్యార్ధులకు ఆయా ప్రాంతపు నాయకులు కానీ ప్రసిద్ధ వ్యక్తులు కానీ విద్యాలయంలో మన భారతీయతత్వం గురించి మాట్లాడుతూ, విద్యార్ధులకు ప్రేరణ కల్పించే ప్రయత్నం చేస్తారు.

ముఖ్యంగా విద్యార్ధులు గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు కాబట్టి… వారికి మంచి సందేశం ఇవ్వడానికి ప్రతి నాయకులు ఆసక్తి చూపుతారు.

మనస్పర్ధలున్నా సరే ప్రతికూలంగా ఉండే వ్యక్తికి కూడా నమస్కారం చెప్పే రోజు, శుభాకాంక్షలు తెలియజేస్తే, మనమంతా భారతీయులమనే దేశభక్తి భావన బలంగా భావి భారతీయులలో మరింత పెంచడానికి, దేశముపై అవగాహన కలిగించే రోజు గణతంత్ర దినోత్సవం.

జాతి, మతం, ప్రాంతం, కులం అంటూ తారతమ్యాలు చూడకుండా కలసి పాల్గొనే గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాలలో ప్రజలంతా ఆనందమయంగా జరుపుకోవాలని… దేశమంతా గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే వేళలో అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

భారతదేశముపై దేశభక్తితో గురజాడ అప్పారావుగారి వ్రాసిన కవిత దేశభక్తిని మరింతగా పెంచుతుంది.

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా!
వొట్టి మాటలు కట్టిపెట్టోయి
గట్టి మేల్‌ తలపెట్టవోయి.

పాడిపంటలు పొంగిపొర్లే
దారిలో నువు పాటుపడవోయి;
తిండి కలిగితె కండ కలదోయి;
కండ కలవాడేను మనిషోయి!

యీసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయి?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయి.

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి
దేశి సరుకుల నమ్మవలెనోయి !
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి.

వెనక చూసిన కార్యమేమోయి?
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి!

పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే,
వ్యర్థ కలహం పెంచబోకోయి
కత్తి వైరం కాల్చవోయి

దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని ఏదైనాను వొకమేల్‌
కూర్చి జనులకు చూపవోయి

ఓర్వలేమిపిశాచి దేశం
మూలుగులు పీల్చేసెనోయ్,
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయి

పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయి?
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయి!

స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టి కాదోయి
దేశమంటే మనుషులోయి!

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయి
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయి

మతం వేరైతేను యేమోయి?
మనసు లొకటై మనుషులుంటే
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయి!

దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయి,
నరుల చమటను తడిసి మూలం,
ధనం పంటలు పండవలెనోయి!

ఆకులందున అణగిమణగీ
కవిత కోయిల పలకవలెనోయి;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయి!

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ధన్యవాదాలు.

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

ధోరణి అంటే అర్ధం ఏమిటి?