Tag Archives: ఒత్తిడి

భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో…

భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు అంటూ ఉంటారు. జీవన యాత్రలో గమ్యం లేకుండా సాగిపోయే సమయంలో, అసలు జీవన యాత్ర లక్ష్యం ఏమిటి అనే ప్రశ్న వస్తే, తత్వవేత్తల జవాబు ముక్తి అంటారు.

మరి మామూలు విషయములతో ముడిపడి, సాదారణ సమయంలోనూ ఏదో ఒక ఒత్తిడిని కొని తెచ్చుకునే మనసుకు ముక్తి అంటే మూడు ఆమడల దూరం పోతుంది, కదా మరి మనసుని ముక్తివైపు మరల్చగలిగే మెటీరీయల్ ఏది? అన్న ప్రశ్న వస్తే, దానికి జవాబు భాగవతం అని భాగవతప్రియులు, ప్రవచరకారులు చెబుతూ ఉంటారు.

యోగాభ్యాసం చేస్తూ, నియమనిష్టలతో కఠిన ఆహార నియామాలతో ప్రయత్నించినా మోక్షం వస్తుందనే నమ్మకం చెప్పలేం, కానీ త్రికరణశుద్దితో రోజూ కొంతసేపు భాగవతం వింటూ, ఆ భగవంతుని తత్వం వంటబట్టించుకుంటే, మోక్షం చాలా సులువు అంటారు. అందుకేనేమో భాగవతం గురించిన తలంపు వచ్చిందంటే, ఆ జీవికి ఏదో పూర్వజన్మ సుకృతం ఉందంటారు, మన తెలుగుపండితులు.

భాగవతం వింటే శాంతి

నిత్యం ఏదో ఒక సమస్య, లేక తనతో సహచర్యం చేసేవారికి కానీ వారి వలన కానీ ఏదో ఒక సమస్యతో సతమతమయ్యే మామూలు మనిషికి, భాగవతం వింటే మోక్షం ఎలా సాధ్యం అంటే, అది చదివితే లేక వింటే అర్ధం అవుతుంది అంటారు. అయితే అది కొంచెంసేపు విన్నా, చదివినా మన:పూర్వకంగా నమ్మి శ్రద్దతో చేయమంటారు.

భగవంతుడి లీలలు గురించి చదివితే మదిగదిలో మాయ పోయి భగవానుడు మాత్రమే ఉంటాడు. తన లీలలతో మనిషి మదిగదిని నింపేస్తాడు అని భాగవతం గురించి చెబుతూ ఉంటారు. మనిషి మనసు మనిషి జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. కాలంలో కర్మలకు దు:ఖిస్తూ, సంతోషిస్తూ సాగుతుంది. ఇలాంటి మనిషి మనసు ఒక్కోసారి దు:ఖం వలన కలిగిన అనుభూతిని, సంతోష కాలంలో కూడా పొందుతూ, తను పొందవలసిన సంతోషాన్ని కూడా కోల్పోతుంది. అంటే మనసులో బలంగా ముద్రపడిన అంశం ఆధారంగా మనిషి మనసు ఒక బలమైన భావనను మోసుకెళ్లూ కాలంలో ప్రయాణం చేస్తుంది.

సాదారణస్థితిలో మనసు ఏదో ఒక సమస్యతో పాఠం నేర్చుకుంటూనే ఉంటే, కానీ కష్టం కాలంలో అనుకోకుండా వచ్చినప్పుడు మాత్రం, మనసు కకావికలం అవుతుంది, అంటారు. అటువంటి సమయంలోనే మనసుకు మరో మనసు ఓదార్పు అవసరం అంటారు. అయితే అది కొంతవరకు ఉపశమనం ఇస్తే, అసలు కష్టం అనుభవించవలసినది, దానిని దాటవలసినది కష్టం కలిగిన మనసే.

అటువంటి మనసుకు బలం తనకు తానే బలం అవ్యాలి. ఎలా మనసు తనకుతానే బలం కాగలదు అని ఆలోచిస్తే, కొందరంటారు. మనసులో కంగారు, భయం, ఆందోళన లాంటి విషయాలు ప్రక్కన పెట్టమంటారు. అలా ప్రక్కన పెట్టాలంటే ఎలా? అంటే మరికొందరంటారు.

సాదారణ సమయాలలో అయితే ఒక మాదిరి ఒత్తిడి వచ్చినప్పుడు ఏదైనా విరామం కోసం, మనసును ఉత్సాహపరచడానికి ఏదైనా సినిమా లేక హాస్యకార్యక్రమం చూసి, మనసను ఉత్తేజపరిచి, కొంచెంసేపు ఒత్తిడిని దూరం చేసినట్టే, అతి కష్టకాలంలో కూడా అదేవిధంగా అనుసరించమంటారు.

జీవితంలో అత్యంత కష్టాలు

ఇలా జీవితంలో అత్యంత ఎక్కువ కష్టాలు అనుభవించేవారు తమకొచ్చిన కష్టమే కష్టం, ఇటువంటి కష్టం ఇంతకుమునుపెన్నడు వేరెవరికి వచ్చి ఉండదు, అని భావిస్తూ ఉంటారని పండితులు చెబుతూ ఉంటారు. అలాంటప్పుడే పూర్వంలో జీవితంలో అనేక కష్టాలు వచ్చినప్పుడు, లేక అత్యంత దయనీయస్థితిలోకి జారిపోయినప్పుడు ఎవరు ఎటువంటి కష్టాలు అనుభవించారు. ఎలా వాటిని ఎదుర్కొని జీవితాన్ని గెలిచారు. ఇలాంటి గాధలను మనసును కుదుటపరుస్తాయని అంటారు.

అలాంటి గాధలతో బాటు మనల్ని నడిపించేవాడు ఒక్కడు ఉన్నాడు. ఎటువంటి కష్టం అయినా తీర్చగలడు అనేవాడి గురించి కూడా ఎరుక ఉంటే, కష్ట కాలంలో ఆ భగవానుడు ఆదుకుంటాడని తెలుగు పండితులు చెబుతూ ఉంటారు. మరి అటువంటి ఉన్నాడో లేడో కంటికి కనబడకుండా తన మహిమచేత లోకాన్ని ప్రభావితం చేసే ఆ భగవానుని గురించి తెలుసుకోవాంటే, ఆ భగవానుని చేరిన భక్తుల గురించి తెలుసుకోవాలి అంటారు. భాగవతం భక్తుల గాధలతో భగవానుని మహిమలను తెలియజేస్తుంది. ఆ గాధలలోని ఆంతర్యం అర్ధం అయితే భగవతత్వం మనసుకు గ్రహించగలిగే శక్తి వస్తుంది, అంటారు.

అటువంటి మనసుకు ఓదార్పు బంధవులు, స్నేహితులు అయినను ఓదార్పు పొందలేని మనసుకు భగవానుడే ఓదార్పు అంటారు. అలాంటప్పుడు గుర్తుకువచ్చే భగవానుడు గురించి, భగవానుడి లీలలు గురించి మీరు ముందే తెలుసుకోండి. కష్టకాలంలో మీకు భగవానుడు తలుచుకోడంలో మీమనసు విజ్ఙతను పొంది ఉంటుంది. కష్టంలో భగవానుడు ఆదుకోవడంలో చూపించిన లీలలు గురించి తెలియజేసే భాగవతం గురించిన వివిధ రచనలు మనకు ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ రూపంలో ఉచితంగా లభిస్తున్నాయి. భాగవతం గురించిన ఉచిత తెలుగుబుక్స్ రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?