పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము ప్రధానంగా చూస్తారు. నక్షత్రము యొక్క పాదమును బట్టి మొదటి అక్షరమును పేరుకు సూచిస్తారు.
మనకు నక్షత్రము చాలా ప్రధానమైనది. ఒక్కొక్కరి ప్రవర్తనను బట్టి ”వీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఇంత మొండితనం అంటారు” అంటే మనిషి గుణములు పుట్టిన నక్షత్రము మరియు లగ్నం బట్టి ముందుగానే ఎంచే అవకాశం జ్యోతిష్య శాస్త్రములో ఉంటుందనే భావన బలపడుతుంది.
నక్షత్రము యొక్క పాదమును బట్టి రాశి, రాశిలో గ్రహసంచారం, గ్రహభావములు, గ్రహ దోషములు మొదలైన విషయాలలో పండితులు జాతకమును తెలియజేస్తూ ఉంటారు. దేనికైనా పుట్టిన సమయంలో నక్షత్రము మరియు పాదము చాలా ముఖ్యమైతే, ఇంకా లగ్నము మరియు ఇతర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు.
27 నక్షత్రములు, ఆయా నక్షత్రములకు అధిదేవతలు, ఆయా నక్షత్రముల యొక్క గణము, జాతి, నక్షత్రముననుసరించి చెప్పబడే జంతువు, పక్షి, వృక్షము, రత్నం, నాడి మరియు రాశి పట్టిక ఈ క్రిందగా గమనించగలరు.
నక్షత్రం
నక్షత్రాధిపతి
అధిదేవత
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షము
రత్నం
నాడి
రాశి
అశ్విని
కేతువు
అశ్వినీదేవతలు
దేవగణము
పురుష
గుర్రము
గరుడము
అడ్డసరం,విషముష్టి,జీడిమామిడి
వైడూర్యం
ఆదినాడి
4మేషము
భరణి
శుక్రుడు
యముడు
మానవగణము
స్త్రీ
ఏనుగు
పింగళ
దేవదారు,ఉసిరిక
వజ్రము
మధ్యనాడి
4మేషరాశి
కృత్తిక
సూర్యుడు
సూర్యుడు
రాక్షసగణము
పురుష
మేక
కాకము
బెదంబర,అత్తి
కెంపు
అంత్యనాడి
1మేషము-2-4వృషభం
రోహిణి
చంద్రుడు
బ్రహ్మ
మానవగణము
పురుష
సర్పం
కుకుటము
జంబు, (నేరేడు )
ముత్యం
అంత్యనాడి
4వృషభం
మృగశిర
కుజుడు
దేవగణం
ఉభయ
సర్పం
మయూరము
చండ్ర,మారేడు
పగడం
మధ్యనాడి
2వృషభం2మిధునం
ఆరుద్ర
రాహువు
రుద్రుడు
మానవగణం
పురుష
శునకం
గరుడము
రేల,చింత
గోమేధికం
ఆదినాడి
4మిధునం
పునర్వసు
గురువు
అధితి
దేవగణం
పురుష
మార్జాలం (పిల్లి)
పింగళ
వెదురు,గన్నేరు
కనక పుష్యరాగం
ఆదినాడి
1-3మిధునం4కర్కాటకం
పుష్యమి
శనిగ్రహం
బృహస్పతి
దేవగణం
పురుష
మేక
కాకము
పిప్పిలి
నీలం
మధ్యనాడి
4కర్కాటకం
ఆశ్లేష
బుధుడు జ్యోతిషం
సర్పము
రాక్షసగణం
స్త్రీ
మార్జాలం
కుకుటము
నాగకేసరి,సంపంగి,చంపక
పచ్చ
అంత్యనాడి
4కర్కాటకం
మఖ
కేతువు
పితృదేవతలు
రాక్షసగణం
పురుష
మూషికం
మయూరము
మర్రి
వైడూర్యం
అంత్యనాడి
4సింహరాశి
పూర్వఫల్గుణి
శుక్రుడు
భర్గుడు
మానవసగణం
స్త్రీ
మూషికం
గరుడము
మోదుగ
వజ్రం
మధ్యనాడి
4సింహం
ఉత్తర
సూర్యుడు
ఆర్యముడు
మానవగణము
స్త్రీ
గోవు
పింగళ
జువ్వి
కెంపు
ఆదినాడి
1సింహం3-4కన్య
హస్త
చంద్రుడు
సూర్యుడు
దేవగణం
పురుష
మహిషము
కాకము
కుంకుడు,జాజి
ముత్యం
ఆదినాడి
4కన్య
చిత్త
కుజుడు
త్వష్ట్ర
రాక్షసగణం
వ్యాఘ్రం (పులి)
కుకుటము
తాటిచెట్టు,మారేడు
పగడం
మధ్యనాడి
2కన్య2తుల
స్వాతి
రాహువు
వాయు దేవుడు
దేవగణం
మహిషి
మయూరము
మద్ది
గోమేధికం
అంత్యనాడి
4తుల
విశాఖ
గురువు
ఇంద్రుడు,అగ్ని
రాక్షసగణం
స్త్రీ
వ్యాఘ్రము (పులి)
గరుడము
నాగకేసరి,వెలగ,మొగలి
కనక పుష్యరాగం
అంత్యనాడి
1-3తుల4వృశ్చికం
అనూరాధ
శని
సూర్యుడు
దేవగణం
పురుష
జింక
పింగళ
పొగడ
నీలం
మధ్యనాడి
4వృశ్చికం
జ్యేష్ట
బుధుడు
ఇంద్రుడు
రాక్షసగణం
…
లేడి
కాకము
విష్టి
పచ్చ
ఆదినాడి
4వృశ్చికం
మూల
కేతువు
నిరుతి
రాక్షసగణం
ఉభయ
శునకం
కుకుటము
వేగిస
వైడూర్యం
ఆదినాడి
4ధనస్సు
పూర్వాఆషాఢ
శుక్రుడు
గంగ
మానవగణం
స్త్రీ
వానరం
మయూరము
నిమ్మ,అశోక
వజ్రం
మధ్యనాడి
4ధనస్సు
ఉత్తరాషాఢ
సూర్యుడు
విశ్వేదేవతలు
మానవగణం
స్త్రీ
ముంగిస
గరుడము
పనస
కెంపు
అంత్యనాడి
1ధనస్సు2-4మకరం
శ్రవణము
చంద్రుడు
మహావిష్ణువు
దేవగణం
పురుష
వానరం
పింగళ
జిల్లేడు
ముత్యం
అంత్యనాడి
4మకరం
ధనిష్ట
కుజుడు
అష్టవసుడు
రాక్షసగణం
స్త్రీ
సింహము
కాకము
జమ్మి
పగడం
మధ్యనాడి
2మకరం2కుంభం
శతభిష
రాహువు జ్యోతిషం
వరుణుడు
రాక్షసగణం
ఉభయ
అశ్వం (గుర్రం)Kకుకుటము
అరటి,కడిమి
గోమేధికం
ఆదినాడి
4కుంభం
పూర్వాభద్ర
గురువు
అజైకపాదుడు
మానవగణం
పురుష
సింహం
మయూరము
మామిడి
కనక పుష్యరాగం
ఆదినాడి
3కుంభం1మీనం
ఉత్తరాభద్ర
శని
అహిర్పద్యువుడు
మానవగణం
పురుష
గోవు
మయూరము
వేప
నీలం
మధ్యనాడి
4మీనం
రేవతి
బుధుడు
పూషణుడు
దేవగణం
స్త్రీ
ఏనుగు
మయూరము
విప్ప
పచ్చ
అంత్యనాడి
4మీనం
పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము
మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం.
మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు
ఎందుకు సాదారణంగా చేసే పనులు కాకుండా, కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలంటే మంచి సమయం ఎంచుకుని, మంచి సమయం వచ్చేవరకు వేచి చూసి మనల్ని కొత్త పనులు ప్రారంభించమంటారు? ఎందుకు కొత్త కార్యం ప్రారంభించాలంటే మంచి చెడుల సమయం చూడాలి?
ఏదో తెలియని శక్తి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, అంతే కాకుండా ఇంగ్లీషుసైంటిష్టులు కూడా ఈ విషయం అంగీకరించినట్టుగానే లోకం చెబుతుంది. ఆ ఏదో తెలియని శక్తి ఎలా మనమీద పని చేస్తుంది. అంటే గ్రహస్థితిని బట్టి పని చేస్తుంది, అని అంటారు. ఎలా గ్రహాలు స్థితి మనపై ప్రభావం చూపుతాయి? అంటే కొందరు ఇలా అంటారు.
ఒక కంపెనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ స్థాయి ఉద్యోగులు, మీటింగులో ఉన్నప్పుడు అదే రోజు కొత్తగా జాయిన్ అయిన క్రింది స్థాయి ఉద్యోగి అవసరం పడి, మీటింగులోకి వెళితే, ఆ మీటింగులో ముఖ్యవిషయం మాట్లాడుకుంటున్నవారి దృష్టి ఆ చిన్నఉద్యోగిపై పడి, వారి స్వభావం బట్టి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం కలుగుతుంది. ఆ చిరు ఉద్యోగి ఆ ఆఫీసులో ఉన్నంతకాలం ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అలానే ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో అలాగే ఒక జీవి పుట్టినప్పుడు, ఆకాశంలో గ్రహస్థితి దృష్టి, స్థానం, భావం ఆ వ్యక్తిపై ప్రభావం ఎలా ఉండబోతుందో తెలియజేస్తాయి అంటారు.
గ్రహస్థితి సమయం బట్టి
అయితే ఆఫీసులో ఫస్ట్ ఇంప్రెషన్ పడ్డ చిన్న ఉద్యోగి, బాగా పనిచేసి, వారి మనసులో భావాలు చెరిపేసినట్టుగా, జీవి క్రమశిక్షణ వలన గ్రహస్థితి యొక్క ప్రభావం తట్టుకోవడం లేక ప్రభావం తగ్గించుకోవడంలాంటివి సాధ్యమే అంటారు. ఇలా కష్టపడి తన పైఅధికారుల అనుగ్రహం పొందిన చిన్నఉద్యోగి, ఆయా అధికారుల స్థితిని చూసి, ప్రవర్తించినట్టే, మనం కూడా కదులుతున్న కాలం గమనిస్తూ, మంచి సమయం మనకు అనుకూలంగా ఉన్న సమయంలో కొత్త ప్రయత్నం ప్రారంభిస్తే మంచిదని అంటారు.
కాలం కలసి రాకపోతే తాడు పాము అయ్యి కాటు వేస్తుంది అని అంటారు. అటువంటి కాలం చాలా విలువైనది, ఆలోచన పుట్టిన సమయం ఒక పండితుడికి, చెబితే ఆ ఆలోచన పుట్టిన సమయం ప్రభావం బట్టి మీ ఆలోచన ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పగలిగే వారు ఉంటారు. సమయం గమనిస్తూ, పనిపై శ్రద్ద పెడితే పని జరుగుతుంది. అయితే
ఒక్కోసారి తలపెట్టిన సమయం కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని పండితులు అంటారు. కాబట్టి ఒక ముఖ్యపనిని ప్రారంభించే సమయం ముందుగానే సరి చూసుకుంటే, ఆ పని మనకు ఇబ్బందులు లేకుండా అవుతుంది.కానీ కష్టం లేకుండా పని ఉండదు. అయితే కష్టం వృధా కాకుండా ఉండాలంటే, తలపెట్టే పనిని సరైనా సమయంలోనే ప్రారంభించాలి అంటారు.
నక్షత్రం యాడ్ చేసుకుంటే
అటువంటి కాలంలో ప్రస్తుతం జరుగుతున్న సమయం గ్రహస్థితిని బట్టి నక్షత్రమును ఒకసారి వెబ్ సైటులో యాడ్ చేసుకుంటే, ఆ వెబ్ సైటు ఆ నక్షత్రం గలవారికి ఏ రోజు ఎలా ఉంటుందో మూడు రంగులలో చూపుతుంది. ఆ వెబ్ సైటను గూర్చి ఈ పోస్టులో చూద్దాం. మీనక్షత్రం బట్టిమీకు మంచి–చెడులను చూపేవెబ్ సైటు
పంచాంగం ప్రకారం మన నక్షత్రమును బట్టి మంచి చెడుల సమయములను పండితులు మనకు సూచిస్తూ ఉంటారు. అయితే ఇది మనకు ప్రత్యేకమైన సంధర్భములలో మాత్రమే మనం మనకు మంచి సమయము ఎప్పుడు ఉందో సరి చూసుకుంటాం. అంటే ఏదైనా గృహప్రవేశం, బారశాల లాంటి ముఖ్యపనులలో మాత్రమే బ్రాహ్మణ పండితుల దగ్గరకు వెళ్లి సమయాసమయములను చూసుకుంటాం.
ఎవరైనా 27 నక్షత్రములలోనే ఉంటారు, అయితే అందరికీ అన్నివేళలా అనుకూల సమయముగా ఉండదు. ఒక నక్షత్రమునకు ఒక్కో లగ్నం అనుకూలంగా ఉంటే, అదే లగ్నసమయం మరొకరికి ప్రతికూలం కాగలదు. ముఖ్యకార్యములలో మనం మూహూర్తం చూసుకుని ఆరంభిస్తాం.
అయితే కొన్ని సార్లు మాత్రం ఏదైనా వ్యాపారం విషయములలో నిర్ణయం అప్పటికప్పుడు తీసుకోవాలసి ఉండవచ్చును. రోజువారీ కార్యక్రమములలో కూడా కొన్ని సార్లు కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే మనకు కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి. అయితే వాటిలో రోజువారీ మంచి-చెడుల సమయములను అప్డేట్ చేస్తూ ఉంటారు. కానీ కేవలం మన నక్షత్రముననుసరించి మనకు మేలు సమయం తెలుసుకోవాలంటే మాత్రం పండితులను కాంటాక్ట్ చేయాలి.
కానీ మంచి-చెడులు చెప్పేవారు ఈరోజులలో అందుబాటులో లేకపోవడం ఉండదు. ఎందుకంటే సాంకేతిక అభివృద్ది చెందాకా ఎవరైనా మాటలకు మాత్రం అందుబాటులోనే ఉంటారు. అయితే ఒక్కోసారి అలా పండితులను కాంటాక్ట్ చేసే సమయం కూడా మంచి సమయం కాకపోతే, అప్పటి ఆ సమయం ప్రభావం కార్యసమయం నిర్ధేశంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండకపోదు అంటారు.
అలా కాకుండా కొత్తకార్యం అయినా శుభకార్యం తలపెట్టాలనే సమయమే మంచిదా? కాదా? చెక్ చేసుకుంటే….ఆ తలంపు వచ్చిన సమయం మంచి సమయము అయ్యి ఉండి, ఆ సమయము కూడా మన నక్షత్రం ప్రకారం మనకు అనుకూలం అయితే, ఆయొక్క కార్యమునకు సంబంధించిన పనులు అన్ని చక చకా జరిగిపోతాయి అంటారు.
నక్షత్రం బలం బట్టి
ఊహూ అలా కాదు…కార్యం తలపెట్టాలనే ఆలోచన వచ్చిన సమయం, మన నక్షత్ర బలానికి వ్యతిరేకంగా ఉంటే, అది మనకు అనుకూల ఫలితం ఇవ్వకపోవచ్చును. అలాంటప్పుడు మనకు వచ్చి ఆలోచన సరైనదా? కాదా? అని సమయమును బట్టి నిర్ణయించాలంటే, మన నక్షత్రమును బట్టి మనకు అనుకూల సమయమును, ప్రతికూల సమయమును కలర్ ఇండికేషన్ రూపంలో చూపే వెబ్ సైటు అన్ని భారతీయ భాషలతో పాటు ఆంగ్లములో కూడా ఉంది.
అలా నక్షత్రమును బట్టి ఆ నక్షత్రమునకు ఏ ఏ కాలము చాలా బాగా అనుకూలంగా ఉంటే ఆ కాలము పచ్చ రంగులో ఉంటుంది. కాలము మద్యస్తంగా ఉంటే పసుపు రంగులో ఉంటుంది. ప్రతికూలంగా ఉంటే ఎరుపు రంగులో ఉంటుంది. పచ్చ రంగు సూచించే సమయములో ఆ నక్షత్రమువారుశుభకార్యములు ప్రారంభించవచ్చునని, పసుపు రంగు సూచించే సమయములో మాములు కార్యములు నిర్వహించుకోవచ్చని, ఎరుపురంగు సూచించే సమయములో ఆచితూచి వ్యవహరించమని అర్దం.
వెబ్ సైటులో ఒక్కసారి మీ పేరు, పుట్టిన తేదీ, సమయం లేదా నక్షత్రం ఒక్కసారి జత చేసి మీ బ్రౌజరులో సేవ్ చేసుకుంటే, మీరు మరలా ఆ వెబ్ సైటును చూసిన ప్రతిసారి మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటులో సమయమును తెలుసుకోవచ్చును.