మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు

ఎందుకు సాదారణంగా చేసే పనులు కాకుండా, కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలంటే మంచి సమయం ఎంచుకుని, మంచి సమయం వచ్చేవరకు వేచి చూసి మనల్ని కొత్త పనులు ప్రారంభించమంటారు? ఎందుకు కొత్త కార్యం ప్రారంభించాలంటే మంచి చెడుల సమయం చూడాలి?

ఏదో తెలియని శక్తి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, అంతే కాకుండా ఇంగ్లీషు సైంటిష్టులు కూడా ఈ విషయం అంగీకరించినట్టుగానే లోకం చెబుతుంది. ఆ ఏదో తెలియని శక్తి ఎలా మనమీద పని చేస్తుంది. అంటే గ్రహస్థితిని బట్టి పని చేస్తుంది, అని అంటారు. ఎలా గ్రహాలు స్థితి మనపై ప్రభావం చూపుతాయి? అంటే కొందరు ఇలా అంటారు.

ఒక కంపెనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ స్థాయి ఉద్యోగులు, మీటింగులో ఉన్నప్పుడు అదే రోజు కొత్తగా జాయిన్ అయిన క్రింది స్థాయి ఉద్యోగి అవసరం పడి, మీటింగులోకి వెళితే, ఆ మీటింగులో ముఖ్యవిషయం మాట్లాడుకుంటున్నవారి దృష్టి ఆ చిన్నఉద్యోగిపై పడి, వారి స్వభావం బట్టి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం కలుగుతుంది. ఆ చిరు ఉద్యోగి ఆ ఆఫీసులో ఉన్నంతకాలం ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అలానే ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో అలాగే ఒక జీవి పుట్టినప్పుడు, ఆకాశంలో గ్రహస్థితి దృష్టి, స్థానం, భావం ఆ వ్యక్తిపై ప్రభావం ఎలా ఉండబోతుందో తెలియజేస్తాయి అంటారు.

అయితే ఆఫీసులో ఫస్ట్ ఇంప్రెషన్ పడ్డ చిన్న ఉద్యోగి, బాగా పనిచేసి, వారి మనసులో భావాలు చెరిపేసినట్టుగా, జీవి క్రమశిక్షణ వలన గ్రహస్థితి యొక్క ప్రభావం తట్టుకోవడం లేక ప్రభావం తగ్గించుకోవడంలాంటివి సాధ్యమే అంటారు. ఇలా కష్టపడి తన పైఅధికారుల అనుగ్రహం పొందిన చిన్నఉద్యోగి, ఆయా అధికారుల స్థితిని చూసి, ప్రవర్తించినట్టే, మనం కూడా కదులుతున్న కాలం గమనిస్తూ, మంచి సమయం మనకు అనుకూలంగా ఉన్న సమయంలో కొత్త ప్రయత్నం ప్రారంభిస్తే మంచిదని అంటారు.

కాలం కలసి రాకపోతే తాడు పాము అయ్యి కాటు వేస్తుంది అని అంటారు. అటువంటి కాలం చాలా విలువైనది, ఆలోచన పుట్టిన సమయం ఒక పండితుడికి, చెబితే ఆ ఆలోచన పుట్టిన సమయం ప్రభావం బట్టి మీ ఆలోచన ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పగలిగే వారు ఉంటారు. సమయం గమనిస్తూ, పనిపై శ్రద్ద పెడితే పని జరుగుతుంది. అయితే

ఒక్కోసారి తలపెట్టిన సమయం కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని పండితులు అంటారు. కాబట్టి ఒక ముఖ్యపనిని ప్రారంభించే సమయం ముందుగానే సరి చూసుకుంటే, ఆ పని మనకు ఇబ్బందులు లేకుండా అవుతుంది.కానీ కష్టం లేకుండా పని ఉండదు. అయితే కష్టం వృధా కాకుండా ఉండాలంటే, తలపెట్టే పనిని సరైనా సమయంలోనే ప్రారంభించాలి అంటారు.

అటువంటి కాలంలో ప్రస్తుతం జరుగుతున్న సమయం గ్రహస్థితిని బట్టి నక్షత్రమును ఒకసారి వెబ్ సైటులో యాడ్ చేసుకుంటే, ఆ వెబ్ సైటు ఆ నక్షత్రం గలవారికి ఏ రోజు ఎలా ఉంటుందో మూడు రంగులలో చూపుతుంది. ఆ వెబ్ సైటను గూర్చి ఈ పోస్టులో చూద్దాం. మీనక్షత్రం బట్టిమీకు మంచిచెడులను చూపేవెబ్ సైటు

పంచాంగం ప్రకారం మన నక్షత్రమును బట్టి మంచి చెడుల సమయములను పండితులు మనకు సూచిస్తూ ఉంటారు. అయితే ఇది మనకు ప్రత్యేకమైన సంధర్భములలో మాత్రమే మనం మనకు మంచి సమయము ఎప్పుడు ఉందో సరి చూసుకుంటాం. అంటే ఏదైనా గృహప్రవేశం, బారశాల లాంటి ముఖ్యపనులలో మాత్రమే బ్రాహ్మణ పండితుల దగ్గరకు వెళ్లి సమయాసమయములను చూసుకుంటాం.

ఎవరైనా 27 నక్షత్రములలోనే ఉంటారు, అయితే అందరికీ అన్నివేళలా అనుకూల సమయముగా ఉండదు. ఒక నక్షత్రమునకు ఒక్కో లగ్నం అనుకూలంగా ఉంటే, అదే లగ్నసమయం మరొకరికి ప్రతికూలం కాగలదు. ముఖ్యకార్యములలో మనం మూహూర్తం చూసుకుని ఆరంభిస్తాం.

Time is gold. If you know your the current time is favor for your, that is the gold in your hand. How to find the good time as per your name or zodiac sign, click here on different color letter from this text to visit the website.

అయితే కొన్ని సార్లు మాత్రం ఏదైనా వ్యాపారం విషయములలో నిర్ణయం అప్పటికప్పుడు తీసుకోవాలసి ఉండవచ్చును. రోజువారీ కార్యక్రమములలో కూడా కొన్ని సార్లు కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే మనకు కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి. అయితే వాటిలో రోజువారీ మంచి-చెడుల సమయములను అప్డేట్ చేస్తూ ఉంటారు. కానీ కేవలం మన నక్షత్రముననుసరించి మనకు మేలు సమయం తెలుసుకోవాలంటే మాత్రం పండితులను కాంటాక్ట్ చేయాలి.

కానీ మంచి-చెడులు చెప్పేవారు ఈరోజులలో అందుబాటులో లేకపోవడం ఉండదు. ఎందుకంటే సాంకేతిక అభివృద్ది చెందాకా ఎవరైనా మాటలకు మాత్రం అందుబాటులోనే ఉంటారు. అయితే ఒక్కోసారి అలా పండితులను కాంటాక్ట్ చేసే సమయం కూడా మంచి సమయం కాకపోతే, అప్పటి ఆ సమయం ప్రభావం కార్యసమయం నిర్ధేశంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండకపోదు అంటారు.

అలా కాకుండా కొత్తకార్యం అయినా శుభకార్యం తలపెట్టాలనే సమయమే మంచిదా? కాదా? చెక్ చేసుకుంటే….ఆ తలంపు వచ్చిన సమయం మంచి సమయము అయ్యి ఉండి, ఆ సమయము కూడా మన నక్షత్రం ప్రకారం మనకు అనుకూలం అయితే, ఆయొక్క కార్యమునకు సంబంధించిన పనులు అన్ని చక చకా జరిగిపోతాయి అంటారు.

ఊహూ అలా కాదు…కార్యం తలపెట్టాలనే ఆలోచన వచ్చిన సమయం, మన నక్షత్ర బలానికి వ్యతిరేకంగా ఉంటే, అది మనకు అనుకూల ఫలితం ఇవ్వకపోవచ్చును. అలాంటప్పుడు మనకు వచ్చి ఆలోచన సరైనదా? కాదా? అని సమయమును బట్టి నిర్ణయించాలంటే, మన నక్షత్రమును బట్టి మనకు అనుకూల సమయమును, ప్రతికూల సమయమును కలర్ ఇండికేషన్ రూపంలో చూపే వెబ్ సైటు అన్ని భారతీయ భాషలతో పాటు ఆంగ్లములో కూడా ఉంది.

అలా నక్షత్రమును బట్టి ఆ నక్షత్రమునకు ఏ ఏ కాలము చాలా బాగా అనుకూలంగా ఉంటే ఆ కాలము పచ్చ రంగులో ఉంటుంది. కాలము మద్యస్తంగా ఉంటే పసుపు రంగులో ఉంటుంది. ప్రతికూలంగా ఉంటే ఎరుపు రంగులో ఉంటుంది. పచ్చ రంగు సూచించే సమయములో ఆ నక్షత్రమువారు శుభకార్యములు ప్రారంభించవచ్చునని, పసుపు రంగు సూచించే సమయములో మాములు కార్యములు నిర్వహించుకోవచ్చని, ఎరుపురంగు సూచించే సమయములో ఆచితూచి వ్యవహరించమని అర్దం.

జాతకములను నమ్మేవారికి, మంచి చెడు సమయములను పరిశీలన చేసి కొత్త పనులు ప్రారంభించేవారికి, పెద్దలను సంప్రదించే సమయము లేకపోతే ఈ వెబ్ సైట్ ఉపయుక్తముగా ఉంటుంది. మీ నక్షత్రమును బట్టి మీకు మంచి చెడు సమయములను సూచించే వెబ్ సైటును దర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

వెబ్ సైటులో ఒక్కసారి మీ పేరు, పుట్టిన తేదీ, సమయం లేదా నక్షత్రం ఒక్కసారి జత చేసి మీ బ్రౌజరులో సేవ్ చేసుకుంటే, మీరు మరలా ఆ వెబ్ సైటును చూసిన ప్రతిసారి మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటులో సమయమును తెలుసుకోవచ్చును.

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు
మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

2020 అంతా స్టాప్ దేర్ 2021?

రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

టాప్ 10గూగుల్ సెర్చ్ వర్డ్స్ ఇన్2020

వెబ్ సైట్ షార్ట్ కట్స్ ఇన్ ఒన్ స్క్రీన్