వీరసింహారెడ్డి మూవీ రివ్యూ తెలుగు సినిమా నందమూరి బాలకృష్ణ గత చిత్రం అఖండ సూపర్ హిట్… తర్వాత ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాతో వెండితెరపై బాలయ్య గర్జన మొదలైంది. సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన ఈ తెలుగు సినిమా బాగుందనే మాట, ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఫ్యాక్షన్, డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలసిన ఈ సినిమా అభిమానులకు పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.
సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన వీరసింహారెడ్డి సినిమా కధ… అన్నా చెల్లళ్ళ మధ్య బంధం ఎక్కువ సినిమాలలో ఉంటే, వీరసింహారెడ్డి సినిమా మాత్రం అన్నాచెల్లెళ్ల మద్యం వైరం కనబడుతుంది. వీరసింహారెడ్డికి చెల్లెలు అంటే చాలా ఇష్టం. కానీ అతనిపై చెల్లెలకు ద్వేషం ఉంటుంది. ఆమె ద్వేషం ఎలా ఉంటుందంటే, అన్నపై కోపంతో, అన్నకు వైరి అయిన వ్యక్తినే పెళ్ళాడుతుంది. కానీ అన్నగా తన చెల్లెలపై అభిమానం చూపుతూనే ఉంటాడు, వీరసింహారెడ్డి. అంతగా అభిమానం చూపుతున్న అన్నపై చెల్లెలకు కక్ష తగ్గదు… అతడు విదేశాలకు వెళితే, ఆ విదేశాలలోనే చంపించేయడానికి పధకమే పన్నుతుంది. పధకం ప్రకారం వీరసింహారెడ్డిని అతడి చెల్లెలే, కత్తితో పొడిపిస్తుంది. తానే పొడిచినట్టుగా సంతోషిస్తుంది. అయితే విదేశాలలో కత్తిపోటుకు గురి అయిన వీరసింహారెడ్డి మరణించాడా? అన్నా చెల్లెళ్ళు మద్య వైరం పోయిందా? ఇదే సినిమా కధ.
ఫ్యాక్షన్ సినిమా కధలో చెల్లెలు సెంటుమెంటుతో గతంలో సమరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్. ఆ తరహాలోనే ఈ సినిమాలో సెంటిమెంట్ పండించే ప్రయత్నం జరిగింది. వీరసింహారెడ్డిగా బాలకృష్ణ, అతని చెల్లెలుగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించారు. పాటలు బాగున్నాయి. బాలకృష్ణ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సంగీతం ప్లస్ పాయింట్… దర్శకుడుగా గోపించంద్ మరొక విజయం వైపు వెళుతున్నట్టే…
ధన్యవాదాలు
తెలుగులో వ్యాసాలు
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలు
మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు