హరికథా కాలక్షేపం గురించి రాయండి
హరికథా కాలక్షేపం గురించి రాయండి… హరికథా కాలక్షేపం అనేది భారతీయ సంస్కృతిలో భాగమై ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హరికధలు చెప్పడం ప్రసిద్దిగా ఉండేవి. సినిమాలు రాకముందు నాటక ప్రదర్శనలు ఉంటే, ఆ కాలంలో హరికధా కాలక్షేపం ఎక్కువగా ఉండేవి.
ఎందుకంటే నాటకాలు ఎక్కువమంది పాల్గొనాలి కానీ హరికధ అయితే ఒకరు చెబుతూ ఉంటే, అతనికి తాళం వేసేవారివురు ఉంటే చాలు. కావునా అప్పట్లో హరికధా కాలక్షేపం ఊరూ వాడా ఎక్కువగా ఉండేవి. వాటలో హిందూ పురాణాలు మరియు ఆధ్యాత్మిక గ్రంథాల నుండి కథలు శిక్షణ పొందిన వ్యక్తిచేత చెప్పించబడేవి. హరికధా కాలక్షేపంలో తరచుగా సంగీతం మరియు గానంతో కూడి ఉంటాయి.
“హరికథ” అనే పదం సంస్కృత పదాలు “హరి” నుండి వచ్చింది, అంటే “విష్ణు” లేదా “దేవుడు” మరియు “కథ” అంటే “కథ”. విష్ణువు గురించి చెప్పడమే ప్రధానంగా ఉండేది కాబట్టి హరికధ అన్నారు.
శ్రీహరి గురించి చెబుతుంటే, శ్రీమహావిష్ణువు గురించి వింటూ, స్థితికారుని గురించి తలంపులతో మనసు కూడి ఉంటుంది కాబట్టి దానిని హరికథా కాలక్షేపంగా చెప్పేవారు.
వీటి పురమాయింపులు గ్రామ పెద్దలు చేపడితే, గ్రామాలలో ప్రజలు పురాణ పురుషుడి గాధలు వినేవారిని అంటారు. “కథాకాలక్షేపం కళాకారుడు” అని పిలువబడే ప్రదర్శకుడు, ప్రేక్షకులకు నైతిక మరియు ఆధ్యాత్మిక పాఠాలను తెలియజేయడానికి కథ చెప్పడం, నటన మరియు ప్రసంగం యొక్క కలయికను ఉపయోగిస్తాడు.
ఇలా హరికథా కాలక్షేపంలో భాగంగా చెప్పబడిన హరికథలు
భాగవతంలోని శ్రీమహావిష్ణువు అవతారాలు. ఎక్కువగా ఉండేవి. ఇప్పటికీ తిరుపతిలో హరికథా కాలక్షేపంగా శ్రీహరికథలు చెప్పబడుతూ ఉంటాయి.
ధన్యవాదాలు.