Tag Archives: ఆలోచనలు

వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి

వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి ! అంటే వ్యక్తి యొక్క తత్వమును తెలియజేయునదిగా చెప్పబడుతుంది. సమాజంలో వ్యక్తి తన యొక్క తత్వముతో ప్రభావం చూపుతూ ఒక గుర్తింపును పొందుతూ ఉంటే, ఆ తత్వమును అతని యొక్క వ్యక్తిత్వముగా చెబుతూ ఉంటారు.

వ్యక్తిత్వంలో వ్యక్తి యొక్క లక్షణాలు, గుణాలు, అభిరుచులు మొదలైనవి మిళితమై ఉంటాయి. వ్యక్తి తనకు ఉన్న విశిష్టమైన లక్షణాల వలన, గుణాలు వలన, అభిరుచుల వలన తన యొక్క ప్రవర్తనతో వివిధ పరిస్థితులలో వివిధ విధాలుగా గుర్తింపు పొందుతూ ఉంటాడు. అయితే వ్యక్తి అన్ని చోట్లా అన్ని వేళలా శోభించే గుణాలు, లక్షణాలు అతని యొక్క స్వభావముగా గుర్తింపు పొంది, అది ఆ వ్యక్తి యొక్క విశిష్ట తత్వముగా గుర్తింపు పొందుతుంది.

మనిషి యొక్క వ్యక్తిత్వమును పూర్తిగా ప్రభావితం చేసే అతని యొక్క మనసు మాత్రమే. ఎవరి మనసు వారి యొక్క ప్రవర్తనకు కారణం కాగలదని అంటారు. మనసులో ఏర్పడిన భావాలు, మనసులో గుర్తుగా మారిన సంఘటనలు, మనసులో గుర్తించబడిన విషయాలు, మనసులో కదులుతు ఆలోచనలు కలిసి సంఘర్షణగా మారుతుంటే, మనిషి యొక్క చేతలు తదనుగుణంగా ఉంటూ ఉంటే, తత్పరిణామ ఫలితమే మనిషికి ఒక గుర్తింపు పొందగలగడంలో మనసు తన ప్రత్యేకతను చాటుతుంది. ఇందుకు ఆ మనిషి చుట్టూ ఉంటే పరిస్థితలు, వ్యక్తులు కూడా బాగస్వామ్యం కాగలవు.

వ్యక్తి వ్యక్తిత్వం పై ప్రభావం

గుర్తింపు పొందిన వ్యక్తి యొక్క మనసు తన గుర్తింపును కొనసాగించడానికి ఆలోచనలు చేస్తుందని అంటారు. అలాగే అతనికి గుర్తింపును ఆపాదించినవారు కూడా సదరు ఆలోచనలకు కారణం కాగలరు. మొత్తానికి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పెరుగుతున్న పరిస్థితులలో నేర్చుకున్న విషయ పరిజ్ఙానం, స్నేహం చేస్తున్న వ్యక్తుల, సంరక్షణ చేస్తున్న వ్యక్తుల ప్రభావంతో పాటు తన మనసు యొక్క స్పందనలు అనుసరించి… వ్యక్తిత్వం ఏర్పడుతూ… ఉంటుంది.

ఒక్క పూటలోనూ… ఒక్క నెలలోనూ వ్యక్తిత్వం ఏర్పడదు… అది పెరుగుతున్న వయస్సు నుండి… తన చుట్టూ ఉన్న వ్యక్తుల మరియు పరిస్థితుల ప్రభావం ప్రకారం ప్రతిస్పందిస్తున్న తీరు బట్టి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఒక్కసారి గుర్తింపు పొందిన వ్యక్తిత్వం జీవితకాలంపాటు కొనసాగుతుంది.

ఆసక్తులు, ఆశలు, కోరికలు, కోరికలు తీర్చుకోవడానికి సహకరిస్తున్నవారు, కోరికలు తీర్చుకోవడంలో భాగస్వాములు అవుతున్నవారు, కోరికలకు కారణం అవుతున్నవారు… ఆశలు కల్పిస్తున్నవారు… ఆశలు సృష్టిస్తున్న పరిస్థితులు, ఆశలకు కారణం అవుతున్నవారు… ఇలా ఏదైనా ఒక స్వభావం వృద్ది చెందడానికి వ్యక్తి మనసుతో బాటు సమాజం కూడా కారణం కాగలదు.

వ్యక్తిని బట్టి సమాజం దృష్టి, సమాజం తీరుని బట్టి వ్యక్తి

లోకంలో వ్యక్తిని బట్టి సమాజం దృష్టి, సమాజం తీరుని బట్టి వ్యక్తి ప్రవర్తన ఉంటుందని అంటారు. సమాజంలో వ్యక్తి జీవించాలి. కాబట్టి సమాజంలోని పోకడలు గమనిస్తూ, తన అవసరాల కొరకు తను మాట్లాడవలసినవారితో మాట్లాడుతూ, పనిచేయవలసిన చోట పని చేస్తూ, పని చేయించవలసిన చోట పని చేయిస్తూ… సమాజంలో తన యొక్క మనుగడకు తను ప్రవర్తించే ప్రవర్తన ఆధారంగా గుర్తింపు పొందే వ్యక్తి స్వభావం లేదా వ్యక్తిత్వంగా ఉంటుంది.

వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి

మనసుకు బాగా దగ్గరగా మెసిలేవారికి వ్యక్తి యొక్క పూర్తి వ్యక్తిత్వం తెలియబడుతుంది. ఎక్కువమందికి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో కొన్ని గుణాలు మాత్రమే తెలియబడతాయి.

ఒక సినిమా హీరో నటనా చాతుర్యం ఒక విశిష్ట గుణం అయితే, అది సినిమా ప్రేక్షకులందరికీ తెలియబడుతుంది. కానీ ఆ సినిమా హీరోయొక్క వ్యక్తిత్వం గురించి మాత్రమే అతనికి బాగా దగ్గరగా మెసిలే మనుషులకే తెలియబడుతుంది.

పాపులారిటీని బట్టి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పూర్తిగా అంచనా వేయలేం…. అలాగే వ్యక్తిని బాగా దగ్గరగా పరిశీలించేవారికి మాత్రమే పూర్తి స్థాయి వ్యక్తిత్వం తెలియబడుతుంది. వారికే అతని యొక్క మంచి మరియు చెడు ఆలోచనల తీరు తెలియబడుతుంది.

ఒక వ్యక్తి వ్యక్తిత్వం మరొక వ్యక్తి వ్యక్తిత్వం

లోకంలో ఒక వ్యక్తి వ్యక్తిత్వం మరొక వ్యక్తి వ్యక్తిత్వం ఒకదానితోఒకటి ప్రభావం చూపగలవు.

ఇద్దరు వ్యక్తులు: ఏ అను ఒక వ్యక్తి, బి అను మరొక వ్యక్తి ఉన్నారనుకుంటే.

ఏ అను వ్యక్తి మనసులో పుట్టిన ఒక ఆలోచన బి అను వ్యక్తి మనసుపై ప్రభావం చూపింది. అప్పుడు బి అను వ్యక్తి యొక్క మనసు ప్రతిస్పందించడంలో వలన ఏ అను వ్యక్తి మనసు ప్రభావితం అవుతుంది. మరలా ఏ అను వ్యక్తి ప్రతిస్పందిస్తే, తిరిగి బి అను వ్యక్తి ప్రతిస్పందించడం జరుగుతుంది. ఇలా… ఇద్దరు వ్యక్తుల మద్య స్పందనలు ఉండవచ్చును.

అలా సమాజంలో ఇద్దరు వ్యక్తుల మద్య సంబంధాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి వివిధ వ్యక్తులతో బంధమేర్పడి ఉంటుంది. ఒక వ్యక్తికి… అన్న లేక తమ్ముడు, అక్కా లేకా చెల్లెలు, బావ లేక బావమరిది, మేమమామ, మేనత్త, మామగారు, అల్లుడుగారు, చిన్నాన్న, పెదనాన్న, పిన్నమ్మ, పెద్దమ్మ… ఇలా రకరకాల బంధాలతో వ్యక్తి మనసు ఎదుగుతూ… తను గ్రహించిన విషయాల వలన, తను గుర్తు పెట్టుకున్న సంఘటనల వలన, తనపై ప్రభావం చూపిన పరిస్థితులతో బాటు… నేర్చిన విద్యాబుద్దుల వలన వ్యక్తి వ్యక్తిత్వం ప్రభావితం అవుతూ ఉంటుంది.

మనసు ఒక సముద్రం అయితే, సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. సముద్రపు అలలు ఆనందాన్నిస్తాయి. సముద్రపు లోతు ఎరుగము. సముద్రం పౌర్ణమినాడు పోటెత్తుతుంది. సముద్ర పొంగితే, అది వికృత ప్రభావం చూపుతుంది… అలా సముద్రం గురించి చెబుతూ ఉంటారు. అలా ఒక మనిషి గురించి చెప్పేటప్పుడు అతనికి విశిష్టంగా వ్యక్తిత్వం అను సర్టిఫికెట్ లభిస్తుంది.

విషయములు ఆలోచన పుస్తకం

విషయములు ఆలోచన పుస్తకం ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ మూడు మనసును ప్రభావితం చేస్తాయి. విషయములు ఆలోచనలు కలిగిస్తే, మంచి విషయాలు మంచి ఆలోచనలను కలిగిస్తాయి.

లోకంలో అనేక అంశములలో అనేక విషయాలు ఉంటాయి. అనేకమంది వ్యక్తులు, అనేక విషయాలతో సంఘం కలిగి ఉంటే, మరి ఆలోచనలు ఎన్ని ఉంటాయి?

విషయములతో ప్రభావం చెందే మనసుకు మొదట్లో తెలిసిందేమిటి? ఆలోచనలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి.

తనును తాను చూసుకోకుండా అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోతుంది మనసు. ఒకప్పుడు కష్టంలో తననితాను చూసుకుంటుంది. స్థితిని చూసుకుంటుంది. ఆలోచనలో పడుతుంది.

కష్టంలో ఓదార్పు అందుకునే మనసుకు మిత్రులు, బంధువులు, ఆత్మీయులు ఉంటారు. పుస్తకం పఠనం అలవాటు ఉన్నవారికైతే, పుస్తకం కూడా ఒక మిత్రుడు వంటివాడు.

పరిశోధనాత్మకమైన పుస్తకాలు చదివే అలవాటు అయితే, ఒక పరిశోదకుడు మనసుకు మిత్రుడుగా ఉంటాడు. భక్తిపరమైన బుక్స్ చదివే అలవాటు ఉంటే, ఓ భక్తపరాయణుడు మిత్రుడుగా మనసు లభిస్తాడు.

తాత్విక చింతనను ప్రబోదించే బుక్స్ అయితే ఓ తత్వవేత్త మనసుకు మిత్రుడుగా లభిస్తాడు. ఎటువంటి పుస్తకాలు చదువుతుంటే, అటువంటి మిత్రత్వం పుస్తకాల ద్వారా మనసుకు లభిస్తుంది.

పుస్తకపఠనం గొప్ప అలవాటుగా చెబుతారు. అంటే వ్యక్తికి ఉండవలసిన మంచి అలవాట్లలో పుస్తకం చదవడం అనే మంచి మంచి అలవాటు కూడా ఉండాలని చెబుతారు.

పుస్తకం చదవుతూ ఉన్నంతసేపూ మనసు ఒక విషయంపై ఏకాగ్రదృష్టితో దృష్టితో ఉంటుంది.

చదువుతున్న పుస్తకం ఇంకా భారతీయ సాహిత్యం అంటే మరీ మంచిదని అంటారు. పుస్తకం చదవడం అంటే అందులో వ్రాసి ఉన్న విషయంతో మనసు కాసేపు ప్రశాంతతో ప్రయాణం చేయడమే అవుతుందని అంటారు.

మనకు పుస్తకములు విశిష్టమైన విషయములను మనసుకు తెలియజేస్తాయి. చదివే పుస్తకంలోని విషయసారమును మనసులోకి చేరుస్తాయి. కొన్ని మనోవికాసం పుస్తకాలు మననుసు మందు వంటివి అంటారు. ఎలాంటి పుస్తక పఠనం ఉంటే, అలాంటి భావన పెరుగుతుంది.

భక్తి పుస్తకాలు చదవడం అలవాటు అయితే, మనసు భక్తి భావనతో ఉంటుంది. కాసేపు ఏదైనా ఒక భక్తి పుస్తకం చదువుతూ ఉంటే, మనసు కాసేపు ఏకాగ్రతతో ఆ దైవంపై భక్తిభావంతో ఉంటుంది…


మనోవిజ్ఙానం కలిగిన పుస్తకాలు మనసులో వికాసమును తీసుకువస్తాయి. తెలుగు సాహిత్యంలో గల విశిష్టమైన పుస్తకాలు విశిష్టమైన ఫలితాలనే అందిస్తాయి.. అయితే దృష్టి సారించడమే కష్టం అంటారు. మనసుపై మనసే యుద్ధం చేయాలంటే మనసు ఎందుకు సిద్దపడుతుందని కూడా అంటారు.

పుస్తకం మనసును ఒక విషయంపై దృష్టి పెట్టేలాగా చేస్తుంది. పుస్తకంలో ఉండే ప్రధాన లక్షణం ఇదే… ఈ లక్షణం వలన మన మనసు ఏకాగ్రత పెరుగుతుంది.

ఏదైనా ఒక పుస్తకం చదువున్నంతసేపూ మనసు ఆ పుస్తకంలోని అంశంతో మమేకమై ఆలోచనలను కొనసాగిస్తుంది. అలా ఒక విషయంపై విచారణ మనసుకు అలవాటు పడుతుంది.

విజ్ఙానంతో కూడిన పుస్తకాలు విషయములపై వివరణలు, విధానములను తెలియజేస్తాయి. అలాగే మనో విజ్ఙానంతో కూడిన పుస్తకాలు మనసు గురించిన స్వభావమును, మనసు తీరు తెలియజేస్తాయి.

ఇటువంటి మనోవిజ్ఙానమయ పుస్తకాలు రీడ్ చేయడం వలన మనసుకు మనసుతోనే చెలిమి ఏర్పడుతుందని అంటారు.

ఎక్కడ ఏది ఉందో చూసి తెలుసుకుంటాం. ఎక్కడ ఏది వినబడుతుందో విని తెలుసుకుంటాం. ఎక్కడ ఎలాంటి వస్తువు ఉందో తాకి తెలుసుకుంటాం…

కానీ చూడడం,వినడం, తాకడం తదితర విషయాలను తెలుసుకునే మనసు మాత్రం కనబడదు. చిత్రమైన మనసు విచిత్రమైన మనసుకు మనసే మిత్రుడు అవుతుంది. కొన్నిసార్లు శత్రువు కూడా అవుతుందని అంటారు.

ఇలాంటి మనసును కట్టడి చేయాలంటే, మనోమయవికాస పుస్తకాలు రీడ్ చేయాలి….

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి

మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి ఆలోచనలు అయితే విజ్ఙానవంతమైన తెలుగు పుస్తకాలు చదివితే విజ్ఙానం గురించిన ఆలోచనలు అంటే, ఎటువంటి తెలుగు పుస్తకాలు చదివితే అటువంటి ఆలోచనలు అంటారు.

తెలుగు పుస్తకాలు విజ్ఙానంతో కూడి, విషయ పరిజ్ఙానం అందిస్తాయని అంటారు. వివిధ రంగాలలో వివిధ వర్గాలలో ఉండే వివిధ తెలుగు పుస్తకాలు వివిధ రకాల విజ్ఙానంతో కూడి ఉంటాయి. సమాజం, చరిత్ర, సామాజిక అంశాలు తదితర అంశాలతో సోషల్ తెలుగు పుస్తకాలు ఉంటే, మూలకాలు, అణువులు, జీవులు, జీవ పరిణామం తదితర అంశాలతో సైన్సు ఇలా వివిధ విభాగాలుగా విజ్ఙానం పుస్తక రూపంలో ఉంటుంది.

పుస్తకాల పరిజ్ఙానం ఆయా విషయాలలో ఊహాత్మక శక్తి ని పెంపొందిస్తాయని అంటారు. పరమాణువు గురించి తెలిపే తెలుగు పుస్తకాలు పరమాణువు గురించిన విషయాలను విశిదీకరిస్తాయి. అణువు, పరమాణువు, పదార్ధం తదితర విషయాలలోని విజ్ఙానం తెలియజేస్తాయి. పరిసరాల విజ్ఙానంతో కూడిన తెలుగు పుస్తకాలు పరిసరాలపై పరిజ్ఙానం అందిస్తాయి. వాటిని చదివి, అవగాహన చేసుకున్నవారికి పరిసరాల గురించిన విజ్ఙానం తెలియవస్తుంది.

If telugu books read

చరిత్రను తెలిపే తెలుగు పుస్తకాలు చదివితే, చరిత్రకారుల అభిప్రాయం తెలియవస్తుంది. గత చరిత్రలో జరిగిన విషయాలలో ఊహాశక్తి వస్తుందని అంటారు. ఏ ప్రాంత చరిత్రను ఏ తెలుగు పుస్తకాలు తెలియజేస్తున్నాయో, ఆయా ప్రాంతాలవారు ఆయా తెలుగు పుస్తకాలు చదవడం వలన వారి ప్రాంతపు గతకాలపు విషయాలపై అవగాహన ఏర్పడవచ్చును.

భారత దేశం భిన్న సంస్కృతులతో, భిన్న భాషలతో కూడి ఉంటుంది. వివిధ భాషలలో ఉండే విజ్ఙానం, మాతృభాషలో చదివితే బాగా అర్ధం అవుతుందని అంటారు. తెలుగు రాష్ట్రాలలో ఉండే వారు తెలుగులో వ్రాయబడిన సాహిత్యం, విజ్ఙానం, వ్యక్తిత్వ వికాసం, చరిత్ర, జీవిత చరిత్రలు తదితర తెలుగు పుస్తకాలు తెలుగువారికి బాగా అవగాహన తెస్తాయని అంటారు. తెలుగులోనే పుట్టి పెరిగిన వారికి అక్షరజ్ఙానం రాకముందే తెలుగు మాట్లాడడం వలన, విద్యాభ్యాసంలో మరింతగా తెలుగుపై పట్టు పెరుగుతుంది.

గతకాలపు తెలుగువారు రచించిన తెలుగు పుస్తకాలు తెలుగువారు చదవడం వలన తెలుగువారికి విషయావగాహన త్వరగా ఏర్పడుతుందంటారు. ఇంకా తెలిసిన తెలుగులోనే ఉండడం వలన వేగంగా విషయపరిజ్ఙానం పట్టుకోగలుగుతారని అంటారు. తెలుగు పుస్తకాలు విజ్ఙానమును తెలుగువారికి అందుబాటులో ఉండడం కోసం, గతకాలపు మహానుభావులు రచించి ఉంటారు. తెలుగులో అక్షరజ్ఙానం ఉన్నవారికి తెలుగు ప్రాంతాలలోనే పుట్టి పెరగడం వలన తెలుగులో అవగాహన సులభం. కాబట్టి తెలుగు పుస్తకాలలో విషయ విజ్ఙానం మనకు బాగా తెలియబడుతుంది. అయితే తెలుగు భాష గురించి తెలిసి ఉంటే, అది మరింత మేలు అంటారు.

ఏ ప్రాంతం వారికి ఆయా ప్రాంతాలలో ఉండే తెలుగు పుస్తకాలు ఆయా ప్రాంత చరిత్రను, ఆయా ప్రాంతపు గతకాలపు సంస్కృతిని తెలియపరుస్తూ ఉంటాయి. ఏ ప్రాంతంవారు ఆయా ప్రాంతీయ భాషలలో కూడా పట్టు కలిగి ఉండడం విజ్ఙానంతో బాటు సంస్కృతిపైకూడా అవగాహన ఉంటుందని అంటారు.

తెలుగు పుస్తకాలు స్ఫూర్తిని నింపితే

తెలుగు పుస్తకాలు స్ఫూర్తిని నింపితే, ఆ స్ఫూర్తి వ్యక్తిత్వ వికాసానికి కారణం కాగలదని అంటారు. వివిధ వ్యక్తుల రచనలు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయని అంటారు. కొందరి ప్రసంగాలు స్ఫూర్తిని నింపితే, కొందరి రచనలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కొందరి జీవితాలు స్ఫూర్తివంతంగా సాగుతాయి. అటువంటివారి జీవితాలు భవిష్యత్తులో జీవిత చరిత్ర తెలుగు పుస్తకాలు మారి ఉంటాయని అంటారు.

స్ఫూర్తిని కలిగించడంలో వ్యక్తిత్వ వికాసం, మనో విజ్ఙానం, గొప్ప గొప్ప నాయకుల జీవిత చరిత్రలు సహాపడతాయి. దేశంలో అనేక మంది గొప్పవారుగా కీర్తింపబడ్డారు. వారు గొప్పవారు కావడానికి వారికి స్ఫూర్తి ఏమిటి? అనే విషయం వారి జీవిత చరిత్రలు తెలుగు పుస్తకాలు చదివితే తెలియవస్తుంది. ఇతర ప్రాంతాల వారి జీవిత చరిత్రలు అయినా మన మాతృభాషలో వ్రాయబడి లేక తర్జుమా చేయబడి తెలుగు పుస్తకాలు మనకు లభిస్తాయి.

మహాత్మగాంధీ గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన దేశనాయకుడు. ఉద్యమాలకు నాయకత్వం వహించిన జాతిపిత, అంటే ఆయన అందరికీ స్పూర్తిని కలిగిస్తారు. అయనకు స్ఫూర్తి ఎవరంటే, ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాలి. అలా గొప్పవారి జీవిత చరిత్రలు చదవడం వలన జీవితంలో కష్టంలో మనిషి ఎటువంటి స్ఫూర్తిని కలిగి ఉండాలో తెలియబడుతుందని అంటారు.

బాల్యదశ నుండే చదువుతున్న స్ఫూర్తివంతమైన తెలుగు పుస్తకాలు స్ఫూర్తిని నింపితే, ఆ వ్యక్తి వ్యక్తిత్వం వికసిస్తుందని అంటారు. సైన్స్ విజ్ఙానం అందిస్తే, సోషల్ సమాజం గురించి తెలియజేస్తే, తెలుగు తెలుగు సాహిత్యం గురించి తెలియజేస్తే, వీటికి తోడు వ్యక్తికి కావాలసిన స్ఫూర్తి, పట్టుదల, వినయం, విధేయత తదిరత మనోవిజ్ఙాన విషయాలు జీవిత చరిత్రలు, వ్యక్తిత్వ వికాసం తదతర తెలుగు పుస్తకాలు చదవాలని అంటారు. మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి ఆలోచనలు.. విజ్ఙానం గురించి అయితే విజ్ఙానపరమై విషయాలు తెలుస్తాయి.

మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి భావనలు బలపడతాయి

మైండును గురించిన తెలుగు పుస్తకాలు చదివితే, మైండు పవర్ గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. శరీరం గురించి, ఆరోగ్యం గురించి తెలుగు పుస్తకాలు చదివితే, వాటిపై శ్రద్ద పెరుగుతుంది. ఎటువంటి తెలుగు పుస్తకాలు చదివితే అటువంటి భావనలు బలపడతాయి. స్ఫూర్తిదాయకమైన తెలుగు పుస్తకాలు చదివితే స్ఫూర్తివంతమైన ఆలోచనలు స్ఫురిస్తాయని అంటారు.

మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి భావనలు బలపడతాయి. అలా బలపడిన మంచి భావనలు మంచి ఆలోచనలు కలిగిస్తూ ఉంటాయని అంటారు. మంచి తెలుగు పుస్తకాలు అంటే, మనిషికి, సమాజానికి మేలు చేసేవిగా ఉండాలని అంటారు.

కష్టంలో కృంగిపోయే మనసుకు ఆలోచనను కలుగజేస్తే స్ఫూర్తిదాయకమైన మాటలు బలం అవుతాయని అంటారు. అటువంటి మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి భావనలు పెరుగుతాయని అంటారు. మంచి భావన మంచి ఆలోచననే తీసుకువస్తుందని అంటారు. మంచి ఆలోచనల వలన మనసు శాంతితో ఉండగలదని అంటారు. వ్యక్తి శాంతితో ఉంటే, అతనితో బాటు, అతని కుటుంబానికి మేలు, తద్వారా సమాజానికి మేలు.

వ్యక్తి అశాంతితో ఉంటే, అతనికి ఆందోళన. అతని ద్వారా అతని కుటుంబానికి ఇబ్బంది… కాబట్టి మంచి ఆలోచనలకు మంచి పుస్తకాలు ఎంపిక చేసుకుని చదవడం మేలని అంటారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం చాలా చాలా ప్రధానం. అటువంటి ఆత్మవిశ్వాసం దెబ్బతినే స్థితికి వ్యక్తి వెళితే, స్ఫూర్తిని నింపే తెలుగు పుస్తకాలు, మంచి ఆలోచనలు కలిగించే తెలుగు పుస్తకాలు పఠించడం మేలు అంటారు.

మహా పురుషుల జీవితములు తెలుగు పుస్తక రూపంలో ఉంటే, అవి మంచి భావనల బలపరుస్తూ ఉంటాయి. వారి జీవితములలో జరిగిన సంఘటనలు పరిస్థితుల ప్రభావం గురించి తెలియజేస్తాయి. పరిస్థితుల ప్రభావంతో వ్యక్తి జీవితం ముడిపడి ఉన్న విధానం తెలియవస్తుందని అంటారు. కష్టకాలంలో వ్యక్తి నిలబడవలసిన విలువల గురించి మహాపురుషుల జీవితములు తెలియజేస్తాయని అంటారు.

గతకాలపు తెలుగురీడ్స్.కామ్ తెలుగులోని తెలుగు పోస్టులు చదవడానికి ఈ క్రింది బటన్లను తాకండి లేక క్లిక్ చేయండి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు

తెలుగుబుక్స్ మనకు మంచి ఆలోచనలు పెంచేవిగా కొన్ని ఉంటే, సెక్స్ పరమైన కోరికలను రేకెత్తెంచేవిగా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. మరికొన్ని సామాజికపరమైన ఆలోచనలు కలిగేలా కొన్ని తెలుగుబుక్స్ ఉంటాయి. అయితే ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు మన మనసులో బలపడతాయని అంటారు.

భక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, రక్తిని తెలియజేసే తెలుగుబుక్స్, విధానం తెలియజేసే తెలుగుబుక్స్, చరిత్రను తెలియజేసే తెలుగుబుక్స్, జీవితచరిత్రలను తెలియజేసే తెలుగుబుక్స్, సామాజిక బాధ్యతను తెలియజేసే తెలుగుబుక్స్, పాఠాలను తెలియజేసే తెలుగుబుక్స్ ఇలా వివిధ అంశములలో ఆయా అంశములను తెలియజేస్తూ తెలుగుబుక్స్ మనకు అందుబాటులో ఉంటాయి. మనకు లభించే తెలుగుబుక్స్ లలో ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయని అంటారు.

అసలు బుక్స్ రీడింగ్ అంటే ఏమిటి? అంటే ఏ బుక్ చదువుతున్నామో ఆ బుక్ లో వ్రాయబడి ఉన్న అంశంతో మన మనసు మమేకం అవుతుంది అంటారు. ఏకాగ్రతతో ఒక పాఠ్యపుస్తకం చదువుతుంటే, ఆ పాఠ్యపుస్తకంలోని విషయం మన మనసులో చేరి, అది మరలా పరీక్షల సమయంలో గుర్తుకు వస్తుంది. చదువుకునే వయస్సులో పాఠ్యపుస్తకములలో ఏ సబ్జెక్టును ఇష్టంగా చదువుతామో, ఆ సబ్జెక్టులోని విషయాలు ఎప్పటికీ గుర్తుకు ఉంటాయి. అలాగే మనకు భక్తి, రక్తి, చరిత్ర, విజ్ఙానం, శాస్త్రీయం, సామాజిక బాధ్యత తదితర అంశాలలో ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు పెరిగే అవకాశం ఎక్కువ అంటారు.

ఎందుకు ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు వస్తాయి?

భక్తి తెలుగుబుక్స్ రీడ్ చేయడం వలన ఆ భక్తి పుస్తకంలో ఉన్న భక్తిభావనను మన మనసు పట్టుకుంటుంది. ఏ దేవతా స్వరూపం గురంచి ఎక్కువ ఇష్టంతో బుక్ రీడ్ చేస్తామో, ఆ దేవతా స్వరూపం మన మనసులోకి చేరుతుంది. ఆ దేవతపై ఇష్టం పెరుగుతుంది. ఆ దేవునిపైనే ఆలోచనలు మన మనసులో మెదులుతాయి. భక్తిభావం పెంచుకోవడానికి చాలామంది భక్తి తెలుగుబుక్స్ రీడ్ చేయడం ఒక అలవాటుగా పెట్టుకుంటారు.

చరిత్రకు సంబంధించిన తెలుగుబుక్స్ రీడ్ చేయడం మొదలుపెడితే, లేదా చదువుకుంటున్న వయస్సు నుండే చరిత్ర తెలుగుబుక్స్ పై ఇష్టం ఉంటే, మనలో చరిత్రపై అవగాహన ఎక్కువగా ఉంటుంది. చరిత్ర గురించ ఇంకా తెలుసుకోవాలనే తపన ఉంటుంది. చరిత్ర గురించిన ఆలోచనలు ఉంటాయి. చారిత్రాత్మక పరిశోధన చారిత్రక తెలుగుబుక్స్ రీడ్ చేస్తూ మన మనసు చేస్తుంది అంటారు.

విజ్ఙానం అంటే తెలుసుకోడం అంటారు. తెలుగు వైజ్ఙానిక బుక్స్ రీడ్ చేస్తుంటే, వైజ్ఙానిక విషయాలే మనసు తలపోస్తుంది. ఎటువంటి విజ్ఙాన తెలుగుబుక్స్ రీడ్ చేస్తే, అటువంటి ఆలోచనలే మనసు చేస్తుంది అంటారు. సెక్స్ విజ్ఙానం తెలుగుబుక్స్ రీడ్ చేయడం వలన మన మనసు సెక్స్ కోసం ఆలోచనలు చేస్తూ, సెక్స్ కోసం తపించేలాగా మారుతుంది. భారతీయ విజ్ఙానం గురించిన తెలుగుబుక్స్ రీడ్ చేస్తే, భారతీయ విజ్ఙానం గురించి అవగాహనతో భారతీయ సంప్రదాయంపైనే అలోచనలు సాగుతాయని అంటారు. సాంకేతిక విజ్ఙానం గురించిన తెలుగుబుక్స్ రీడ్ చేయడం వలన సాంకేతికపరమైన ఆలోచనలు పెరిగి, సాంకేతిక పరికరాలపై ఆసక్తి పెరుగుతుంది.

సామాజిక అంశంలో సామాజిక తెలుగుబుక్స్ రీడ్ చేయడం వలన సామాజిక పరమైన అవగాహన ఏర్పడుతుంది. సామాజిక బాధ్యత గురించిన ఆలోచనలు కలుగుతాయని అంటారు. గతకాలంలోని సామాజిక పరిస్థితులపై అవగాహన బుక్ రీడింగ్ వలనే తెలియవస్తాయని అంటారు. సామాజికపరమైన ఊహలకు ప్రేరణ, సామాజికవ్యవస్థను తెలియజేసే తెలుగుబుక్ రీడింగ్ వలన వస్తాయి అంటారు.

మనం సెక్స్ బుక్స్ రీడ్ చేస్తే – సెక్స్ పై కోరిక మరింతగా..

ఎవరు సెక్స్ బుక్స్ చదివితే సెక్స్ కు సంబంధించిన ఆలోచనలే వారికి ఎక్కువగా ఉంటాయి అంటారు. సెక్స్ పరమైన కోరికలు మనిషికి వయస్సును బట్టి శరీరంలో మార్పుల వలన సహజంగానే వస్తాయి. ఇంకా సెక్స్ తెలుగుబుక్స్ చదవడం వలన సెక్స్ పరమైన ఆలోచనలు మరింత పెరుగుతాయి. అయితే తెలుగులో సెక్స్ తెలుగు బుక్స్ లో నైతిక విలువలు అంటూ ఏమి లేకుండా కేవలం సెక్స్ చేయడం గురించి మాత్రమే తెలియజేస్తూ, చెడ్డ ఆలోచనలకు ఎక్కువ అవకాశం కలిగించే సెక్స్ తెలుగు బుక్స్ రీడ్ చేయడం వలన సామాజిక బాధ్యతను విస్మరించేలా చేస్తాయి. అనైతికంగా ఆకర్షించడానికి కేవలం కామాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండే సెక్స్ బుక్స్ అనవసర సందేహాలకు తావిస్తాయని అంటారు. అలా కాకుండా సెక్స్ తెలుగు విజ్ఙానం అందించే బుక్స్, సహజంగా యువతలో సెక్స్ పై వచ్చే సందేహాలకు సమాధానాలు ఇచ్చే మంచి సెక్స్ బుక్స్ రీడ్ చేయడం వలన, కోరికపై నియంత్రణ ఉండే అవకాశం ఉంటుంది. కానీ కేవలం స్త్రీపై అసభ్య పదజాలం వాడుతూ, స్త్రీపై అగౌరవ భావనను పెంచేవిధంగా సాగే రచనలను చదవకుండా ఉండడమే మేలు అంటారు.

లభించే తెలుగు పుస్తకాలలో… సెక్స్ తెలుగుబుక్స్, భక్తి తెలుగుబుక్స్, చారిత్రక తెలుగుబుక్స్, సామాజిక తెలుగుబుక్స్ ఇలా ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు కలుగుతాయి. కాబట్టి మన వయసుకు తగ్గట్టుగా సమాజంలో ఎటువంటి పనులు చేయడం ద్వారా నలుగురిలో మనకు గౌరవం పెరుగుతుందో? అటువంటి అంశములకు సంబంధించిన తెలుగుబుక్స్ రీడ్ చేయడం వలన ఉపయోగం ఉంటుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?